సంజీవ్ కుమార్ (జన్మ నామం: హరిహర్ జెఠాలాల్ జరీవాలా 9 జూలై 19386 నవంబర్ 1985) ఒక పేరుపొందిన భారతీయ చలనచిత్ర నటుడు. ఇతడు అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలో ఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉన్నాయి. ఇతడు సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.

సంజీవ్ కుమార్
संजीव कुमार
తపాలా బిళ్ళపై సంజీవ్ కుమార్
జననం
హరిహర్ జెఠాలాల్ జరీవాలా[1]

(1938-07-09)1938 జూలై 9
సూరత్, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1985 నవంబరు 6(1985-11-06) (వయసు 47)
మరణ కారణంగుండెపోటు
ఇతర పేర్లుహరిభాయ్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1960–1985

ప్రారంభ జీవితం, నేపథ్యం మార్చు

సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా (హరిభాయ్ అని కూడా వ్యవహరించబడేవాడు)[1][2] ఇతడు గుజరాత్ లోని సూరత్ లో ఒక గుజరాతీ పటేల్ కుటుంబంలో జన్మించాడు. ఇతని బాల్యం సూరత్‌లో గడచింది. తరువాత ఇతని కుటుంబం ముంబాయికి తరలి వెళ్ళింది. అక్కడ ఒక ఫిలిం స్కూలులో సంజీవ్ కుమార్ శిక్షణ పొందాడు. తద్వారా బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడ్డాడు. ఇతని ఇరువులు సోదరులు ఒక సోదరి ఉన్నారు.

సినిమారంగం మార్చు

ఇతడు తన నట జీవితాన్ని నాటకరంగం ద్వారా ప్రారంభించాడు. మొదట ఇతడు ముంబాయిలోని "ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్(IPTA)", పిమ్మట "ఇండియన్ నేషనల్ థియేటర్" సంస్థల నాటకాలలో వేషాలు వేశాడు.[2] రంగస్థల నటుడిగా ఇతడు 22 ఏళ్ల వయసులో ముసలి వేషాలు వేసేవాడు.

ఇతని సినిమా ప్రస్థానం 1960లో హమ్‌ హిందుస్తానీ అనే సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా ఆరంభమైంది. 1965లో నిశాన్ అనే సినిమా ద్వారా కథా నాయకుడి వేషాలు వేయడం మొదలు పెట్టాడు. 1968లో సంఘర్ష్ సినిమాలో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌తో కలిసి నటించాడు. ఇతడు హిందీ సినిమాలలోనే కాక మారాఠీ, తెలుగు, పంజాబీ, సింధీ, తమిళ, గుజరాతీ సినిమాలలో కూడా నటించాడు. ఇతడు గుల్జార్, ఎ.కె.హంగల్, హృషీకేశ్ ముఖర్జీ, యశ్ చోప్రా, సుభాష్ ఘాయ్, సత్యజిత్ రే మొదలైన దర్శకులతో పనిచేశాడు. అరుణా ఇరానీ, జయ బాధురి, ఎల్.విజయలక్ష్మి,రాఖీ, లీనా చంద్రావర్కర్, సులక్షణా పండిట్, మౌసమీ చటర్జీ, యోగీతా బాలీ, అపర్ణా సేన్, షర్మిలా ఠాగూర్ మొదలైన నటీమణుల సరసన నటించాడు. ఇతడు నటించిన షోలే చిత్రంలో ఠాకూర్ పాత్ర ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. నయాదిన్ నయీరాత్ సినిమాలో తొమ్మిది పాత్రలను ధరించాడు. ఈ పాత్రలను తమిళం (నవరాత్రి)లో శివాజీ గణేశన్, తెలుగు(నవరాత్రి)లో అక్కినేని నాగేశ్వరరావు పోషించారు.

వ్యక్తిగత జీవితం మార్చు

ఇతడు జీవితాంతం అవివాహితుడిగానే ఉండిపోయాడు. ఇతడు హేమా మాలినితో 1973 నుండి సన్నిహితంగా మెలిగాడు. తరువాత నటి సులక్షణ పండిట్‌తో సంబంధం నెరిపాడు కానీ ఇరువురూ అవివాహితులుగానే మిగిలిపోయారు.[3] సంజీవ్ కుమార్ సులక్షణా పండిట్‌ను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె అవివాహితగానే ఉండి పోయింది. ఇతనికి సినిమా పరిశ్రమలో రాజేష్ ఖన్నా, శశికపూర్, షర్మిలా టాగూర్, తనూజ, దేవేన్ వర్మ, శివాజీ గణేశన్, బి.నాగిరెడ్డి, సారిక మొదలైన వారితో సన్నిహితమైన స్నేహ భాంధవ్యాలున్నాయి.

