భారతదేశ ప్రధానమంత్రి
భారత ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ అధినేత.[2][3] ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం నామమాత్రం కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి, అతని మంత్రివర్గం వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.[4][5] లోక్‌సభలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా కూటమి నాయకుడే సాధారణంగా ప్రధానమంత్రి అవుతారు.[6]
భారతదేశం భారత ప్రధానమంత్రి | |
---|---|
ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర మంత్రిమండలి భారత ప్రభుత్వం కార్యనిర్వాహక శాఖ | |
విధం |
|
రకం | ప్రభుత్వ అధిపతి |
Abbreviation | పిఎం |
సభ్యుడు | |
రిపోర్టు టు | |
అధికారిక నివాసం | 7, లోక్ కళ్యాణ్ మార్గ్, న్యూఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం |
స్థానం | సెక్రటేరియట్ భవనం, న్యూఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం |
Nominator | లోక్‌సభ సభ్యులు |
నియామకం | భారత రాష్ట్రపతి రాజకీయ పార్టీ సమావేశం కట్టుబాటు ద్వారా, లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవస్థ విశ్వాసాన్ని ఆజ్ఞాపించే నియమితుడి సామర్థ్యం ఆధారంగా |
కాలవ్యవధి | ప్రెసిడెంట్ ఆనందం వద్ద
|
స్థిరమైన పరికరం | ఆర్టికల్స్ 74 & 75, భారత రాజ్యాంగం |
అగ్రగామి | కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షుడు |
నిర్మాణం | 15 ఆగస్టు 1947 |
మొదట చేపట్టినవ్యక్తి | జవహర్లాల్ నెహ్రూ |
ఉప | ఉప ప్రధాన మంత్రి |
జీతం |
భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో లోక్‌సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. ప్రధానమంత్రి, తన మంత్రివర్గంతో సహా అన్నివేళలా లోక్‌సభకు జవాబుదారీగా ఉంటారు.[7][8]
ప్రధానమంత్రి నియామకం
మార్చుప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. లోక్‌సభలో ఆధిక్యత కలిగిన పార్టీకి చెందిన నాయకుడిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. కాని, ఏ ఒక్క పార్టీకి కూడా పూర్ణ ఆధిక్యత (సభ్యుల సంఖ్యలో సగానికంటే ఒకటి ఎక్కువ) లేనపుడు, అత్యధిక సభ్యుల మద్దతు కలిగిన సంకీర్ణ నాయకుడిని గాని, లోక్‌సభలో అత్యధికుల మద్దతు కూడగట్టగలిగిన అతిపెద్ద పార్టీ నాయకుడిని గాని రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు.
విధులు, అధికారాలు
మార్చుప్రధానమంత్రి తన విధుల నిర్వహణలో సహాయపడేందుకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రధాని ఎంపిక చేసిన సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు.[9] మంత్రుల ప్రమాణం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. మంత్రుల శాఖలను ప్రధానమంత్రి కేటాయిస్తాడు. మంత్రులను తొలగించే అధికారం ప్రధానమంత్రిదే. మంత్రివర్గ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తాడు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ సాధన, వివాదాల పరిష్కారం ప్రధానమంత్రి బాధ్యత. ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన ప్రణాళికా సంఘానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు.
రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రధాన ఎన్నికల కమిషనరు, ప్రధాన విజిలెన్సు కమిషనరు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మొదలైన వారి నియామకాల్లో రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు. ఇంకా పార్లమెంటు సమావేశాలు, లోక్‌సభను రద్దు చేయడం, ఎమర్జెన్సీ ప్రకటన, యుద్ధ ప్రకటన, యుద్ధ విరమణ మొదలైన కీలక ఆంశాలపై రాష్ట్రపతికి సలహా ఇస్తాడు.[10]
పూర్వాపరాలు
మార్చుస్వాతంత్ర్యం తరువాత 14 మంది ప్రధానమంత్రులుగా పనిచేసారు. [a] జవహర్లాల్ నెహ్రూ నాలుగు సార్లు చేసాడు (1947-1952, 1952-1957, 1957-1962, 1962-1964).[11] ఇందిరా గాంధీ మూడు సార్లు (1966-1971, 1971-1977, 1980-1984), అటల్ బిహారీ వాజపేయి మూడు సార్లు (1996, 1998-1999, 1999-2004) ప్రధానమంత్రిగా పనిచేసాడు. గుల్జారీలాల్ నందా రెండు సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినా, ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే చేసాడు. నరేంద్ర మోదీ రెండుసార్లు (2014-2019, 2019-) ప్రధానమంత్రి అయ్యాడు. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.[12]
స్వాతంత్ర్యం తరువాత, 30 ఏళ్ళపాటు కాంగ్రెసు పార్ఠీకి చేందిన వారే ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చారు. 1977లో మొట్టమొదటి సారిగా మొరార్జీ దేశాయ్ కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. భారతీయ జనతా పార్టీకు చెందిన అటల్ బిహారీ వాజపేయి 1996లో మొదటిసారి ఎన్నికయ్యాడు. మళ్ళీ, 1998లో ప్రధానమంత్రి అయ్యాడు. 2004 ఎన్నికలలో కాంగ్రెసు నేతృత్వంలోని సంకీర్ణం అధికారంలోకి వచ్చి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు.
