ఆశీర్వాద్

హృషికేష్ ముఖర్జీ దర్శకత్వంలో 1968లో విడుదలైన బాలీవుడ్ సినిమా

ఆశీర్వాద్, 1968లో విడుదలైన బాలీవుడ్ సినిమా.[1][2] హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశోక్ కుమార్, వీణ, సుమిత్ సన్యాల్, సంజీవ్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.[3][4] ఈ సినిమాలో అశోక్ కుమార్ ప్రదర్శించిన ర్యాప్ లాంటి పాట, "రైల్ గాడి", "నవ్ చలి"లకు గుర్తింపు వచ్చింది.[5] 1969లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు హిందీలో ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ నటుడు (అశోక్ కుమార్) పురస్కారాలు వచ్చాయి.[6]

ఆశీర్వాద్
ఆశీర్వాద్ సినిమా పోస్టర్
దర్శకత్వంహృషికేష్ ముఖర్జీ
రచనఅనిల్ ఘోష్ (కథ)
గుల్జార్ (మాటలు)
నిర్మాతహృషికేష్ ముఖర్జీ
ఎన్.సి. సిప్పీ
తారాగణంఅశోక్ కుమార్
వీణ
సుమిత్ సన్యాల్
సంజీవ్ కుమార్
ఛాయాగ్రహణంటి.బి. సీతారాం
కూర్పుహృషికేష్ ముఖర్జీ
సంగీతంవసంత్ దేశాయ్
గుల్జార్
విడుదల తేదీ
1968
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం

మార్చు
 • అశోక్ కుమార్ (శివనాథ్ "జోగి ఠాకూర్" చౌదరి)
 • సంజీవ్ కుమార్ (డాక్టర్ బీరెన్‌)
 • సుమితా సన్యాల్ (నీనా "బిట్టు" ఎస్. చౌదరి)
 • వీణ (నటి) (లీలా ఎస్. చౌదరి, రాణి మా)
 • సజ్జన్ (నటుడు) (రామదాస్ మునిమ్జీ)
 • హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ (బైజు "ధోలాకియా")
 • పద్మ ఖన్నా (రుక్మిణి)
 • బిపిన్ గుప్తా
 • ఎస్.ఎన్. బెనర్జీ (మోహన్/మామాజీ)
 • అమర్ కుమార్
 • బ్రహ్మ భరద్వాజ జోగి ఠాకూర్ తరఫున న్యాయవాది
 • లీఫ్ గాంధీ ('సాఫ్ కరో, ఇన్సాఫ్ కరో' లో నర్తకి)
 • అభి భట్టాచార్య (జైలర్‌)
 • సారిక (మున్నీ/నీనా)
 • బేబీ దీపాలి (యువ నీనా/బిట్టు)
 • దేవ్ కిషన్ (మహాదేవ్ వీధి సినిమా విక్రేత)
 • హర్బన్స్ దర్శన్ ఎం అరోరా (సారిక తండ్రి మున్ని)
 • కేదార్‌నాథ్ సైగల్ (రేడియో బ్రాడ్‌కాస్టర్‌)
 • అమోల్ సేన్ (జైలులో మెడికల్ వార్డ్ గార్డు)
 • అశిం కుమార్

కథా సంగ్రహం

మార్చు

జోగి ఠాకూర్ ఉన్నత ఆశయాలు కలిగిన సాధారమైన వ్యక్తి. తన మామగారి ఆస్తులను చూసుకుంటూ తన భార్యతో కలిసి ఇల్లరికం ఉంటాడు. తన భార్య ఆదేశానుసారం, పేదల ఇళ్లను తగులబెట్టాలనే ఉత్తర్వుపై ఎస్టేట్ చీఫ్ అకౌంటెంట్ చాకచక్యంగా తన సంతకాలను పొందాడని తెలుసుకున్నప్పుడు అతను తన భార్యతో తెగతెంపులు చేసుకుని,కూతురు నీనాను విడిచిపెట్టి, తాను జీవించి ఉన్నంత వరకు తిరిగి రానని శపథం చేస్తూ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అతను ముంబైకి వెళ్లి అక్కడ ఒక పార్క్‌లో పిల్లలకు వినోదాన్ని అందించడం ద్వారా జీవనోపాధి పొందుతాడు. అతను యాదృచ్ఛికంగా, నీనా అనే పేరుకల అమ్మాయిని ప్రత్యేకంగా ఇష్టపడతాడు. దురదృష్టవశాత్తు, ఆ అమ్మాయి అనారోగ్యంతో చనిపోతుంది.

