ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ జిల్లాలోని యెద్దుమైలారం గ్రామంలో ఉంది. సాంకేతిక విద్యాలయాల (సవరణ) చట్టం, 2011కి లోబడి, కేంద్రమానవవనరుల శాఖ, భారత ప్రభుత్వం వారిచే ఏర్పాటుచేయబడిన 8 కొత్త ఐఐటీలలో ఇది ఒకటి[1]. ఈ చట్టం లోక్ సభలో 2011 మార్చి 24న[2], రాజ్య సభలో 2012 ఏప్రిల్ 30న అమోదించబడింది[3].

Indian Institute of Technology Hyderabad
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్
రకంఐఐటీ
స్థాపితం2008
విద్యార్థులు2,880
అండర్ గ్రాడ్యుయేట్లు2,540
పోస్టు గ్రాడ్యుయేట్లు340
స్థానంహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాలగూడుwww.iith.ac.in

చరిత్రసవరించు

2008 సంవత్సరంలో ప్రారంభంచబడిన ఐఐటీ, హైదరాబాద్ యొక్క తాత్కాలిక ప్రాంగణం మెదక్ జిల్లాలోని, యెద్దుమైలారం గ్రామంలో ఆర్డినెన్స్ ఫాక్టరీలో ఉంది. దీని శాశ్వత ప్రాంగణం సంగారెడ్డి దగ్గర కంది అనే ఊరు వద్ద ఉంది. ఇది హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. 2009 ఫిబ్రవరి 27న, ఐక్య ప్రగతిశీల కూటమి చైర్ పర్సన్, శ్రీమతి సోనియా గాంధీ, శాశ్వత ప్రాంగణానికి శంకుస్థాపన చేసింది. [4]

ప్రాంగణంసవరించు

సంస్థయొక్క శాశ్వత ప్రాంగణం సంగారెడ్డి వద్దనున్న ‘కంది’ గ్రామంలో సుమారు 550 ఎకరాలలో (2.2 చ.కి.మీ) విస్తరించి ఉంది. ఇది 9-జాతీయ రహదారిమీద ఉన్నది, ఔటర్ రింగురోడ్డుకి సమీపంగా ఉంది. ఇది సికిందరాబాదు రైల్వేస్టేషనుకి 50కి మీ దూరంలో ఉంది.

2011 అక్టోబరు 6న ఇక్కడ భూమిపూజ జరిగింది[5]. 2013 సంవత్సరమధ్యానికి ఈ ప్రాంగణం అన్ని కార్యకలాపాలూ చేయగలిగినదై ఉండబోతోంది.

ప్రస్తుతం, హైదరాబాదు నగరానికి 45కిమీ దూరంలో ఆర్డినెన్సు ఫాక్టరీ, ఎద్దుమైలారం గ్రామం, మెదక్ జిల్లాలో తాత్కాలిక ప్రాంగణంనుండి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక్కడికి అతి దగ్గరి బస్సుస్టాపు పటాన్ చెరువు వద్ద ఉంది.

విభాగాలు, కోర్సులుసవరించు

ఇంజనీరింగు, విజ్ఞానశాస్త్రాలు, లిబరల్ ఆర్ట్సు తదితర క్షేత్రాలలో మొత్తంగా 7 అండరుగ్రాడ్యుయేట్ ఇంజనీరింగు డిగ్రీలు, 6 పోస్టుగ్రాడ్యుయేటు ఇంజనీరింగు డిగ్రీలు, డాక్టరేటు డిగ్రీలను అందజేస్తోంది. వివిధ క్షేత్రాలలో నిష్ణాతులైన 83మంది ఆచార్యులు ఇక్కడ బోధిస్తున్నారు, పరిశోధిస్తున్నారు సలహాలనందిస్తున్నారు[6].

ఐఐటీ హైదరాబాదు క్రింది విభాగాలను కలిగి ఉంది.

  • జీవసాంకేతిక, జీవవైద్య ఇంజనీరింగు విభాగం
  • రసాయనిక ఇంజనీరింగు విభాగం
  • సివిలు ఇంజనీరింగు విభాగం
  • కంప్యూటరు విజ్ఞానం, ఇంజనీరింగు విభాగం
  • పదార్థ విజ్ఞాన ఇంజనీరింగు విభాగం
  • యాంత్రిక ఇంజనీరింగు విభాగం
  • విద్యుత్తు ఇంజనీరింగు విభాగం
  • పర్యావరణ విజ్ఞానం & ఇంజనీరింగు విభాగం
  • విజ్ఞానశాస్త్ర విభాగం
  • గణితశాస్త్ర విభాగం
  • రసాయనశాస్త్ర విభాగం
  • లిబరల్ ఆర్ట్సు విభాగం

అడ్మిషన్లుసవరించు

ఐఐటి హైదరాబాద్‌లో బి. టెక్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ సైన్స్, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్ మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్.[7]

ఈ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవటానికి, దరఖాస్తుదారు మొదట ఐఐటి జెఇఇ ప్రవేశ పరీక్ష తీసుకోవాలి. ఈ పరీక్ష ఐఐటి ప్రత్యేకమైనది మరియు ఇతర కళాశాలలకు ఉపయోగించబడదు. ఈ పరీక్ష విద్యా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది మరియు మొత్తం భారతదేశానికి పరీక్ష యొక్క ఒక ఫార్మాట్ మాత్రమే ఉంటుంది.[8] దరఖాస్తుదారుడి స్కోరు ఆధారంగా, విద్యార్థి ఐఐటి హైదరాబాద్‌లో ప్రవేశం పొందాడా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రతి విద్యా సంవత్సరంలో, నిర్దిష్ట సంఖ్యలో టాప్ స్కోరర్లు మాత్రమే ప్రవేశాలు పొందుతారు. ఈ స్కోరు కోసం చూస్తున్న ఏకైక అంశం - మిగిలిన సమాచారం, పాఠ్యాంశాలు, పాఠశాల మార్కులు కీలక పాత్ర పోషించవు.[9]

పరిశోధనలు, పారిశ్రామిక సలహాపనులుసవరించు

విద్యార్థుల కార్యకలాపాలుసవరించు

మూలాలుసవరించు

  1. "The Institutes of Technology (Amendment) Bill, 2010" (PDF).
  2. "LS passes bill to provide IIT status to 8 institutes, BHU". deccanherald.com. March 24, 2011. Retrieved 9 May 2011.
  3. "Parliament passes IIT bill". ThetimesofIndia.com. April 30, 2012. Archived from the original on 16 July 2012. Retrieved 30 April 2012.
  4. The Hindu (28-Feb-2009). "Sonia lays foundation stone for Medak IIT campus". Chennai, India. Check date values in: |date= (help)
  5. "IIT Hyderabad Ground breaking Ceremony". Retrieved 7 October 2011.
  6. business-standard (15 June 2009). "IIT-Hyderabad to design inter-disciplinary courses".
  7. "Under Graduate". IIT Hyderabad (in ఆంగ్లం). Retrieved 2020-10-10.
  8. "JEE(Advanced) 2020, Official Website". jeeadv.ac.in. Retrieved 2020-10-10.
  9. "JEE Main 2020: IIT JEE 2020 Exam Notifications, Syllabus, Registration Process, Application Form & Fees - Careerindia". https://www.careerindia.com (in ఆంగ్లం). Retrieved 2020-10-10. External link in |website= (help)