ప్రధానమంత్రుల జాబితా
మార్చు- Key
- సంఖ్య.: ప్రస్తుత సంఖ్య
- † కార్యాలయంలో హత్య లేదా మరణించటం
- § గతంలో వరుసగా కానీ లేదా పదవీకాలం తర్వాత తిరిగి కార్యాలయానికి వచ్చినవారు
- RES రాజీనామా
- NC అవిశ్వాస తీర్మానంతో రాజీనామా చేసినవారు
రంగుకీ (రాజకీయ సంకీర్ణాలు/పార్టీల కోసం):
- జనతాదళ్ (3)
- జనతా పార్టీ (1)
వ.సంఖ్య | చిత్తరువు | పేరు (జననం-మరణం) నియోజకవర్గం |
పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు వయస్సు | పదవీకాలం & ఆదేశం
సంవత్సరాలు, రోజులలో వ్యవధి |
ఏకకాలంలో మంత్రి పదవులు | పార్టీ | ప్రభుత్వం | దేశాధినేత (పదవీకాలం) | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | జవహర్లాల్ నెహ్రూ (1889–1964) యునైటెడ్ ప్రావిన్సెస్ (నియోజకవర్గం) అసెంబ్లీ, 1947-1952) ఫుల్పూర్ (1952-1964)కి ఎంపీ |
57 సంవత్సరాలు, 274 రోజులు | 1947 ఆగస్టు 15 |
1964
27 మే |
16 సంవత్సరాలు, 286 రోజులు | – |
|
భారత జాతీయ కాంగ్రెస్ | నెహ్రూ I | జార్జ్ VI
[b] | ||
రాజేంద్ర ప్రసాద్ (1950–1962) | ||||||||||||
1951–52 | నెహ్రూ II | |||||||||||
1957 | నెహ్రూ III | |||||||||||
1962 | నెహ్రూ IV | సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962–1967) | ||||||||||
తాత్కాలిక | గుల్జారీలాల్ నందా (1898–1998) సబర్కంట ఎంపీ |
65 సంవత్సరాలు, 328 రోజులు | 1964 మే 27 |
1964 జూన్ 9 |
13 రోజులు | – | నంద I | |||||
2 | లాల్ బహదూర్ శాస్త్రి (1904–1966) అలహాబాద్ ఎంపీ |
62 సంవత్సరాలు, 250 రోజులు | 1964 జూన్ 9 |
1966 జనవరి 11 [†] |
1 సంవత్సరం, 216 రోజులు | – |
|
శాస్త్రి I | ||||
తాత్కాలిక | గుల్జారీలాల్ నందా (1898–1998) సబర్కంటా ఎంపీ |
67 సంవత్సరాలు, 191 రోజులు | 1966 జనవరి 11 |
1966 జనవరి 24 |
13 రోజులు | – | నందా II | |||||
3 | ఇందిరా గాంధీ (1917–1984) ఉత్తర ప్రదేశ్ (రాజ్యసభ, 1966–1967) రాయ్ బరేలి ఎం.పీ (1967–1977) |
48 సంవత్సరాలు, 66 రోజులు | 1966 జనవరి 24 |
1977 మార్చి 24 |
11 సంవత్సరాలు, 59 రోజులు | – |
|
ఇందిర 1వ | ||||
1967 | ఇందిర 2వ | జాకీర్ హుస్సేన్ (1967–1969) | ||||||||||
వి.వి.గిరి (1969) (తాత్కాలిక) | ||||||||||||
మొహమ్మద్ హిదాయతుల్లా (1969) (తాత్కాలిక) | ||||||||||||
వి.వి.గిరి (1969–1974) | ||||||||||||
1971 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్) | ఇందిరా III | ||||||||||
ఫకృద్దీన్ అలీ అహ్మద్ (1974–1977) | ||||||||||||
బి. డి. జెట్టి (1977) (తాత్కాలిక) | ||||||||||||
4 | మొరార్జీ దేశాయ్ (1896–1995) సూరత్ ఎంపీ |
81 సంవత్సరాలు, 24 రోజులు | 1977 మార్చి 24 |
1979 జులై 28 [RES] |
2 సంవత్సరాలు, 126 రోజులు | 1977 |
|
జనతా పార్టీ | దేశాయ్ | |||
నీలం సంజీవ రెడ్డి (1977–1982) | ||||||||||||
5 | చరణ్ సింగ్ (1902–1987) బాగ్పట్ , ఎం.పీ |
76 సంవత్సరాలు, 217 రోజులు | 1979 జులై 28 |
1980 జనవరి 14 [RES] |
170 రోజులు | – | ఏదీ లేదు | జనతా పార్టీ (సెక్యులర్) | చరణ్ | |||
(3) | ఇందిరా గాంధీ (1917–1984) మెదక్), ఎం.పీ. |
62 సంవత్సరాలు, 56 రోజులు | 1980 జనవరి 14 [§] | 1984 అక్టోబరు 31 [†] |
4 సంవత్సరాలు, 291 రోజులు | 1980 |
|
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (I) | ఇందిర IV | |||