ఆరోగ్య సమస్యలు, మరణం మార్చు

ఇతడికి పుట్టుకతోనే గుండె సంబంధమైన లోపంతో జన్మించాడు. ఇతని కుటుంబ సభ్యులలో ఎక్కువమంది 50 ఏళ్లకు మించి బ్రతుకలేదు. ఇతనికి 1979లో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పుడు అమెరికాలో బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. అయినా 1985, నవంబర్ 6న 47వ యేట తీవ్రమైన గుండెపోటు వచ్చి మరణానికి దారితీసింది.ఇతని తమ్ముడు నికుల్ ఇతని కంటే ముందు మరణించాడు. మరొక సోదరుడు కిశోర్ ఇతని తరువాత 6 నెలలకు గతించాడు.[1][4] ఇతడు సినిమాలలో అనేక వృద్ధపాత్రలను పోషించినప్పటికీ నిజజీవితంలో 50 యేళ్లు కూడా బ్రతకలేక పోవడం విషాదకరమైన విషయం. ఇతడు నటించిన సుమారు పది సినిమాలు ఇతడి మరణానంతరం విడుదలయ్యాయి. 1993లో విడుదలైన ప్రొఫెసర్ కి పడోసన్ ఇతడు నటించిన ఆఖరి సినిమా.

అవార్డులు మార్చు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు మార్చు

ఫిలింఫేర్ అవార్డులు మార్చు

ఇతడు 11 మార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా మొత్తం 14 పర్యాయాలు ఫిలింఫేర్ పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు,[6] వాటిలో రెండు సార్లు ఉత్తమ నటుడిగా ఒకసారి ఉత్తమ సహాయనటునిగా ఎంపిక కాబడ్డాడు. వివరాలు:

  • ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన
    1971 ఖిలోనా – విజయ్ కమల్ ఎస్.సింగ్
    1974 కోషిశ్ – హరిచరణ్ మాథుర్
    1976 షోలే – ఠాకూర్ బలదేవ్ సింగ్
    1977 మౌసమ్‌ – డా.అమర్‌నాథ్ గిల్
    1978 యేహీ హై జిందగీ – ఆనంద్ నారాయణ్
    1978 జిందగీ – రఘు శుక్లా
    1979 దేవత – టోనీ/తరుణ్ కుమార్ గుప్తా
    1979 పతి పత్ని ఔర్ వో – రంజీత్ ఛద్దా
    1983 అంగూర్ – అశోక్ ఆర్.తిలక్

ఇతర అవార్డులు మార్చు

  • 1974 - కోషిశ్ చిత్రానికి ఉత్తమ నటుడిగా బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (BFJA) అవార్డు.[7][8]
  • 1969 - నావల్ స్టార్స్ అవార్డ్, ఎస్.ఎం.నందా చేత షానూ వరుణ్ ట్రోఫీ
  • 1975 - సినీగోయర్స్ కౌన్సిల్ (ఢిల్లీ) ఫిలిం అవార్డు
  • 1976 - మౌసమ్‌ చిత్రానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నార్త్ కలకత్తా వారిచే యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.
  • ఉత్తర్ ప్రదేశ్ ఫిలిం పత్రకార సంఘ్ అవార్డు
  • కళాశ్రీ ఆర్ట్ & నెట్‌వర్క్ జీవన సాఫల్య మిలీనియం 2000 అవార్డ్
  • 18వ జాతీయ భరత్ పురస్కారం
  • ఆంధ్రప్రదేశ్ ఫిలిం జర్నలిస్ట్ అవార్డ్

