భారతీయ అంటార్కిటిక్ కార్యక్రమం

1981 లో మొదలుపెట్టిన శాస్త్రీయ కార్యక్రమం

భారతీయ అంటార్కిటిక్ కార్యక్రమం అనేది, భారత ప్రభుత్వపు భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ కింద ఉన్న జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధనా కేంద్రం చేపట్టి నిర్వహిస్తున్న బహుళ-అధ్యయన, బహుళ-సంస్థాగత కార్యక్రమం. 1981 లో చేసిన తొలి అంటార్కిటికా యాత్రతో ఇది మొదలైంది. [1] అంటార్కిటిక్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేయడంతో, 1983లో అంటార్కిటిక్ పరిశోధనా స్థావరమైన దక్షిణ గంగోత్రి నిర్మాణంతో ఈ కార్యక్రమం ప్రపంచ ఆమోదాన్ని పొందింది. [1] దక్షిణ గంగోత్రి స్థానంలో 1989 నుండి మైత్రి స్థావరం పనిచేస్తోంది. 2012 లో మరో కొత్త స్థావరం భారతిని, 134 షిప్పింగ్ కంటైనర్‌లతో నిర్మించారు. ఈ కార్యక్రమం కింద, వాతావరణం, జీవ, భూమి, రసాయన, వైద్య శాస్త్రాలను భారతదేశం అధ్యయనం చేస్తుంది. 2020 నాటికి ఈ కార్యక్రమం కింద అంటార్కిటికాకు 38 శాస్త్రీయ యాత్రలను నిర్వహించారు.

2005 ఫిబ్రవరి 25 నాటి మైత్రి స్థావరపు విహంగ వీక్షణ

చరిత్ర మార్చు

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, సోవియట్ యూనియన్‌కు చెందిన హైడ్రోమెటియోరోలాజికల్ సెంటర్ తో చేసుకున్న ఒప్పందాలు, భారతీయ అంటార్కిటికా యాత్రలకు మూలం. ఈ ఒప్పందాలతో 1971-1973 నాటి 17వ సోవియట్ అంటార్కిటిక్ యాత్రలో భారతీయుడైన డా. పరమ్‌జిత్ సింగ్ సెహ్రా పాల్గొన్నాడు. [2]

భారతదేశం 1983 ఆగస్టు 1 న అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థకు అంగీకరించింది. 1983 సెప్టెంబరు 12 న అంటార్కిటిక్ ఒప్పందంలో పదిహేనవ కన్సల్టేటివ్ సభ్యదేశంగా మారింది. [3]

సంస్థ మార్చు

భారత ప్రభుత్వంలోని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ భారత అంటార్కిటిక్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. [4] NCPOR, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్‌లు భారతదేశ అంటార్కిటిక్ యాత్రలకు సభ్యులను ఎంపిక చేస్తాయి. [2] వైద్య పరీక్షలు జరిపాక, హిమాలయాలలో శీతోష్ణస్థితికి అలవాటు పడే శిక్షణ పొందిన తర్వాత, ఈ సభ్యులు మనుగడ, పర్యావరణ నీతి, అగ్నిమాపక, సమూహంలో పనిచేయడం వగైరాల్లో కూడా శిక్షణ పొందుతారు. [2]

ఒక సాహసయాత్రకు గరిష్టంగా రూ. 20 కోట్లు ఖర్చవుతుంది. [2] భారతీయ అంటార్కిటిక్ కార్యక్రమపు వివిధ కార్యకలాపాలకు లాజిస్టికల్ మద్దతు భారతీయ సాయుధ దళాల లోని సంబంధిత శాఖలు అందిస్తాయి. [4] యాత్రల ప్రారంభ స్థానం గోవా నుండి 1999 డిసెంబరులో [2] NCAOR వ్యవస్థాపక డైరెక్టర్ డా. PC పాండే పాలనా కాలంలో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వరకు మారుతూ వచ్చింది. 2007 నాటికి భారతదేశంలోని 70కి పైగా సంస్థలు ఈ అంటార్కిటిక్ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి.[2]

ప్రపంచ సహకారం మార్చు

భారతీయ అంటార్కిటిక్ కార్యక్రమం, 1983లో భారతదేశం సంతకం చేసిన అంటార్కిటిక్ ట్రీటీ సిస్టమ్ నియమాలకు కట్టుబడి ఉంది. [4] భారతదేశం తన అంటార్కిటిక్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేపట్టిన వివిధ అంతర్జాతీయ కార్యకలాపాలను పాండే (2007) ఇలా వివరించాడు:

