ఆవిరి యంత్రం అనగా ఒక యంత్రం, ఇది వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని శక్తిగా మార్చి యంత్రాన్ని కదిలించగలిగేలా చేసి ఫ్యాక్టరీ పనులకు లేదా రైలు లేదా పడవలను కదలించేందుకు ఉపయోగిస్తున్నారు. 18 వ శతాబ్దపు తొలి నాళ్ళలో ఆవిరి యంత్రాలను మైన్ పంపులలో ఉపయోగించడం ప్రారంభమైంది, 1770 లో జేమ్స్ వాట్ ద్వారా బాగా అభివృద్ధి చెందాయి. యంత్రాలు పని చేయడానికి గుర్రాలు, గాలిమరలు, వాటర్‌మిల్లుల స్థానములలో ఆవిరి యంత్రాలను ఉంచారు, ఇవి ప్రవేశపెట్టిన ఈ సమయం పారిశ్రామిక విప్లవానికి చాలా ముఖ్యమైనది. మొదటి ఆవిరి యంత్రాలు పిస్టన్ యంత్రాలు. ఆవిరి పీడనం ఒక పిస్టన్ మీద ఒత్తిడి కలుగజేసినపుడు పిస్టన్ తో పాటు ఉన్న సిలిండర్ కదులుతుంది, ఈవిధంగా ఇది రెసిప్రోకల్ (ముందుకు, వెనుకకు) కదలికలను కలిగి ఉంటుంది. ఈ కదలిక పంపును నేరుగా కదిలిస్తుంది లేదా క్రాంక్ (వృత్తాకార చలనము కలిగించు వంగిన ఇరుసు) ని పనిచేయించటం ద్వారా అది చక్రాన్ని తిప్పుతుంది, యంత్రాన్ని పనిచేయిస్తుంది. ఆవిరి యంత్రాలు, యంత్రాలను పని చేయించేందుకు, గనులలోని పంపులు కదలించడానికి కర్మాగారాల్లో ఉపయోగించారు. తరువాత రైల్వే వాహనాలు, ఆవిరి పడవలు (స్టీమ్ బోట్లు) తరలించడానికి చిన్న ఇంజిన్లు తయారు చేయబడ్డాయి. ఆవిరి యంత్రానికి శక్తినిచ్చే నీటి ఆవిరి ఒక బాయిలర్ లో తయారు చేయబడుతుంది, బాయిలర్ లో ఉన్న నీటిని వేడి చేయడం ద్వారా ఆ ఆవిరి తయారవుతుంది. చాలా చోట్ల అగ్నితో బాయిలర్ వేడిచేస్తారు. అగ్ని కోసం ఇంధనాలుగా కలప, బొగ్గు, లేదా పెట్రోలియం ఉపయోగించవచ్చు. అగ్నికి బదులుగా అణుశక్తి లేదా సౌర శక్తిని ఉపయోగించవచ్చు. బాయిలర్ నుంచి నీటి ఆవిరి బయటికి వచ్చేటప్పుడు ఒక పిస్టన్ పై బలాన్ని ప్రయోగిస్తుంది. తద్వారా ఆ పిస్టన్ ఒకవైపుకు కదులుతుంది. బయటికి వెళ్లుతున్న నీటి ఆవిరిని ఒక కవాటము పిస్టన్ యొక్క చివరికి వెళ్లేలా చేస్తుంది, ఆ ఆవిరి మళ్ళీ పిస్టన్ వెనుకకు మళ్లేలా బలాన్ని ప్రయోగిస్తుంది, దీనితో పిస్టన్, నీటి ఆవిరి యధాస్థానానికి వస్తాయి, ఈ విధంగా నీటి ఆవిరిని కవాటముల అదుపుతో పదేపదే పిస్టన్ ముందుకు వెనుకకు కదిలేలా ఈ ఆవిరి యంత్రాలను రూపొందిస్తారు. ఈ విధమైన పిస్టన్ కదలికలను ఉపయోగించి చక్రాలు తిరిగేలా చేస్తారు లేదా ఇతర యంత్రాలను నడిపిస్తారు.

ఆవిరితో నడిచే యంత్రం నమూనా
Schematic animation of a uniflow steam engine.
The poppet valves are controlled by the rotating camshaft at the top. High pressure steam enters, red, and exhausts, yellow.
Operation of a simple oscillating cylinder steam engine
ఆవిరితో నడిచే బండి నమూనా

ఆవిరి యంత్రం ద్వారా స్టీము లోకోమోటివ్రైల్లు 160 సంవత్సారాలు సరుకుల రవాణలో, ప్రయాణీకులను గమ్యం చేర్చుటకు సేవలందించాయి.

ఇవి కూడా చూడండి

మార్చు