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర వివరణ
1993 ప్రొఫెసర్ కి పడోసన్ ప్రొఫెసర్ విద్యాధర్ మరణానంతరం విడుదలైనది
1989 ఊంఛ్ నీచ్ బీచ్
1988 నా ముంకిన్
1988 దో వక్త్ కీ రోటీ
1987 రాహీ డా.ప్రభాత్ కుమార్
1986 లవ్ అండ్ గాడ్ కైస్ -ఇ - అమిర్ (మజ్ను) మరణానంతరం విడుదలైంది
1986 కాంచ్ కీ దీవార్
1986 బాత్ బన్ జాయే సూరజ్ సింగ్
1986 హాథోఁ కీ లఖీరేఁ డాక్టర్ సాబ్
1986 కత్ల్ రాకేష్
1985 రామ్‌ తేరే కిత్నే నామ్‌ రామ్‌ కుమార్ (పేటూ రామ్) శివాజీ గణేశన్ నటించిన "రామన్ ఎథనై రామనది" తమిళ సినిమా రీమేక్
1985 జబర్దస్త్ రతన్ కుమార్
1984 బద్ ఔర్ బద్నామ్
1984 లాఖోఁ కీ బాత్ అడ్వకేట్ ప్రేమ్‌ సాగర్
1984 పాఖండి
1984 యాద్‌గార్ రాయ్ కల్పనాథ్ రాయ్
1983 హీరో దామోదర్ మాథుర్
1982 సురాగ్
1982 హాథ్‌కడీ హరిమోహన్/సాకియా/గోపాల్ దాస్ మిత్తల్
1982 అంగూర్ అశోక్, ద్విపాత్రాభినయం ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన
1982 ఆయాస్ ఠాకూర్ జస్వంత్ సింగ్
1982 ఖుద్‌దార్ హరి శ్రీవాత్సవ్
1982 లోగ్ క్యా కహెంగే
1982 నమ్‌కీన్ గెరూలాల్
1982 సవాల్
1982 శ్రీమాన్ శ్రీమతి శంకర్ లాల్ తాయారమ్మ బంగారయ్య రీమేక్
1982 సింధూర్ బనే జ్వాలా
1982 విధాత అబూ బాబా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు – ప్రతిపాదన
1981 సిల్‌సిలా డా.వి.కె.ఆనంద్
1981 దాసి ఆనంద్
1981 ఇత్నిసీ బాత్ రాజా
1981 బీవీ ఓ బీవీ కల్నల్ మంగళ్ సింగ్/శంకర్
1981 చెహ్రే పే చెహ్రా డా.విల్సన్/బ్లాక్‌ స్టోన్
1981 లేడీస్ టైలర్
1981 వక్త్‌కీ దీవార్ విక్రమ్
1980 హమ్‌ పాంచ్ కృష్ణ పడువారళ్ళి పాండవరు రీమేక్
1980 అబ్దుల్లా
1980 బే రెహమ్
1980 ఫౌజీ చాచా ఫౌజీ చాచా పంజాబీ సినిమా
1980 జ్యోతి బనే జ్వాలా అతిథి పాత్ర
1980 పత్తర్ సే టక్కర్
1980 స్వయంవర్ రామ్‌ గుండమ్మ కథ సినిమాకు రీమేక్
1980 టక్కర్ సూరజ్/కిషన్ దేవుడు చేసిన మనుషులు రీమేక్
1979 కాలా పత్తర్ డా.రమేష్
1979 గృహ ప్రవేశ్ అమర్
1979 బాంబే బై నైట్
1979 ఘర్ కీ లాజ్
1979 హమారే తుమ్హారే జైరాజ్ వర్మ
1979 జానీ దుష్మన్ ఠాకూర్
1979 మాన్ అపమాన్ శంకర్
1979 నౌకర్ అమర్
1978 దేవతా టోనీ/తరుణ్ కుమార్ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన.
శివాజీ గణేశన్ నటించిన "జ్ఞాన ఓలి" తమిళ సినిమా రీమేక్
1978 ముఖద్దర్
1978 పతి పత్ని ఔర్ వో రంజీత్ చద్దా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన
1978 సావన్ కే గీత్
1978 స్వర్గ్ నరక్ పండిట్ సోహన్ లాల్ త్రిపాఠీ
1978 త్రిశూల్ రాజ్ కుమార్ గుప్తా/ఆర్.కె.గుప్తా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు – ప్రతిపాదన
1978 తుమ్హారే లియే ప్రకాష్/గంగాధర్ ఉపాధ్యాయ్
1977 ఉయంధవర్కల్ సంజీవ్ కుమార్ తమిళ సినిమా
అతిథి పాత్ర
1977 ముక్తి రతన్
1977 షత్రంజ్ కే ఖిలాడీ మీర్జా సజ్జాద్ అలి
1977 యేహీ హై జిందగీ ఆనంద్ నారాయణ్ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన.
"కలియుగ కణ్ణన్" తమిళ సినిమా రీమేక్.
1977 ఇమాన్ ధరమ్ కబీర్ దాస్
1977 ఆలాప్ రాజా బహద్దూర్ అతిథి పాత్ర
1977 అంగారే రాకేష్
1977 అప్నాపన్ రాజన్ రస్పాల్ సింగ్
1977 ధూప్ ఛావో డా.పరాశ్
1977 దిల్ ఔర్ పత్తర్
1977 పాపి అశోక్ రాయ్
1977 విశ్వాస్‌ఘాత్ మహేష్/రాజు
