దక్షిణ అమెరికా

ప్రధానంగా దక్షిణార్థగోళంలో విస్తరించి ఉన్న ఒక ఖండం

దక్షిణ అమెరికా

విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ
జనాభా 382,000,000
జనసాంద్రత 21.4 / చ.కి.మీ.
దేశాలు 12
ఆధారితాలు 3
ప్రాదేశికత సౌత్ అమెరికన్
భాషలు స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఆంగ్లం, కెఛ్వా, ఐమారా, గ్వారానీ, మొదలగునవి.
టైమ్ జోన్ UTC -2:00 (బ్రెజిల్) నుండి UTC -5:00 (ఈక్వెడార్)
పెద్ద నగరాలు సావోపాలో
బ్యూనస్ ఎయిర్స్
రియో డి జనీరో
బొగాటా
లీమా
శాంటియాగో
కారకస్

దక్షిణ అమెరికా ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది. ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు మద్య ఒక ఆకు వలె కనిపించును. ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా, కరీబియన్ సముద్రం గలవు. దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.

భౌగోళికం

మార్చు
 
దక్షిణ అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.

ఉనికి

మార్చు

దక్షిణ అమెరికా త్రిభిజాకారముగా ఉంది.దీని ఉత్తర ంహాగము విశాలముగా ఉండి, దక్షిణమునకు పోవుకొద్ది సన్నబడుతుంది.ఈ ఖండము ప్రపంచ పటములో ఒక ఆకు వలె కనిపిస్తుంది.దక్షిణ అమెరికా ఒక పొడవైన నది, ఒక పొడవైన దేశము కలిగిన ఖండము.

వాతావరణం

మార్చు

'దక్షిణ అమెరికా'లో చాలావరకు భౌతికరూపమును అనుసరించి ఉంది.ఈ ప్రాంతంలో చాలా భాగం ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో వేడి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటాయి. దక్షిణ అమెరికాలో సూర్యుని అనుసరించి వర్షం కురుస్తుంది (Rain follows the sun). ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరప్రాంతంలో ఉన్నపుడు ఉత్తరప్రాంతంలోనూ, దక్షిణంలో ఉన్నపుడు దక్షిణా ప్రాంతంలోనూ వర్షం కురుస్తుంది. 'దక్షిణ అమెరికా'లోని 'దక్షిణ పెరు, ఉత్తరచిలీ లలో అటాకమ ఏడారి ఉంది. ఆండీస్ పర్వతా లకు తూర్పున పేటగొనియ ఏడారి ఉన్నాయి. దక్షిణ అమెరికా అన్నింటా ఆతిగానుండిన ఒక ప్రత్యేకత కలిగిన ఖండము.

అడవులు జంతువులు

మార్చు

'దక్షిణ అమెరికా'లో చాలాభాగం అడవులతో నిండి ఉంది. అమెజాన్ ప్రాంతంలో గల అడవులను భూమండల ఊపిరితిత్తులు అంటారు.అమెజాన్ ప్రాంతం రబ్బరు చెట్లకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' వివిధ రకాలైన జంతువులకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' రకరకాలైన పక్షులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో సరీసృపాలలో కొండచిలువ పాములు ముఖ్యమయినవి. పూమ, లామ ముఖ్యమయినవ జంతువులు.

జనాభా

మార్చు

దక్షిణ అమెరికా సుమారు 42 కోట్లు ఉండవచ్చును.జనసాంద్రత కిలోమీటరుకు సుమారు 22.జనాభా విస్తరణలో సమతుల్య లేదు.అమెజాన్ నది పల్లపు ప్రాంతాలు, గయాన మెట్ట భుములు, అటకామ, పెటగోనియా ఎడారులలో జనసాంద్రత అత్యల్పము.దక్షిణ అమెరికా తీర ప్రాంతములలో జనసాంద్రత అధికము.జనాభా చాలవరకు రేవు పట్టణములు, రాజధాని నగరములలో నివసిస్తున్నారు.

వ్యవసాయం

మార్చు

దక్షిణ అమెరికా'లో ప్రధాన పంటలు మొక్క జొన్న, గోధుమ, కాఫీ, చెరుకు, ప్రత్తి.మొక్క జొన్న, గోధుమ దక్షిణ అమెరికా'లో ప్రధాన ఆహార పంటలు.బ్రెజిల్, అర్జెంటీనాలు మొక్క జొన్న ప్రధాన ఉత్పత్తి కేం ద్రాలు.కాఫీ, చెరుకు ఇక్కడి ప్రధాన వాణిజ్య పంటలు.ప్రపంచ కాఫి ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రముఖ స్థానములో ఉంది.

