ఇందిరా మౌంట్

అంటార్కిటిక్ మహాసముద్రంలోని సముద్రపర్వతం

ఇందిరా మౌంట్, అంటార్కిటిక్ మహాసముద్రంలో సముద్రంతర్భాగంలో ఉన్న పర్వతం. 1981-82 లో, ఎం.వి.పోలార్ సర్కిల్ నౌకలో భారతదేశం అంటార్కిటికాకు చేసిన మొదటి యాత్రలో మారిషస్ నుండి అంటార్కిటికాకు వెళ్తూండగా బృందం దీన్ని కనుక్కుంది. [1] భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీద దీనికి ఇందిరా మౌంట్ అని పేరు పెట్టారు.

ఇందిరా మౌంట్
ఇందిరా మౌంట్ is located in Antarctica
ఇందిరా మౌంట్
ఇందిరా మౌంట్
అత్యంత ఎత్తైన బిందువు
నిర్దేశాంకాలు53°39.79′S 47°55.82′E / 53.66317°S 47.93033°E / -53.66317; 47.93033[1]

సముద్రం అడుగు నుండి 1000 మీటర్లు, అంతకంటే కంటే ఎత్తు ఉన్న ప్రదేశాన్ని సముద్ర పర్వతం అంటారు. ఇందిరా మౌట్ ఎత్తు 3,000 మీ. ఉంది. ఇప్పటి వరకూ కనుగొన్న అతిపెద్ద సముద్ర పర్వతాల్లో ఇది ఒకటి.[2]

దాని విశేషాలను పరిశీలించిన బృందం, ఇది ఒక పర్వత శ్రేణిలో భాగమై ఉండవచ్చని భావించింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Department of Ocean Development, Government of India. Annual Report 1983-1984, TECHNICAL PUBLICATION NO. 3., Printed at Dee Kay Printers Kirtinagar, New Delhi
  2. సిద్దికీ, హెచ్.ఎన్; భట్టాచార్య, జి.సి.; పాఠక్, ఎం.సి.; కాసిం, ఎస్.జెడ్. (Jan 1983). "ఇందిరా మౌంట్ — ఎన్ అండర్‌వాటర్ మౌంటెయిన్ ఇన్ ది అంటార్కిటిక్ ఓషన్". Archived from the original on 2022-06-01. Retrieved 2022-06-01.