ఇందు రాజ్ నర్వాల్
హర్యానా రాజకీయ నాయకుడు, రాష్ట్ర శాసనసభ్యుడు
ఇందు రాజ్ నర్వాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020, 2024 శాసనసభ ఎన్నికలలో బరోడా నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
ఇందురాజ్ నర్వాల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2020 | |||
ముందు | శ్రీ కృష్ణ హుడా | ||
---|---|---|---|
నియోజకవర్గం | బరోడా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఇందు రాజ్ నర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 హర్యానా శాసనసభ ఎన్నికల్లో బరోడా నుండి గెలిచిన శ్రీ కృష్ణ హుడా అనారోగ్యంతో మరణించడంతో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యోగేశ్వర్ దత్‌పై 10566 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
ఇందురాజ్ నర్వాల్ 2024 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కపూర్ సింగ్ నర్వాల్‌పై 5642 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Hindu (10 November 2020). "Baroda bypoll: BJP's Yogeshwar Dutt defeated by Congress nominee" (in Indian English). Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Baroda". Retrieved 31 October 2024.