1983 సెప్టెంబరు 12 న, భారతదేశం కన్సల్టేటివ్ పార్టీ హోదాను సాధించింది, అక్టోబరు 1 న అంటార్కిటిక్ పరిశోధనపై శాస్త్రీయ కమిటీ (SCAR)లో సభ్యత్వం పొందింది. 1986లో కన్వెన్షన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ అంటార్కిటిక్ మెరైన్‌ లివింగ్ రిసోర్సెస్ లో సభ్యురాలైంది (CCAMLR). 1997లో భారతదేశం అంటార్కిటిక్ ఒప్పందానికి పర్యావరణ పరిరక్షణపై ప్రోటోకాల్‌ను ఆమోదించింది. తద్వారా అంటార్కిటిక్ పర్యావరణాన్ని పరిరక్షించడంలో భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటించింది. భారతదేశం 1999లో గోవాలో, అంటార్కిటిక్ లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్‌పై స్టాండింగ్ కమిటీ 11వ మావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. CCAMLR యొక్క పర్యావరణ వ్యవస్థ పర్యవేక్షణ, నిర్వహణపై వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని 1998 ఆగస్టులో కొచ్చిన్లో నిర్వహించింది. భారతదేశం 1998 నవంబరులో 2 సంవత్సరాల పాటు CCAMLR కు అధ్యక్షత వహించింది.[2]

భారతదేశం ఇంటర్‌గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్, కోస్టల్ హిందూ మహాసముద్రంలో ఇంటర్‌గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ (IOCINDIO), ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ (ISBA), యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ ది సీస్ లో సభ్యునిగా అంతర్జాతీయ సమాజంతో సహకరిస్తోంది. (UNCLOS). [4] [5] [6]

పరిశోధన మార్చు

 
NASA SeaWIFS చిత్రంపై క్రిల్ చేపల సాంద్రత - అంటార్కిటిక్ ద్వీపకల్పం వద్ద స్కోటియా సముద్రంలో ప్రధాన సాంద్రతలు ఉన్నాయి. అంటార్కిటిక్‌లోని దక్షిణ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం క్రిల్ అన్వేషణను నిర్వహిస్తోంది. [4] [7]

అనేక కారణాల వల్ల గ్లోబల్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లకు అంటార్కిటికా శాస్త్రీయ ఆసక్తిని కలిగిస్తోంది: 'ఖండాల ఆవిర్భావం, వాతావరణ మార్పు, వాతావరణ శాస్త్రం, కాలుష్యం' వంటివి SD గాడ్ (2008) ఉదహరించిన కారణాలలో కొన్ని. [4] మృణాళిని జి. వాలావల్కర్ (2005) ఇలా పేర్కొంది: 'మంచు-సముద్రాల పరస్పర చర్య, ప్రపంచ ప్రక్రియలు; పాలియో ఎన్విరాన్మెంట్, పాలియోక్లైమాటిక్ అధ్యయనాలు; భూమి యొక్క భౌగోళిక పరిణామం, గోండ్వానాలాండ్ పునర్నిర్మాణం; అంటార్కిటిక్ పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం, పర్యావరణ శరీరధర్మశాస్త్రం; సౌర భూగోళ ప్రక్రియలు, వాటి కలయిక; మెడికల్ ఫిజియాలజీ, అడాప్టేషన్ టెక్నిక్స్, హ్యూమన్ సైకాలజీ; పర్యావరణ ప్రభావం అంచనా, పర్యవేక్షణ; తక్కువ ఉష్ణోగ్రత సాంకేతికత అభివృద్ధిని ప్రారంభించడం; భూకంపాలపై అధ్యయనాలు భారతీయ అంటార్కిటిక్ కార్యక్రమపు అధ్యయన రంగాలలో ఉన్నాయి. [6]

దేశం యొక్క అంటార్కిటిక్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2001 నాటికి దాదాపు 1,300 మంది భారతీయులు ఖండాన్ని సందర్శించారు. [7] ఈ యాత్రల్లో ఈ ప్రాంతంలోని జంతుజాలం, పరమాణు జీవవైవిధ్యాన్ని కూడా అధ్యయనం చేస్తారు. [8] [9] 2005 నాటికి అంటార్కిటిక్‌లో అంతర్జాతీయ శాస్త్రీయ కృషి ఫలితంగా మొత్తం 120 కొత్త సూక్ష్మజీవులు వెలుగు లోకి వచ్చాయి. [6] వీటిలో 30 సూక్ష్మజీవులను భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. [6] 2007 నాటికి [2] భారతదేశం అంటార్కిటిక్ అధ్యయనాల ఆధారంగా 300 పరిశోధన ప్రచురణలను ప్రచురించింది.

