ఇన్శాట్-3D ఉపగ్రహం
ఇన్శాట్-3D ఉపగ్రహంను ఇండియన్ స్పేస్ రీసెర్చ్‌అర్గనైజేసన్ (ఇస్రో) వారు రూపొందించారు. ఈ ఉపగ్రహన్ని అంతరిక్షసంబంధ, వాతావరణపరిశీలన, డేటారిలే, శాటిలైట్ ఆధారిత అన్వేషణ, రక్షించు వంటి ప్రణాళికలతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలోని అంతరిక్ష పరిశోధనకేంద్రం నుండి అంతరిక్షములో ప్రవేశ పెట్టారు.ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షము లోని కక్ష్యలో ప్రవేశపెట్టుటకై ఏరియన్ 5 ECA అను ఉపగ్రహ ప్రయోగ/వాహననౌకను ఉపయోగించారు.ఇన్శాట్-3D ఉపగ్రహాన్ని 2013 జూలై 26 న విజయవంతంగా అంతరిక్షములోకి పంపి, కక్ష్యలో ప్రవేశపెట్టారు.[2] [3]
మిషన్ రకం | Weather |
---|---|
ఆపరేటర్ | ISRO |
COSPAR ID | 2013-038B |
SATCAT no. | 39216 |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-2K |
తయారీదారుడు | ISRO Satellite Centre Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 2,000 కిలోగ్రాములు (4,400 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 25 July 2013, 19:54:07 | UTC
రాకెట్ | Ariane 5ECA |
లాంచ్ సైట్ | Kourou ELA-3 |
కాంట్రాక్టర్ | Arianespace |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geostationary |
రేఖాంశం | 82° East |
Perigee altitude | 35,791 కిలోమీటర్లు (22,239 మై.) |
Apogee altitude | 35,795 కిలోమీటర్లు (22,242 మై.) |
వాలు | 0.08 degrees |
వ్యవధి | 23.93 hours |
ఎపోచ్ | 7 November 2013, 23:50:57 UTC[1] |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | C-band[ఆధారం చూపాలి] |
ఇన్శాట్-3D ఉపగ్రహ సాంకేతిక వివరాలు
మార్చుఇన్శాట్-3D ఉపగ్రహంలో పలు నూతన సాంకేతికపరిజ్ఞానంతో తయారుచేసిన ఉపకరణాలను బిగించారు. స్టార్ సెన్సారులవంటి నుటన అవిష్కారలను అమర్చారు.ఉపగ్రహ ఇబ్బందులను తగ్గించుటకై సూక్ష్మసౌర అమరిక డ్రైవ్‌అసెంబ్లీని (micro stepping Solar Array Drive Assembly: (SADA, ఉపగ్రహనిర్వహణ, టెలికాం, టెలిమెట్రి నిర్వహణకు బస్‌మేనేజిమెంట్ యూనిట్ ను నెలకొల్పినారు.C-బ్యాండ్ ట్రాన్స్‌పాండరును ఉంది.
ఉపగ్రహంలోని పేలోడ్
మార్చుఉపగ్రహంలో 3 పేలోడులను అమర్చారు.
- మేటియోలాజికల్ పరికారాలు (MET)
- డేటారిలే ట్రాన్స్‌పాండరులు (DRT)
- శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్కు (SAS&R) సిస్టం
ఉపగ్రహ ప్రయోగం
మార్చుమొదట ఇన్శాట్-3D ఉపగ్రహాన్ని జీస్ఎల్‌వి శ్రేణికి చెందిన జీస్‌ఎల్‌వి Mk-II ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టాలనుకొన్నారు. తరువాత అభిప్రాయాన్ని మార్చుకొని, ఇస్రో చైర్మన్ ఉపగ్రహాన్ని గయానా నుండి, ఏరియన్ 5 ECAవాహక నౌక ద్వారా ప్రయోగించాలని నిర్ణయించినట్లు 2010 డిసెంబరు 4 న ప్రకటించాడు. ఇన్శాట్-3D ఉపగ్రహాన్ని26, జూలై, 2013న ఫ్రెంచి గయానా నుండి అంతరిక్షములోకి పంపి, నిర్దేశించినకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఏరియన్ 5 ECA వాహకనౌక ద్వారా ఇన్శాట్-3D ఉపగ్రహంతో పాటు అల్ఫాశాట్ అనే టెలికమ్యునికేసన్ ఉపగ్రహాన్ని కూడా ఏకకాలంలో అంతరిక్షంలో ప్రవేశపెట్టారు[4][5]
మూలాలు/ఆధారాలు
మార్చు- ↑ Peat, Chris (7 November 2013). "INSAT 3D - Orbit". Heavens Above. Retrieved 9 November 2013.
- ↑ "Weather satellite INSAT-3D launched successfully". The Hindu. Retrieved 26 July 2013.
- ↑ "Advanced weather satellite INSAT-3D successfully launched". The Times of India. Archived from the original on 2013-07-28. Retrieved 26 July 2013.
- ↑ "Flawless launch of Alphasat, Europe's largest and most sophisticated telecom satellite". www.esa.in. Retrieved 25 July 2013.
- ↑ "Europe's Largest-Ever Telecommunications Satellite Launches With Indian Weather Probe". www.space.com. Retrieved 26 July 2013.