రామిరెడ్డి (నటుడు)

గంగసాని రామిరెడ్డి భారతదేశపు ప్రముఖ నటుడు. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి, అ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, భోజ్‌పురి భాషలలో ప్రతినాయకుడిగా దాదాపు 250 చిత్రాలలో నటించాడు.

రామిరెడ్డి
రామిరెడ్డి
జననం
గంగసాని రామిరెడ్డి

ఇతర పేర్లుఅంకుశం రామిరెడ్డి
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1990 - 2011
ఎత్తు5 ft 10 in (178 cm)

వ్యక్తిగత జీవితం మార్చు

రామిరెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా తలుపుల మండలం. ఓబుల రెడ్డిపల్లిలో జన్మించాడు. రామిరెడ్డి చదువు అంతా హైదరాబాద్లోనే సాగింది. ఉస్మానియాయూనివర్శిటీ నుంచి జర్నలిజంలో పట్టా పొందిన[1] ఇతను నటుడు కాక మునుపు ఓ ఉర్దూ పత్రికలో విలేఖరిగా పనిచేశాడు.[2] కొంతకాలం మూత్రపిండాల సంబంధ వ్యాధి కారణంగా మృత్యువు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు.[3][4] కానీ అదే వ్యాధితో హైదరాబాదులోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2011 ఏప్రిల్ 14న మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.

సినిమాలు మార్చు

1989 లో రాజశేఖర్ కథానాయకుడిగా వచ్చిన అంకుశం సినిమాలో ప్రతినాయకుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాకే నంది పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ప్రధాన ప్రతినాయకుడిగా అవకాశాలు లభించాయి. అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ్ పేరుతో పునర్నిర్మాణం చేస్తే, అందులో కూడా ప్రధాన ప్రతినాయకపడుగా నటించాడు. అంకుశం, ఒసేయ్ రాములమ్మా, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు, అడవిచుక్క, నాగప్రతిష్ఠ (2003), తెలుగోడు, జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా, వీడు మనవాడే అతనికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు. అతని ఆఖరి చిత్రం మర్మం. ఎక్కువగా ప్రతినాయక పాత్రలే పోషించినా పెద్దరికం, అనగనగా ఒక రోజు లాంటి చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాడు.

పేరుపడ్డ సంభాషణలు మార్చు

  • స్పాట్ పెడతా

కేసు మార్చు

2007 జనవరి 19, శనివారం రాత్రి 11:45 సమయంలో మెహదీపట్నం లోని రైతు బజార్ సమీపంలో పోలీసులు అతనిని మద్యంతాగి వాహనం నడుపుతున్నందుకు అరెస్టు చేశారు. ఆ సమయంలో రామిరెడ్డి నగర శివార్లలో ఓ కార్యక్రమానికి హాజరై శ్రీనగర్ కాలనీలో ఉన్న తన ఇంటికి వస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మరుసటి రోజు బెయిల్ పై విడుదల చేశారు.[5]

మూలాలు మార్చు

  1. Srinivas (2011-04-14). "అంకుశం రామిరెడ్డి కన్నుమూత: జర్నలిస్టు నుండి విలన్‌గా ఎదిగిన వైనం". telugu.oneindia.com. Retrieved 2022-02-25.
  2. "Actor Rami Reddy passes away". thehindu.com. Kasturi and Sons. Retrieved 12 September 2016.
  3. "Never seen".
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-11-07. Retrieved 2010-11-04.
  5. Staff, Reporter (21 January 2007). "Actor Rami Reddy held for drunken driving". The Hindu. Kasturi and Sons. Retrieved 12 September 2016.