జైల్ సింగ్ (1982–1987) | ||||||||||||
6 | రాజీవ్ గాంధీ (1944–1991) అమేథి, ఎం.పీ. |
40 సంవత్సరాలు, 72 రోజులు | 1984 అక్టోబరు 31 |
డిసెంబరు 2 1989 |
5 సంవత్సరాలు, 32 రోజులు | – |
|
రాజీవ్ I | ||||
1984 | రాజీవ్ II | రామస్వామి వెంకటరామన్ (1987–1992) | ||||||||||
7 | విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (1931–2008) ఫతేపూర్, ఎంపీ |
58 సంవత్సరాలు, 160 రోజులు | 1989 డిసెంబరు 2 |
1990 నవంబరు 10 [NC] |
343 రోజులు | 1989 | జనతాదళ్ | విశ్వనాథ్ | ||||
8 | చంద్ర శేఖర్ (1927–2007) బల్లియా , ఎంపీ |
63 సంవత్సరాలు, 207 రోజులు | 1990 నవంబరు 10 |
1991 జూన్ 21 [RES] |
223 రోజులు | – |
|
సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) | చంద్ర శేఖర్ | |||
9 | పి.వి. నరసింహారావు (1921–2004) నంద్యాల, ఎంపీ |
69 సంవత్సరాలు, 358 రోజులు | 1991 జూన్ 21 |
1996 మే 16 |
4 సంవత్సరాలు, 330 రోజులు | 1991 |
|
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (I) | రావు | |||
శంకర్ దయాళ్ శర్మ (1992–1997) | ||||||||||||
10 | అటల్ బిహారీ వాజ్‌పేయి (1924–2018) లక్నో , ఎంపీ |
71 సంవత్సరాలు, 143 రోజులు | 1996 మే 16 |
1996 జూన్ 1 [RES] |
16 రోజులు | 1996 | భారతీయ జనతా పార్టీ | వాజ్‌పేయి I | ||||
11 | హెచ్.డి. | 63 సంవత్సరాలు, 14 రోజులు | 1996 జూన్ 1 |
1997 ఏప్రిల్ 21 [RES] |
324 రోజులు | – |
|
జనతాదళ్ (యునైటెడ్ ఫ్రంట్) |
దేవెగౌడ | |||
12 | ఇందర్ కుమార్ గుజ్రాల్ (1919–2012) బీహార్ (రాజ్యసభ) ఎం.పీ. |
77 సంవత్సరాలు, 138 రోజులు | 1997 ఏప్రిల్ 21 |
1998 మార్చి 19 [RES] |
332 రోజులు | – | గుజ్రాల్ | |||||
కె.ఆర్. నారాయణన్ (1997–2002) | ||||||||||||
(10) | అటల్ బిహారీ వాజ్‌పేయి (1924–2018) లక్నో , ఎంపీ |
73 సంవత్సరాలు, 84 రోజులు | 1998 మార్చి 19 [§] | 2004 మే 22 |
6 సంవత్సరాలు, 64 రోజులు | 1998 |
|
భారతీయ జనతా పార్టీ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) |
వాజ్‌పేయి II | |||
1999 | వాజ్‌పేయి III | |||||||||||
ఎ.పి.జె.అబ్దుల్ కలాం (2002–2007) | ||||||||||||
13 | మన్మోహన్ సింగ్ (జననం 1932) అసోం (రాజ్యసభ) ఎం.పీ |
71 సంవత్సరాలు, 239 రోజులు | 2004 మే 22 |
2014 మే 26 |
10 సంవత్సరాలు, 4 రోజులు | 2004 |
|
భారత జాతీయ కాంగ్రెస్ (ఐక్య ప్రగతిశీల కూటమి) |
మన్మోహన్ I | |||
ప్రతిభా పాటిల్ (2007–2012) | ||||||||||||
2009 | మన్మోహన్ II | |||||||||||
ప్రణబ్ ముఖర్జీ (2012–2017) | ||||||||||||
14 | నరేంద్ర మోదీ (జననం 1950) వారణాసి , ఎంపీ |
63 సంవత్సరాలు, 251 రోజులు | 2014 మే 26 |
అధికారంలో ఉన్న వ్యక్తి | 10 సంవత్సరాలు, 181 రోజులు | 2014 |
|
భారతీయ జనతా పార్టీ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) |
మోదీ I | |||
రామ్ నాథ్ కోవింద్ (2017–2022) | ||||||||||||
2019 | మోడీ II | |||||||||||
ద్రౌపది ముర్ము (2022–present) | ||||||||||||
2024 | మోడీ III |
ప్రధాని అధికార నివాసం
మార్చు- న్యూ ఢిల్లీ లోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్ (గతంలో 7, రేస్‌కోర్సు రోడ్డు) ప్రధాని అధికారిక నివాసం.[13]
గమనికలు
మార్చు- ↑ Not including Gulzarilal Nanda who served, twice, as acting prime minister.
