ఇందిరా తివారి భారతీయ నటి. ఆమె హిందీ భాషా చిత్రాలైన ఆరక్షన్ (2011), నజర్‌బంద్ (2020), సీరియస్ మెన్ (2020), గంగూబాయి కతియావాడి (2022) వంటి వాటితో ప్రసిద్ధిచెందింది.

ఇందిరా తివారీ
జననం
భోపాల్, మధ్యప్రదేశ్
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

కెరీర్ మార్చు

ప్రకాష్ ఝా 2011 బాలీవుడ్ చిత్రం ఆరక్షన్‌లో విద్యార్థి పాత్రను పోషించడం ద్వారా ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె తర్వాత ఏకాంత్, ది మ్యాన్‌లియెస్ట్ మ్యాన్, అన్‌ఫెయిర్, రిటర్న్ టు సిండర్ మొదలైన లఘు చిత్రాలలో నటించింది.

2020లో, ఆమె సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించిన నాజర్‌బంద్‌లో నటించింది. ఈ చిత్రం బెంగాలీ నవలా రచయిత, కవయిత్రి ఆశాపూర్ణా దేవి కథ ఆధారంగా వచ్చింది.[1][2][3] అదే సంవత్సరం, దర్శకుడు సుధీర్ మిశ్రా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సీరియస్ మెన్‌లో నవాజుద్దీన్ సిద్ధికితో కలిసి ఆమె మహిళా ప్రధాన పాత్ర పోషించింది.[4][5][6][7]

హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 2022 చిత్రం గంగూబాయి కతియావాడిలో ఆమె ప్రముఖ పాత్రను పోషించింది.[8][1]

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2011 ఆరక్షన్ తబేలా టాపర్ స్టూడెంట్
2014 ఏకాంత్ రీనా షార్ట్ ఫిల్మ్
2016 ది మ్యాన్లీయెస్ట్ మ్యాన్ సరళ (కారియా భార్య) షార్ట్ ఫిల్మ్
2017 అన్ఫేయిర్ ఆయేషా షార్ట్ ఫిల్మ్
2019 రిటర్న్ టు సిండర్ ఆన్ షార్ట్ ఫిల్మ్
2020 సీరియస్ మెన్ ఓజా మణి
నాజర్‌బాండ్ వాసంతి
2022 గంగూబాయి కతియావాడి కమ్లీ
2022 బెడ్ స్టోరీస్ జావేద వెబ్ సిరీస్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Saxena, Deep (8 June 2021). "I want to play all kinds of roles: Indira Tiwari". Hindustan Times. Retrieved 2 October 2021.
  2. "Suman Mukhopadhyay on His Film 'Nazarband' Premiering At Busan Film Festival". News18. 20 October 2020. Retrieved 6 March 2021.
  3. Kashyap, Antara (15 December 2020). "5 Best Film Festival Gems You Should Look Forward to in 2021". News18. MSN. Retrieved 6 March 2021.
  4. "Bhopal: Working with Nawazuddin Siddiqui in Serious Men was a dream come true, says city artist Indira Tiwari". freepressjournal.in. Retrieved 17 February 2021.
  5. "Serious Men actor Indira Tiwari: My skill set, not my skin tone should matter". Hindustan Times. 29 October 2020. Retrieved 17 February 2021.
  6. "Indira Tiwari: I've earned relationships from Serious Men | Entertainment News,The Indian Express". The Indian Express. 11 October 2020. Retrieved 17 February 2021.
  7. "'Serious Men' review: A poignant riff on ambitions and dreams". The New Indian Express. Retrieved 17 February 2021.
  8. "Who was Gangubai Kathiawadi, the don Alia Bhatt plays in Sanjay Leela Bhansali's upcoming biopic?". ZeeNews. 28 February 2021. Retrieved 6 March 2021.