ఇదా లోకం
(ఇదాలోకం నుండి దారిమార్పు చెందింది)
ఇదాలోకం 1973లో కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. శోభన్ బాబు, శారద జంటగా తీసిన ఈ చిత్రాన్ని ఆరు లక్షల పెట్టుబడితో నిర్మించారు.[1] ఈ సినిమాకు కె. చక్రవర్తి అందించిన సంగీతం బాగా విజయవంతమై ఆయనకు పేరు తెచ్చిపెట్టింది.[2] సినిమాలో జ్యోతిలక్ష్మి శృంగార నృత్యంతో చిత్రీకరించిన గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు పాట ప్రేక్షకాదరణ పొందడంతో తిరిగి అదే పాట రీమిక్సును 2009లో విడుదలైన కుబేరులు చిత్రంలో జ్యోతిలక్ష్మిపై తిరిగి చిత్రీకరించారు[3] ఈ సినిమా నిర్మాణంలో తండ్రి వద్ద సహాయదర్శకుడిగా, ఆ తరువాతి కాలంలో ప్రముఖ దర్శకుడైన కె.రాఘవేంద్రరావు పనిచేశాడు.[4]
ఇదా లోకం (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్. ప్రకాశరావు |
---|---|
నిర్మాణం | వి.ఆర్.యాచేంద్ర (వెంకటగిరి రాజా) |
తారాగణం | శోభన్ బాబు, శారద, జ్యోతిలక్ష్మి |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, బి.వసంత |
గీతరచన | ఆరుద్ర, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి |
నిర్మాణ సంస్థ | సమత చిత్ర |
భాష | తెలుగు |
పెట్టుబడి | 6 లక్షలు[1] |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- శోభన్ బాబు
- శారద
- ఆరతి
- నాగభూషణం
- చంద్రమోహన్
- అల్లు రామలింగయ్య
- రావు గోపాలరావు
- జ్యోతిలక్ష్మి
- ఏచూరి
పాటలు
మార్చు- నిత్య సుమంగళి నీవమ్మా నీకు - ఘంటసాల, బి. వసంత - రచన: ఆచార్య ఆత్రేయ
- గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు ... గుడి యెనక నా సామి గుఱ్ఱమెక్కి కూచున్నాడు - రచన: వీటూరి
- నీ మనసు నా మనసు ఏకమై - సి. నారాయణ రెడ్డి
- ఏటి గట్టున కూర్చుంటే
- ఓ..కోయిలా
- ఎందుకు నవ్వావంటే ఏమని చెప్పను - రచన: ఆరుద్ర
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-30. Retrieved 2009-10-01.
- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/33492.html
- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/43017.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-02-10. Retrieved 2009-10-01.