రాజ్యసభ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. దీని సభ్యుల సంఖ్య 250. ఇందులో 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి నామినేటు చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
భారతదేశం |
![]() ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
ఇతర దేశాలు |
రాజ్యసభకు సభాపతి (చైర్మను) గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుండి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్‌సభ వలె రాజ్యసభ రద్దు కావడం అనేది ఉండదు. లోక్‌సభ వలెనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి, రాజ్యసభ నిర్ణయాన్ని తోసిరాజనే అధికారం లోక్‌సభకు ఉంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్యా వివాదం తలెత్తినపుడు రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగు జరిపినపుడు, సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినపుడు, సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు.
రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అధికారం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం వీరికి ఓటేసే అధికారం లేదు.
రాజ్యసభలో రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యుల సంఖ్యసవరించు
రాష్ట్రము/కేంద్ర పాలిత ప్రాంతము | Seats |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | 11 |
అరుణాచల్ ప్రదేశ్ | 1 |
అస్సాం | 7 |
బీహారు | 16 |
ఛత్తీస్ గఢ్ | 5 |
గోవా | 1 |
గుజరాత్ | 11 |
హరియాణా | 5 |
హిమాచల్ ప్రదేశ్ | 3 |
జమ్ము-కాశ్మీర్ | 4 |
ఝార్ఖండ్ | 6 |
కర్నాటక | 12 |
కేరళ | 9 |
మధ్య ప్రదేశ్ | 11 |
మహారాష్ట్ర | 19 |
మణిపుర్ | 1 |
మేఘాలయ | 1 |
మిజోరాం | 1 |
నాగాల్యాండ్ | 1 |
ఢిల్లీ | 3 |
ఒడిశా | 10 |
పుదుచ్చేరి | 1 |
పంజాబ్ | 7 |
రాజస్థాన్ | 10 |
సిక్కిం | 1 |
తమిళ్ నాడు | 18 |
తెలంగాణ | 7 |
త్రిపుర | 1 |
ఉత్తర్ ప్రదేశ్ | 31 |
ఉత్తరాఖండ్ | 3 |
పశ్చిమ బెంగాల్ | 16 |
రాష్ట్రపతి నియమితులు | 12 |
మొత్తము | 245 |
ఇవి కూడా చూడండిసవరించు
- రాజ్యసభ సభ్యులుyes i like it