ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాంచీ

జార్ఖండ్ రాష్ట్రం రాంచీ లోని ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాంచీ (ఐఐఐటీ రాంచీ లేదా ట్రిపుల్ ఐటీ రాంచీ) అనేది జార్ఖండ్ రాష్ట్రం రాంచీ లోని ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం.[1] భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా లాభాపేక్ష లేని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా క్రింద స్థాపించబడిన 25 ఐఐఐటీలలో ఇదీ ఒకటి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాంచీ
Indian Institute of Information Technology, Ranchi Logo.png
రకంపబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం
స్థాపితం2016; 7 సంవత్సరాల క్రితం (2016)
విద్యాసంబంధ affiliations
జాతీయ ప్రాధాన్యత విద్యాసంస్థ
చైర్మన్అర్జున్ జైన్
డైరక్టరువిష్ణు ప్రియే
విజిటర్భారత రాష్ట్రపతి
స్థానంరాంచీ, జార్ఖండ్, భారతదేశం
23°18′58″N 85°22′26″E / 23.316°N 85.374°E / 23.316; 85.374Coordinates: 23°18′58″N 85°22′26″E / 23.316°N 85.374°E / 23.316; 85.374
కాంపస్పట్టణ
జాలగూడుwww.iiitranchi.ac.in

చరిత్రసవరించు

ఇది 2016లో ప్రారంభించబడింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు ప్రకారం 2017 ఆగస్టులో భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది.[2]

ప్రాంగణంసవరించు

ఐఐఐటీ రాంచీ ప్రస్తుతం రాంచీలోని తాత్కాలిక క్యాంపస్ నుండి పనిచేస్తోంది. రాంచీలోని కంకేలో శాశ్వత క్యాంపస్ కోసం 67 ఎకరాల భూమిని కేటాయించారు. నిర్మాణం ప్రారంభమైంది, 2023 నాటికి క్యాంపస్ సిద్ధంగా ఉంటుంది.

కోర్సులుసవరించు

విద్యా కార్యక్రమాలుసవరించు

కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బిటెక్ కోర్సులను మాత్రమే అందిస్తోంది.

మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తాజా అంశాలతోపాటు సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్‌లు, ఇతర స్ట్రీమ్‌లలో నైపుణ్యం సాధించేందుకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారుతూవుంటుంది.

ప్రవేశాలుసవరించు

పైన పేర్కొన్న కోర్సులకు జెఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం ఉంటుంది. కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ నిర్వహిస్తుంటుంది.[3]

విద్యార్థుల మండలిసవరించు

ఇక్కడ మంచి అడ్మినిస్ట్రేషన్ తో విద్యార్థుల మండలి (స్టూడెంట్స్ కౌన్సిల్) ఉంది. విద్యార్థుల అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రతిపాదనలను విద్యార్థుల మండలి సేకరిస్తుంది. ఇందులో 15 మంది సభ్యులు ఉంటారు.

శిక్షణ, ప్లేస్‌మెంట్ సెల్సవరించు

చాలామంది విద్యార్థులు ఉన్నత విద్య నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యార్థుల ప్లేస్‌మెంట్ కోసం క్యాంపస్ డ్రైవ్‌ను నిర్వహించబడుతుంది.[4][5] సాఫ్ట్ స్కిల్ డెవలప్‌మెంట్‌పై వర్క్‌షాప్‌లను నిర్వహించడం, విద్యార్థుల మేధో నైపుణ్య అభివృద్ధి కోసం సెమినార్‌లను నిర్వహించబడుతాయి.

మూలాలుసవరించు

  1. "Home". iiitranchi.ac.in.
  2. "Department of Higher Education | Government of India, Ministry of Education".
  3. "Archived copy". Archived from the original on 20 October 2021. Retrieved 2023-02-10.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. Pioneer, The. "IIIT, Ranchi finalises budget for permanent campus". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2023-02-10.
  5. "Jharkhand Student got the Biggest Package in the History of IIIT". Drishti IAS (in ఇంగ్లీష్). Retrieved 2023-02-10.

బయటి లింకులుసవరించు