అంటార్కిటిక్ లోని విస్తారమైన మంచు పలకలలో రంధ్రాలు వేసి వెలికి తీసిన 'ఐస్ కోర్స్' భూమి యొక్క పాలియోక్లిమేట్, ఎకో-హిస్టరీపై సమాచారాన్ని అందజేస్తాయి. ఎందుకంటే గాలికి కొట్టుకొచ్చిన దుమ్ము, అగ్నిపర్వత బూడిద లేదా రేడియోధార్మికతల రికార్డులు మంచులో పేరుకుపోయి ఎన్నేళ్ళైనా చెక్కుచెదరకుండా భద్రంగా ఉంటాయి. [4] మంచు కోర్‌లు, మంచు నమూనాల సంరక్షణ, విశ్లేషణల కోసం NCAOR, −20 °C వద్ద ఉండే ప్రయోగశాల సముదాయంతో ధ్రువ పరిశోధన & అభివృద్ధి ప్రయోగశాలను అభివృద్ధి చేసింది. [4] 'ఐస్ కోర్' నమూనాలను అటువంటి సాంకేతికత ద్వారా రూపొందించబడిన కంటైన్‌మెంట్ యూనిట్‌లలో ఉంచి, ప్రాసెస్ చేస్తారు, విశ్లేషిస్తారు. [4] పాలీ ప్రొపైలిన్‌తో తయారు చేయబడిన స్టోరేజ్ కేసులు కూడా నమూనాల లక్షణాలను మారిపోకుండా పరిరక్షిస్తాయి. వెలికి తీసినపుడు అవి ఎలా ఉన్నాయో అదే రూపంలో వాటిని విశ్లేషణ కోసం భద్రపరుస్తారు. [4]

పరిశోధనా కేంద్రాలు మార్చు

1981లో అంటార్కిటికాలో మొదటిసారిగా భారత జెండా ఆవిష్కృతమైంది, అంటార్కిటిక్ ఒప్పందం (1959) పర్యావరణ ప్రోటోకాల్ ప్రకారం దక్షిణ మహాసముద్ర యాత్రలు ప్రారంభమయ్యాయి.

దక్షిణ గంగోత్రి మార్చు

మొదటి శాశ్వత నివాసం, దక్షిణ గంగోత్రిని 1983 లో నిర్మించారు. ఆ తరువాత ఇది మంచులో కూరుకుపోగా 1989లో తిరిగి తవ్వారు. అప్పటి నుండి సరఫరా స్థావరంగా, ట్రాన్సిట్ క్యాంపుగా ఉపయోగించారు. అంళ్ళీ దక్షిణ గంగోత్రిలో సగం మంచు కింద కూరుకుపోవడంతో 1990లో దానిని తొలగించారు. ఇప్పుడది ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే. దాని కాలంలో అది మంచు కరిగించే ప్లాంట్, ప్రయోగశాలలు, నిల్వ, వసతి, వినోద సౌకర్యాలు, క్లినిక్, బ్యాంక్ కౌంటర్ వంటి బహుళ సహాయక వ్యవస్థల స్థావరంగా ఉండేది.

మైత్రి మార్చు

రెండవ శాశ్వత స్థావరం, మైత్రి. దీన్ని 1989లో షిర్మాచెర్ ఒయాసిస్‌లో ఏర్పాటు చేసారు. భూగర్భ శాస్త్రం, భూగోళశాస్త్రం, వైద్యశాస్త్రంలో ప్రయోగాలను నిర్వహిస్తోంది. ప్రియదర్శిని సరస్సు అనే మంచినీటి సరస్సుకి దగ్గరగా భారతదేశం ఈ స్థావరాన్ని నిర్మించింది. మైత్రి షిర్మాచర్ ఒయాసిస్ యొక్క జియోమోర్ఫోలాజిక్ మ్యాపింగ్ మిషన్‌ను పూర్తి చేసింది.

భారతి మార్చు

69°S, 76°E వద్ద లార్స్‌మన్ హిల్ పక్కన 2015 లో భారతి స్థావరాన్ని స్థాపించారు. సముద్ర శాస్త్ర పరిశోధన కోసం ఈ సరికొత్త పరిశోధనా కేంద్రం భారత ఉపఖండం యొక్క 12 కోట్ల సంవత్సరాల పురాతన చరిత్రను వెల్లడించే ఖండాంతర విచ్ఛిన్నానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తుంది.

అంటార్కిటికాలోని ఇండియా పోస్ట్ ఆఫీస్ మార్చు

1984లో అంటార్కిటికాకు మూడవ భారతీయ యాత్ర సందర్భంగా పోస్టాఫీసును స్థాపించారు. ఇది దక్షిణ గంగోత్రిలో ఉంది. ఈ పోస్ట్ ఆఫీసు నిజానికి ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉంది. ఈ స్థలం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పోస్టా ఫీసు స్థాపించిన మొదటి సంవత్సరంలో మొత్తం 10,000 ఉత్తరాలు పోస్ట్ చేసారు. ఇప్పుడా పోస్టాఫీసు అక్కడ లేనప్పటికీ, క్రూయిజ్ షిప్‌లలో ఈ ప్రదేశాన్ని సందర్శించే భారతీయ పర్యాటకులకు ఇది ఇష్టమైన పర్యాటక స్థలం.

