ఎద్దుమైలారం
ఎద్దుమైలారం, తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, కంది మండలానికి చెందిన ఒక జనగణన పట్టణం.[1] ఎద్దుమైలారం సెన్సస్ టౌన్ మొత్తం 2,801 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది.దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబంధిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. పట్టణ పరిధిలో రహదారులను నిర్మించడానికి,నిర్వహించటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా స్థానిక స్వపరిపాలన సంస్థకు అధికారం ఉంది.[2]
ఎద్దుమైలారం | |
---|---|
Coordinates: 17°30′25″N 78°17′00″E / 17.50694°N 78.28333°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
మండలం | కంది |
విస్తీర్ణం | |
• Total | 6.20 కి.మీ2 (2.39 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 11,759 |
• జనసాంద్రత | 1,900/కి.మీ2 (4,900/చ. మై.) |
భాష | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | TS |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని సంగారెడ్డి మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన కంది మండలంలోకి చేర్చారు.[3]
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఎద్దుమైలారం పట్టణపరిధిలో మొత్తం 2,801 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎద్దుమైలారం పట్టణ మొత్తం జనాభా 11,759, అందులో 6,318 మంది పురుషులు, 5,441 మంది మహిళలు. సగటు సెక్స్ నిష్పత్తి 861. పట్టణం పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సులోపు పిల్లల జనాభా 712, ఇది మొత్తం జనాభాలో 6%గా ఉంది.0-6 సంవత్సరాల వయస్సు మధ్య 371 మంది మగ పిల్లలు, 341 మంది ఆడ పిల్లలు ఉన్నారు.దీని ప్రకారం చైల్డ్ సెక్స్ రేషియో 919, ఇది సగటు సెక్స్ రేషియో (861) కన్నా తక్కువ.పట్టణ అక్షరాస్యత మొత్తం 87.7% గా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 93.39.%, స్త్రీ అక్షరాస్యత రేటు 80.98%.[4] సగటు అక్షరాస్యత రేటు 77%,ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 82%, స్త్రీ అక్షరాస్యత 71%. జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు13% మంది ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ "District Level Mandal wise list of villages in Medak district" (PDF). Chief Commissioner of Land Administration. National Informatics Centre. Archived from the original (PDF) on 2 April 2015. Retrieved 5 March 2016.
- ↑ "Eddumailaram Population, Caste Data Medak Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-10-08. Retrieved 2020-10-06.
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-16.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-28 suggested (help) - ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.