1976 జిందగీ రఘు శుక్లా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన
1976 అర్జున్ పండిట్ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు
1976 దో లడికియా
1975 మౌసమ్ డా.అమర్‌నాథ్ గిల్ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన
1975 ఫరార్ ఇన్‌స్పెక్టర్ సంజయ్
1975 షోలే ఠాకూర్ బలదేవ్ సింగ్ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు - ప్రతిపాదన
1975 ఆక్రమణ్ మేజర్ అజయ్ వర్మ
1975 ఆంధి జె.కె. ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు
1975 అప్నే దుష్మన్ డాక్టర్
1975 అప్నే రంగ్ హజార్ సునీల్
1975 ధోతీ లోటా ఔర్ చౌపట్టీ ఇన్‌స్పెక్టర్ వాగ్లే
1975 ఉల్జాన్ ఆనంద్
1974 ఊర్వశి తెలుగు సినిమా
1974 కుఁవారా బాప్ డాక్టర్
1974 ఆప్ కీ కనమ్ మోహన్
1974 అర్చన ప్రకాష్
1974 చరిత్రహీన్ ఇంద్రజీత్ ముఖర్జీ
1974 చౌకీదార్ డా.శ్యామ్
1974 దావత్
1974 ఇమాన్ మాధవ్/లఖన్
1974 మనోరంజన్ కానిస్టేబుల్ రతన్/షేరూ
1974 నయా దిన్ నయీ రాత్ ఆనంద్/స్వామీరహస్యానంద్/మిస్టర్ సారంగ్/ సేఠ్‌ధన్‌రాజ్/షేర్‌సింగ్/నాలుగు ఇతర పాత్రలు తొమ్మిది విభిన్న ప్రాత్రలు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన నవరాత్రి రీమేక్
1974 షాన్‌దార్ రాజన్ రాజ్‌కుమార్ నటించిన కన్నడ సినిమా "కస్తూరి నివాస" రీమేక్
1973 అగ్ని రేఖ
1973 భారత విలాస్ అతిథి పాత్ర, తమిళ సినిమా
1973 అనామిక దేవేంద్ర దత్
1973 అన్‌హోనీ ఇన్‌స్పెక్టర్ సునీల్
1973 దూర్ నహీ మంజిల్ కేవల్
1973 మన్‌చలీ సుశీల్ కుమార్
1973 సూరజ్ ఔర్ చందా సూరజ్
1972 పరిచయ్ నీలేష్ అతిథి పాత్ర
1972 కోషిశ్ హరిచరణ్ మాథుర్ BFJA అవార్డ్ - ఉత్తమ నటుడు (హిందీ)
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన
1972 రివాజ్ శేఖర్
1972 సబ్ సే బడా సుఖ్ కథకుడు
1972 సీతా ఔర్ గీతా రవి
1972 శుభ్-ఓ-శ్యామ్ నజీర్
1971 అనుభవ్ అమర్ సేన్
1971 ఏక్ పహేలి పోలీస్ ఇన్‌స్పెక్టర్
1971 కంగన్
1971 మన్ మందిర్ దీపక్
1971 పరాశ్ ధరమ్‌ సింగ్
1970 బచ్‌పన్
1970 దస్తక్ హమీద్
1970 దేవు డా.ఎ.ఎన్.శేఖర్
1970 గునా ఔర్ కానూన్
1970 ఇన్సాన్ ఔర్ సైతాన్
1970 ఖిలోనా విజయ్ బాబు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన.
పునర్జన్మ రీమేక్
1970 మా కా ఆంచల్
1970 ప్రియా మాన్ సింగ్
1970 ఎ నైట్ ఇన్ కలకత్తా
1969 చందా ఔర్ బిజిలీ తమిళ సినిమా "ఆనందై ఆనందన్" రీమేక్
1969 ఉస్ రాత్ కే బాద్ ద్విపాత్రాభినయం
1969 ధర్తీ కహే పుకార్ కే మోతీ
1969 గుస్తాకీ మాఫ్ జై
1969 ఇన్సాఫ్ కా మందిర్
1969 జీనే కీ రాహ్ మనోహరి అతిథి పాత్ర
1969 జ్యోతి
1969 సచ్చాయి కిశోర్ దయాళ్
1969 సత్యకామ్ నరేంద్ర శర్మ (నరేన్)
1968 ఆశీర్వాద్ డాక్టర్ బీరేన్
1968 అనోఖీ రాత్
1968 గౌరి సంజీవ్ కుమార్
1968 రాజా ఔర్ రంక్ సుధీర్
1968 సాథీ అశోక్ అతిథి పాత్ర
1968 షికార్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు
1968 సంఘర్ష్ ద్వారకా ప్రసాద్
1967 గునేగార్
1967 నౌనిహాల్
1966 బాదల్ బసల్/కిరణ్
1966 హుస్న్ ఔర్ ఇష్క్ ఆషిక్ హుసేన్
1966 కలాపి
1966 పతి పత్ని అమర్
1966 స్మగ్లర్ మోహన్
1966 ఆలీబాబా ఔర్ 40 చోర్ ఆలీబాబా
1965 నిషాన్
1964 ఆవో ప్యార్ కరే
1960 హమ్‌ హిందుస్తానీ పోలీస్ ఇన్‌స్పెక్టర్