- ↑ Governors-General:
Lord Louis Mountbatten
(1947–1948),
C. Rajagopalachari
(1948–1950)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 as per Section 3 of "The Salaries and Allowances of Ministers Act 1952 and the rules made thereunder" (PDF). Ministry of Home Affairs. Retrieved 28 January 2019.
- ↑ Pillay, Anashri (2019), "The Constitution of the Republic of India", in Masterman, Roger; Schütze, Robert (eds.), Cambridge Companion to Comparative Constitutional Law, Cambridge University Press, pp. 146–147, doi:10.1017/9781316716731, ISBN 978-1-107-16781-0, LCCN 2019019723, S2CID 219881288,
The head of government is the Prime Minister.
- ↑ Dam, Shubhankar (2016), "Executive", in Choudhry, Sujit; Khosla, Madhav; Mehta, Pratap Bhanu (eds.), The Oxford Handbook of the Indian Constitution, Oxford and New York: Oxford University Press, p. 307, ISBN 978-0-19-870489-8,
The Prime Minister is the head of government.
- ↑ Pillay, Anashri (2019), "The Constitution of the Republic of India", in Masterman, Roger; Schütze, Robert (eds.), Cambridge Companion to Comparative Constitutional Law, Cambridge University Press, pp. 146–147, doi:10.1017/9781316716731, ISBN 978-1-107-16781-0, LCCN 2019019723, S2CID 219881288,
An elected President is the nominal head of state but exercises little power.
- ↑ Majeed, Akhtar (2005), "Republic of India", in Kincaid, John; Tarr, G. Alan (eds.), Constitutional Origins, Structure, and Change in Federal Countries, A Global Dialogue on Federalism, Volume I, Montreal & Kingston: McGill-Queen's University Press for Forum of Federation and International Association of Centers for Federal Studies, pp. 180–207, 185, ISBN 0-7735-2849-0,
...The president is the constitutional head. (p. 185)
- ↑ Britannica, Eds. Encycl. (20 February 2020), "List of prime ministers of India", Encyclopaedia Britannica, Encyclopædia Britannica, Inc., retrieved 2 April 2022,
the prime minister, who is chosen by the majority party or coalition in the Lok Sabha (lower house of parliament) is formally appointed by the president.
- ↑ Dam, Shubhankar (2016), "Executive", in Choudhry, Sujit; Khosla, Madhav; Mehta, Pratap Bhanu (eds.), The Oxford Handbook of the Indian Constitution, Oxford and New York: Oxford University Press, p. 307, ISBN 978-0-19-870489-8,
Along with his or her cabinet, the Prime Minister is responsible to the Lower House of Parliament.
- ↑ Majeed, Akhtar (2005), "Republic of India", in Kincaid, John; Tarr, G. Alan (eds.), Constitutional Origins, Structure, and Change in Federal Countries, A Global Dialogue on Federalism, Volume I, Montreal & Kingston: McGill-Queen's University Press for Forum of Federation and International Association of Centers for Federal Studies, pp. 180–207, 185, ISBN 0-7735-2849-0,
...Both for the Union and the states, a "cabinet-type" system of parliamentary government has been instituted in which the executive is continuously responsible to the legislature. (p. 185)
- ↑ "Prime Minister and the Cabinet Ministers". pmindia.nic.in. Archived from the original on 20 April 2008. Retrieved 5 June 2008.
- ↑ "(Allocation of Business) Rules 1961". cabsec.nic.in. Archived from the original on 30 April 2008. Retrieved 5 June 2008.
- ↑ "A Man Who, with All His Mind and Heart, Loved India". Life. 5 June 1964. p. 32.
- ↑ "Narendra Modi appointed Prime Minister, swearing in on May 26". The Times of India. New Delhi. Press Trust of India. 20 May 2014. OCLC 23379369. Retrieved 6 April 2018.
- ↑ "PM chairing meeting on CWG". sify.com. Archived from the original on 11 August 2011. Retrieved 20 April 2021.