ఇనపరాజుపల్లి

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా లోని గ్రామం

ఇనపరాజుపల్లి , పల్నాడు జిల్లా కారంపూడి మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.

ఇనపరాజుపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఇనపరాజుపల్లి is located in Andhra Pradesh
ఇనపరాజుపల్లి
ఇనపరాజుపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E / 16.399201; 79.76738
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం కారంపూడి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి చల్లా ఏశ్వరమ్మ
పిన్ కోడ్ 522614
ఎస్.టి.డి కోడ్

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

ఇనపరాజుపల్లి. ఈ గ్రామానికి పేరు పెట్టినది బొమ్మారెడ్డి మాచిరెడ్డి అనే జమీందార్. ఈయన తంగెడ గ్రామానికి చెందినవాడు. ఒకసారి ఈ జమీందార్ కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్తుంటె మార్గ మధ్యంలో వారి బండి ఇరుసు (ఇనప ఇరుసు) విరిగిపోయింది. అక్కడ వారికి రెండు గుడిసెలు కనిపించెను. ఈ ఊరి పేరు ఏమిటి అని అక్కడ వారిని అడిగెను. వారిలో కాటమ రాజు అనే అతను - అయ్యా నా పేరు కాటమ రాజు, ఇది ఊరు కాదు, మేము బ్రతుకుతెరువు కోసం ఇక్కడికి వచ్చాము అని సమాధానమిచ్చెను. వెంటనే ఆ జమీందార్ - చాలా గట్టిదైన బండి ఇనప ఇరుసు ఇక్కడ విరిగింది కావున ఇనపరాజుపల్లి అనే పేరుతో ఇక్కడ ఒక గ్రామం ఏర్పడుతుంది అని జోస్యం చెప్పారు.

గ్రామ పంచాయతీ

మార్చు
  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చల్లా ఈశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
  2. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయానికి నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి, 2016, ఫిబ్రవరి-3న శంకుస్థాపన నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

మూలాలు

మార్చు