జోగి తన గ్రామం చందన్‌పూర్‌కి తిరిగి వస్తాడు. అక్కడ తన స్నేహితుడు బైజు కుమార్తె అపహరణకు గురైందని తెలుసుకుంటాడు. ఎస్టేట్ చీఫ్ అకౌంటెంట్ ఆమెపై అత్యాచారం చేయబోయే సమయానికి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించడానికి అతన్ని చంపేస్తాడు. గ్రామస్తులు జోగిని రక్షించడానికి ఒక బూటకపు కథను తయారు చేస్తారు, కానీ అతడు కోర్టులో నిజం చెప్పి జైలుకు వెళతాడు. అక్కడ తోటను పెంచడం ప్రారంభిస్తాడు. జైలులో ఉన్న డాక్టర్ బీరెన్ అతనిని ప్రత్యేకంగా ఇష్టపడతాడు. యాదృచ్ఛికంగా, జోగి ఠాకూర్ కుమార్తె నీనాకు బీరేన్‌తో వివాహం జరగనున్నట్లు జోగి టాకూర్ తెలుసుకుంటాడు. తన కూతురు నేరస్థులను ద్వేషిస్తుందని కూడా తెలుసుకుని ఆమె వచ్చినప్పుడు తన ముఖాన్ని చాటేస్తాడు. దురదృష్టవశాత్తు, అతని మంచి ప్రవర్తనకు ప్రభుత్వం క్షమాభిక్ష ఇచ్చే సమయానికి జోగి అనారోగ్యానికి గురవుతాడు. డాక్టర్, అతడిని తండ్రిగా భావించాడు. అతను జైలు నుండి బయటికి వచ్చే రోజు తన పెళ్లికి ముందు రోజు అని జోగి ఠాకూర్‌తో చెప్పాడు. జోగి ఠాకూర్ తన కుమార్తె పెళ్లిని చూడాలనే కోరికతో రహస్యంగా అక్కడికి వెళతాడు.విందు కోసం గుమిగూడిన బిచ్చగాళ్ళతో చేరాడు. అతను ఆమెకు తన ఆశీర్వాదాలు అందించి, హడావిడిగా బయలుదేరాడు. అయితే, అతను రోడ్డుపై కుప్పకూలడంతో అతని చుట్టూ ప్రజలు గుమిగూడారు. అతని చివరి క్షణంలో తన తండ్రిని కలవడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న అతని కుమార్తెకు వార్త చేరుతుంది.

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
 1. "aashirwad". www.rottentomatoes.com. Retrieved 2021-08-11.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "Ashirwad (1968)". Indiancine.ma. Retrieved 2021-08-11.
 3. "Aashirwad (1968) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
 4. "Aashirwad - Film Cast, Release Date, Aashirwad Full Movie Download, Online MP3 Songs, HD Trailer | Bollywood Life". www.bollywoodlife.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-11.
 5. "Hrishikesh Mukherjee's best films: Aashirwad (1969)". Rediff.com Movies. 28 August 2006. Retrieved 30 July 2013.
 6. Times of India, Entertainment. "National Awards Winners 1968: Complete list of winners of National Awards 1968". timesofindia.indiatimes.com. Archived from the original on 12 May 2021. Retrieved 11 August 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 11 మే 2021 suggested (help)

బయటి లింకులు

మార్చు