భారతీయ అంటార్కిటిక్ యాత్రలు మార్చు

తేదీ యాత్ర నాయకుడు ఉప నాయకుడు నాయకుడు

(వేసవి బృందం)

ఉప నాయకుడు

(వేసవి బృందం)

1981–1982 మొదటి అంటార్కిటికా యాత్ర డా.ఎస్.జెడ్.కాసిం సి.పి.వోహ్రా, హెచ్.ఎన్. సిద్దికీ
1982–1983 2 వ అంటార్కిటికా యాత్ర వి.కె.రైనా డా>సి.ఆర్.శ్రీధరన్
1983–1985 3 వ అంటార్కిటికా యాత్ర డా హర్ష్ గుప్తా లెఫ్టి.కల్. సత్య స్వరూప్ శర్మ
1984 4 వ అంటార్కిటికా యాత్ర డా.బి.బి.భట్టాచార్య డి.కె.పాండే
5 వ అంటార్కిటికా యాత్ర ఎం.కె.కౌల్
6 వ అంటార్కిటికా యాత్ర
1987-1989 7 వ అంటార్కిటికా యాత్ర ఆర్. సేన్‌గుప్తా డా. జి.ఎస్. మిట్టల్
1988–1990 8 వ అంటార్కిటికా యాత్ర Dr అమితావ సేన్‌గుప్తా కల. ఎస్. జగన్నాథన్
1989–1991 9 వ అంటార్కిటికా యాత్ర రసిక్ రవీంద్ర
1990–1992 10 వ అంటార్కిటికా యాత్ర ఎ.కె. హంజూరా
1991–1993 11 వ అంటార్కిటికా యాత్ర డా. ముఖర్జీ
12 వ అంటార్కిటికా యాత్ర
13 వ అంటార్కిటికా యాత్ర
14 వ అంటార్కిటికా యాత్ర
15 వ అంటార్కిటికా యాత్ర
16 వ అంటార్కిటికా యాత్ర
17 వ అంటార్కిటికా యాత్ర
18 వ అంటార్కిటికా యాత్ర
19 వ అంటార్కిటికా యాత్ర
20 వ అంటార్కిటికా యాత్ర
2002–2003 21 వ అంటార్కిటికా యాత్ర ఆర్.పి.పాల్
22 వ అంటార్కిటికా యాత్ర
23 వ అంటార్కిటికా యాత్ర
24 వ అంటార్కిటికా యాత్ర
2005-2007 25 వ అంటార్కిటికా యాత్ర
26 వ అంటార్కిటికా యాత్ర
27 వ అంటార్కిటికా యాత్ర
2008–2009 28 వ అంటార్కిటికా యాత్ర డా. పి. మల్హోత్రా అజయ్ ధర్
2009–2010 29 వ అంటార్కిటికా యాత్ర P. ఎలాంగో రాజేష్ అస్థానా
2010–2011 30 వ అంటార్కిటికా యాత్ర కె.జీవా రాజేష్ అస్థానా
2011–2012 31 వ అంటార్కిటికా యాత్ర డా. రూపేష్ ఎం. దాస్ (భారతి)

ఉత్తమ్ చంద్ (మైత్రి)

రాజేష్ అస్థానా
2013–2014 33 వ అంటార్కిటికా యాత్ర మహమ్మద్. యూనస్ షా (భారతి) అభిజిత్ పాటిల్ (భారతి)
2014–2015 34 వ అంటార్కిటికా యాత్ర కైలాష్ భింద్వార్ (భారతి) సయ్యద్ షాదాబ్ (భారతి)
2017–2018 37 వ అంటార్కిటికా యాత్ర డా. శైలేష్ పెడ్నేకర్ (భారతి) బగతి సుదర్శన్ పాత్రో (భారతి)
2018–2020 38 వ అంటార్కిటికా యాత్ర కె. జీవా, మాత్రి- పి. ఎలెంగో, భారతి

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Walawalkar (2015), Gad (2008)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 Anas (2007)
  3. Department of Ocean Development, Government of India. Annual Report 1983-1984, TECHNICAL PUBLICATION NO. 3., Printed at Dee Kay Printers Kirtinagar, New Delhi
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 Gad (2008)
  5. Pursuit and Promotion of Science – The Indian Experience (2001), 351
  6. 6.0 6.1 6.2 6.3 Walawalkar (2005)
  7. 7.0 7.1 Pursuit and Promotion of Science – The Indian Experience (2001), 352
  8. Pursuit and Promotion of Science – The Indian Experience (2001), 173
  9. Pursuit and Promotion of Science – The Indian Experience (2001), 213