మైత్రి (పరిశోధన కేంద్రం)

అంటార్కిటికాలో భారత పరిశోధన కేంద్రం

అంటార్కిటిక్ పరిశోధన కార్యక్రమంలో భాగంగా అంటార్కిటికాలో భారతదేశం నిర్మించిన రెండవ శాశ్వత పరిశోధనా కేంద్రం, మైత్రి. దీన్ని ఫ్రెండ్‌షిప్ రీసెర్చ్ సెంటర్ అని కూడా పిలుస్తారు. ఆ పేరును అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సూచించింది. 1984 డిసెంబరు చివరిలో డాక్టర్ బి.బి. భట్టాచార్య నేతృత్వంలో అక్కడ దిగిన భారతీయ పరిశోధక బృందం ఈ కేంద్రంపై పని మొదలుపెట్టింది. బృందంలో సర్జన్ అయిన స్క్వాడ్రన్ లీడర్ డి.పి. జోషి, క్యాంప్ మైత్రి లోని శిబిరానికి మొదటి క్యాంపు కమాండరు. మొదటి గుడిసెల నిర్మాణాన్ని నాలుగవ అంటార్కిటికా యాత్రా బృందం మొదలు పెట్టింది. అవి 1989లో పూర్తయ్యాయి. ఆ తరువాత కొద్ది కాలానికే మొదటి కేంద్రమైన దక్షిణ గంగోత్రి మంచులో కూరుకుపోయింది. 1990-91 లో దాన్ని విడిచిపెట్టేసారు. [1] మైత్రి, షిర్మాచెర్ ఒయాసిస్ అనే రాతి పర్వతీయ ప్రాంతంలో ఉంది. రష్యా వారి నోవోలాజరేవ్స్కాయ కేంద్రం నుండి ఇది 5 కి.మీ. దూరంలో ఉంది.

మైత్రి
అంటార్కిటిక్ పరిశోధన కేంద్రం
An aerial view of the Indian Station Maitri, Antarctica on 2 February 2005
An aerial view of the Indian Station Maitri, Antarctica on 2 February 2005
అంటార్కిటికా మ్యాపులో మైత్రి స్థానం
అంటార్కిటికా మ్యాపులో మైత్రి స్థానం
మైత్రి
అంటార్కిటికా మ్యాపులో మైత్రి స్థానం
Coordinates: 70°46′00″S 11°43′53″E / 70.766632°S 11.731516°E / -70.766632; 11.731516
దేశం India
అంటార్కిటికాలో స్థానంక్వీన్ మాడ్ ల్యాండ్
అంటార్కిటికా
నిర్వాహకులుజాతీయ ధ్రువ, మహాసముద్రాల పరిశోధన కేంద్రం
స్థాపన1989 జనవరి (1989-01)
Elevation
130 మీ (430 అ.)
Population
 • Total
  • Up to 65
రకంఏడాది పొడవునా
కాలావధివార్షిక
స్థితిపనిచేస్తోంది

సౌకర్యాలు మార్చు

ఈ కేంద్రంలో జీవశాస్త్రం, భూ శాస్త్రాలు, హిమానీనదం, వాతావరణ శాస్త్రాలు, శీతోష్ణస్థితి శాస్త్రం, కోల్డ్ రీజియన్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్, మానవ శరీర శాస్త్రం, వైద్యం వంటి వివిధ విభాగాలలో పరిశోధనలు చేయడానికి అవసరమైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. శీతాకాలంలో ఇక్కడ 25 మంది నివాసం ఉండవచ్చు. మైత్రికి ఎదురుగా ఉన్న ప్రియదర్శిని అనే మంచినీటి సరస్సు నుండి మంచినీరు లభిస్తుంది.

ఈ కేంద్రం నుండి 10 కి.మీ. దూరంలో ఉన్న నోవో అనే నీలి మంచు రన్‌వే మైత్రి వినియోగించుకుంటోంది. రష్యా వారి నోవోలాజరేవ్స్కాయ కేంద్రం కూడా ఈ రన్‌వేను వినియోగించుకుంటుంది. దీన్ని అంటార్కిటిక్ లాజిస్టిక్స్ సెంటర్ ఇంటర్నేషనల్ (ALCI) నిర్వహిస్తోంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Maitri". Polar Conservation Organisation. 11 January 2011. Archived from the original on 30 May 2012. Retrieved 2009-04-13.