ఇటాలియా కొప్పోలా

అమెరికన్ సినిమా నటి

ఇటాలియా పెన్నినో కొప్పోలా (1912, డిసెంబరు 12 - 2004, జనవరి 21) అమెరికన్ సినిమా నటి.[1] ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా తీసిన వన్ ఫ్రమ్ ది హార్ట్, ది గాడ్ ఫాదర్ పార్ట్ II, ది గాడ్ ఫాదర్ పార్ట్ III వంటి సినిమాలలో నటించింది.[2] వంటకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్, మామా కొప్పోలాస్ పాస్తా బుక్ అనే వంట పుస్తకాన్ని కూడా ప్రచురించింది.[3][4]

ఇటాలియా కొప్పోలా
జననం
ఇటాలియా పెన్నినో కొప్పోలా

(1912-12-12)1912 డిసెంబరు 12
మరణం2004 జనవరి 21(2004-01-21) (వయసు 91)
సమాధి స్థలంశాన్ ఫెర్నాండో మిషన్ స్మశానవాటిక
జీవిత భాగస్వామికార్మైన్ కొప్పోలా
పిల్లలుఆగస్ట్ కొప్పోలా
ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
తాలియా షైర్

ఇటాలియా కొప్పోలా 1912, డిసెంబరు 12 న్యూయార్క్ నగరంలో జన్మించింది. ఇటలీలోని నేపుల్స్‌కు చెందిన అన్నా , స్వరకర్త ఫ్రాన్సిస్కో పెన్నినో దంపతుల ఆరుగురు పిల్లలలో ఆమె ఒకరు.[5] బ్రూక్లిన్‌లోని కుటుంబానికి చెందిన ఎంపైర్ థియేటర్‌లోని అపార్ట్‌మెంట్‌లో జన్మించింది. [6]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1972 ది గాడ్‌ఫాదర్ వివాహ సన్నివేశంలో అదనపు పాత్ర
1974 ది గాడ్‌ఫాదర్ పార్ట్ II మామా కార్లియోన్ శరీరం
1981 వన్ ఫ్రమ్ ది హార్ట్ ఎలివేటర్ #2లో జంట
1990 గాడ్ ఫాదర్ పార్ట్ III సిగ్నోరా ఆల్టోబెల్లో

ఇటాలియా పెన్నినో కొప్పోలా 2004, జనవరి 21న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలెస్ లో మరణించింది. తన భర్తను ఖననం చేసిన శాన్ ఫెర్నాండో మిషన్ స్మశానవాటికలో ఈమెకూడా ఖననం చేయబడింది.[7][8]

మూలాలు

మార్చు
  1. "Italia Pennino Coppola, 91; Mother of Director, Actress". Los Angeles Times. 2004-01-23. Retrieved 2023-06-11.
  2. "AFI|Catalog". catalog.afi.com. Retrieved 2023-06-11.
  3. Times, Los Angeles. "ITALIA PENNINO COPPOLA, 91". chicagotribune.com. Retrieved 2023-06-11.
  4. Variety Staff (2004-01-24). "Italia Coppola". Variety (in ఇంగ్లీష్). Retrieved 2023-06-11.
  5. Michael Cabanatuan (2004-01-23). "Italia Coppola – mother of filmmaker". SFGate. Retrieved 2023-06-11.
  6. "Francis Ford Coppola". archive.nytimes.com. Retrieved 2023-06-11.
  7. "Italia Coppola Obituary (2004) San Diego Union-Tribune". Legacy.com. Retrieved 2023-06-11.
  8. "Italia Pennino Coppola, 91; Mother of Director, Actress". L.A. Times Archives. Jan 23, 2004.

బాహ్య లింకులు

మార్చు