ఆసియా క్రీడలు - 2018
ఆసియా క్రీడలు - 2018 ఇండోనేషియా లోని జకార్తా నగరంలో ఆగస్టు 18, 2018 నుంచి సెప్టెంబర్ 2, 2018 వరకు జరగనున్నాయి. ప్రతి నాలుగేండ్లకొకసారి ఈ క్రీడలు జరుగుతాయి. ఆసియా ఖండానికి చెందిన దేశాల క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొంటారు. దీని నిర్వాహక, నియంత్రణా సంస్థ ఆసియా ఒలంపిక్ మండలి, ఈ మండలిని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నియంత్రిస్తుంది.[1] ఈ క్రీడల్లో 45 దేశాలు, 40 క్రీడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీలు జరుగుతాయి. ఈ క్రీడల మోటోగా ‘ఎనర్జీ ఆఫ్ ఆసియా’గా నిర్వచించారు. మస్కట్‌లుగా బిన్ బిన్ (బర్డ్ ఆఫ్ ప్యారడైజ్), కాకా (ఖడ్గమృగం), అటుంగ్ (వేగంగా పరుగెత్తే దుప్పి).
చరిత్ర
మార్చురెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, ఆసియాలోని అనేక దేశాలు, బ్రిటిష్ వారి దాస్యశృంఖనాలనుండి విముక్తి పొంది, స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నాయి. ఈ దేశాలు తమ దేశాల మధ్య సయోద్య, సత్సంబాధల కొరకు, క్రీడలు ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఆగస్టు 1948లో లండన్లో జరిగిన ఒలంపిక్ క్రీడలు జరిగే సమయాన, ఆనాటి భారత ఒలంపిక్స్ కౌన్సిల్ ప్రతినిథి గురుదత్ సోంధి, ఆసియా క్రీడల గురించి తన అభిప్రాయాలను ప్రకటించాడు. ఆసియా దేశాలు, ఈ విషయాన్ని అంగీకరించి, ఆసియా అథ్లెటిక్ ఫెడరేషన్ తన అంగీకారాన్ని తెలిపింది. 1949లో ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ సమావేశమై ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి, 1951లో ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడలు జరపాలని నిశ్చయించాయి. ఈ క్రీడలు ప్రతి నాలుగేండ్లకొకసారి జరపాలని కూడా నిశ్చయించాయి.
పాల్గొన్న దేశాలు
మార్చుఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 13,000 మంది క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో న్యూఢిల్లీ జరిగాయి. భారత్, శ్రీలంక, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, జపాన్, సింగపూర్, థాయిలాండ్ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి.
భారతీయ క్రీడాకారులు
మార్చుభారతదేశం నుంచి 572 మంది క్రీడాకారుల బృందం పాల్గొనన్నున్నారు. జావెలిన్ త్రోయర్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా భారత బృందానికి సారథ్యం వహించాడు. వీరు 36 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు.
ప్రారంభ వేడుక
మార్చుఇండోనేసియా రాజధాని జకార్తాలోని జలోరా బంగ్ కర్నొ స్టేడియంలో 2018 ఆగస్టు 18 రోజున ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. 45 దేశాల మార్చిఫాస్ట్‌లో మొదటగా ఆఫ్ఘనిస్తాన్ స్టేడియంలోకి ప్రవేశించిగా, చివరిగా ఆతిథ్య దేశం ఇండోనేషియా ప్రవేశించింది. ఆ దేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సుశీ సుశాంతి జ్యోతి ప్రజ్వలనను వెలిగించింది.
ముగింపు వేడుక
మార్చుముగింపు వేడుకల్లో త్రివర్ణ పతాకథారిగా మహిళ హాకీ జట్టు సారథి రాణిరాంపాల్ వ్యవహరించారు.
అధికారిక వెబ్సైట్
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆసియా క్రీడలు". సాక్షి. www.sakshi.com. Retrieved 17 April 2018.[permanent dead link]