గుర్తింపు మార్చు

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఒక వీధికి ఇతని స్మృత్యర్థం "సంజీవ్ కుమార్ మార్గ్" అని నామకరణం చేశారు.

ఇతనిపేరుతో సూరత్‌లో ఒక పాఠశాల నెలకొల్పారు.

2013, మే 3వ తేదీ భారతప్రభుత్వం ఇతనిపై ఒక తపాలాబిళ్ల విడుదల చేసింది.[9]

14 ఫిబ్రవరి 2014లో ఇతని స్వంత పట్టణం సూరత్‌లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ 108 కోట్ల విలువైన సమావేశ మందిరాన్ని "సంజీవ్ కుమార్ ఆడిటోరియం" పేరుతో ప్రారంభించాడు.[10]

సామాజిక సేవ మార్చు

ఇతని పేరుతో "సంజీవ్ కుమార్ ఫౌండేషన్"[11] ఒక జాతీయ స్థాయి సేవా సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ బాలల విద్య, ఆరోగ్య, సాంస్కృతిక అభ్యున్నతికై పనిచేస్తున్నది. 2015 నుండి ఈ సంస్థ సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న సంజీవ్ కుమార్ నాటక పోటీలను స్పాన్సర్ చేస్తున్నది. ప్రతియేటా సంజీవ్ కుమార్ పేరుమీద ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు విభాగాలలో నగదు బహుమతులను ఇస్తున్నారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Salt-and-pepper memories with Sanjeev Kumar". Hindustan Times. 4 November 2012. Archived from the original on 2013-08-15. Retrieved 2013-08-12.
  2. 2.0 2.1 "He was an actor for all seasons". The Sunday Tribune. 13 August 2000. Retrieved 2013-08-12.
  3. "Whatever happened to....... Sulakshana Pandit". Filmfare. Archived from the original on 2007-10-15. Retrieved 2017-09-18.
  4. "Sanjeev Kumar". upperstall.com.
  5. 5.0 5.1 "20th National Awards For Films (1971)" (PDF). dff.nic.in. Directorate of Film Festivals. p. 41. Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2017-09-18.
  6. "Sanjeev Kumar Awards". Bollywood Hungama. Archived from the original on 2007-09-30. Retrieved 2017-09-18.
  7. "BFJA Awards". BFJA Awards. Archived from the original on 12 జూలై 2009. Retrieved 18 సెప్టెంబరు 2017.
  8. "BFJA Awards". BFJA Awards. Archived from the original on 22 ఏప్రిల్ 2008. Retrieved 18 సెప్టెంబరు 2017.
  9. "India Post | Philately | Stamps | Stamps 2013:". Archived from the original on 26 జూలై 2014. Retrieved 18 సెప్టెంబరు 2017.
  10. "Gujarat remembers its proud son, versatile actor Sanjeev Kumar by inaugurating a grand auditorium in his honour | Home | www.narendramodi.in". Retrieved 18 July 2014.
  11. "Sanjeev Kumar Foundation". Archived from the original on 2017-11-11. Retrieved 2020-01-08.

బయటి లింకులు మార్చు