ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాగ్‌పూర్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాగ్‌పూర్ (ఐఐఐటీ నాగ్‌పూర్ లేదా ట్రిపుల్ ఐటీ నాగ్‌పూర్) అనేది మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం.[1] భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా లాభాపేక్ష లేని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా క్రింద స్థాపించబడిన 25 ఐఐఐటీలలో ఇదీ ఒకటి. ఇందులో ఎలక్ట్రానిక్స్ - కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బిటెక్) కోర్సులు అందించబడుతున్నాయి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాగ్‌పూర్
రకంపబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం
స్థాపితం2016 జూలై
డైరక్టరుప్రొ. ఓంప్రకాష్ జి. కాక్డే
అండర్ గ్రాడ్యుయేట్లు960
పోస్టు గ్రాడ్యుయేట్లు74
స్థానంనాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం
కాంపస్గ్రామీణ
సంక్షిప్త పేరుఐఐఐటీ నాగ్‌పూర్ లేదా ట్రిపుల్ ఐటీ నాగ్‌పూర్
జాలగూడుiiitn.ac.in

స్థాపన

మార్చు

2015 మేలో భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఐఐఐటీ నాగ్‌పూర్ ఏర్పాటును ఆమోదించింది.[2] యాభై శాతం వాటాలను విద్యా మంత్రిత్వ శాఖ, ముప్పై ఐదు శాతం మహారాష్ట్ర ప్రభుత్వం, పదిహేను శాతం పరిశ్రమ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్చే నిర్వహించబడుతోంది.

ఇది 2016 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు ప్రకారం 2017 ఆగస్టులో భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది.

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి ఈ సంస్థ ఏర్పాటుకు 3 కోట్ల నిధులు రాగా,[3] మహారాష్ట్ర ప్రభుత్వం 1.4 కోట్ల నిధులు సమకూర్చింది.[4]

కోర్సులు

మార్చు

ఐఐఐటీ నాగ్‌పూర్ లో కంప్యూటర్ సైన్స్-ఇంజనీరింగ్ లో 210, ఎలక్ట్రానిక్స్ - కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లలో 140 సీట్లతో రెండు బిటెక్ కోర్సులు అందించబడుతున్నాయి. మొట్టమొదటి బ్యాచ్ లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇవ్వబడింది.[3] 2016–20, 2017-21 బ్యాచ్‌కి ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 90,000 (US$1,100) గా నిర్ణయించబడింది. కొత్త బ్యాచ్‌లకు ట్యూషన్ ఫీజు ₹180వేలకు పెంచబడింది.[5]

మూలాలు

మార్చు
  1. "IIITs now Institutes of National Importance". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2023-02-13.
  2. Choudhari, Abhishek (15 May 2015). "HRD ministry approves IIIT for Nagpur". The Times of India. Nagpur. Retrieved 2023-02-13.
  3. 3.0 3.1 Ganjapure, Vaibhav (29 June 2016). "IIIT Nagpur to start PG, PhD courses from next year". The Times of India. Nagpur. Retrieved 2023-02-13.
  4. Srivastava, Kanchan (4 July 2016). "Decks cleared for all infrastructure, educations projects such as AIIMS, IIIT, IIM, NLU in Nagpur". Daily News and Analysis. Mumbai. Retrieved 2023-02-13.
  5. Ganjapure, Vaibhav (18 February 2016). "Ngp, Pune IIITs fees fixed at Rs90k per yr". The Times of India. Nagpur. Retrieved 2023-02-13.

బయటి లింకులు

మార్చు