ఇంజనీర్ల దినోత్సవము

భారతదేశంలో ఇంజనీర్ల దినోత్సవము సెప్టెంబరు 15న జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్, పండితుడు, ప్రముఖ అధికారి, 1912 నుండి 1919 వరకు మైసూర్ దివాన్ గా పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) గౌరవార్థం, ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు. ఈయనకు పేరు తెచ్చిన పథకాలలో కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట, దానికి ఆనుకొని వున్న బృందావన ఉద్యానవనం, భద్రావతి ఇనుము, ఉక్కు కర్మాగారం, మైసూర్ చందనపునూనె కర్మాగారం, బ్యాంక్ ఆఫ్ మైసూరు స్థాపన ముఖ్యమైనవి.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఇవీ చూడండి మార్చు

ఇంజనీరింగ్

వనరులు మార్చు


బాహ్య లింకులు మార్చు