ఖనిజాలు

మార్చు

పెట్రోలియం, ముడి ఇనుము, రాగి, నైట్రేట్ వంటి ఖనిజాలు దక్షిణ అమెరికాలో ఎక్కువగా లభిస్తాయి. దక్షిణ అమెరికాలో జరుగు రాగి ఉత్పత్తి ప్రపంచ రాగి ఉత్పత్తిలో ఐదవ వంతుగా ఉత్పత్తి అవుతోంది.ప్రపంచ తగరము ఉత్పత్తిలో బొలివియా రెండవ స్థానములో ఉంది.ప్రపంచంలో గల ఖనిజతైల ఉత్పత్తులలో ఏడవ వంతు దక్షిణ అమెరికాలో ఉత్పత్తి చేస్తోంది.

పరిశ్రమలు

మార్చు

దక్షిణ అమెరికాలో ఇనుము-ఉక్కు, నూలు వస్త్ర, పంచధార, మాంస సంబంధమైన పరిశ్రమలు, నూనెశుద్ధి, రాగి కరిగించు పరిశ్రమలు ముఖ్యమయిన పరిశ్రమలు.అర్జెంటైనా ప్రపంచంలో ఎక్కువగా మాంసం ఉత్పత్తులు చేస్తున్నది.వెనుజులాలో నూనెశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.

వాణిజ్యము

మార్చు

ఎగుమతులు:కాఫీ, ప్రత్తి,, ముడి ఇనుము, కలప, పంచదార, ఉన్ని దిగుమతులు:యంత్రములు, మోటారు వాహనాలు, రసాయన పదార్దాలు, నేల బొగ్గు ముఖ్యమయినవి.

దేశాలు

మార్చు
Flag Arms దేశం పేరు విస్తీర్ణం జనాభా
(2016 est.) [1]
జన సాంద్రత
per km2 (per sq mi)
రాజధాని
  Argentina అర్జెంటీనా 2,766,890 కి.మీ2 (1,068,300 చ. మై.) 43,847,430 14.3/km² (37/sq mi) బ్యూనస్ ఎయిర్స్
    బొలివియా 1,098,580 కి.మీ2 (424,160 చ. మై.) 10,887,882 8.4/km² (21.8/sq mi) లా పెజ్
    బ్రెజిల్ 8,514,877 కి.మీ2 (3,287,612 చ. మై.) 207,652,865 22.0/km² (57/sq mi) బ్రెసిలియ
    చిలీ[2]   756,950 కి.మీ2 (292,260 చ. మై.) 17,909,754 22/km² (57/sq mi) సాంటియాగో
    కొలంబియా 1,141,748 కి.మీ2 (440,831 చ. మై.) 48,653,419 40/km² (103.6/sq mi) బోగోటా
    ఈక్వడార్   283,560 కి.మీ2 (109,480 చ. మై.) 16,385,068 53.8/km² (139.3/sq mi) క్వీటొ
    ఫాల్క్లాండ్ దీవులు (United Kingdom) [3]    12,173 కి.మీ2 (4,700 చ. మై.) 2,910 0.26/km² (0.7/sq mi) స్టాన్లీ
    ఫ్రెంచ్ గయనా (France)    91,000 కి.మీ2 (35,000 చ. మై.) 275,713 2.7/km² (5.4/sq mi) కేయేన్ (Préfecture)
    గయానా   214,999 కి.మీ2 (83,012 చ. మై.) 773,303 3.5/km² (9.1/sq mi) జార్జ్ టౌన్
    పరాగ్వే   406,750 కి.మీ2 (157,050 చ. మై.) 6,725,308 15.6/km² (40.4/sq mi) అసూన్సియోన్
    పెరూ 1,285,220 కి.మీ2 (496,230 చ. మై.) 31,773,839 22/km² (57/sq mi) లిమా
    దక్షిణ జార్జియా, దక్షిణ సాండ్విచ్ దీవులు (United Kingdom) [4]     3,093 కి.మీ2 (1,194 చ. మై.) 20 0/km² (0/sq mi) ఎడ్వర్డ్ పాయింట్
    సురినామ్   163,270 కి.మీ2 (63,040 చ. మై.) 558,368 3/km² (7.8/sq mi) పెరమారిబొ
    ఉరుగ్వే   176,220 కి.మీ2 (68,040 చ. మై.) 3,444,006 19.4/km² (50.2/sq mi) మోంటేవీడియో
    వెనుజులా   916,445 కి.మీ2 (353,841 చ. మై.) 31,568,179 30.2/km² (72/sq mi) కారకాస్
Total 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.17,824,513 420,458,044 21.5/km²

ఇవీ చూడండి

మార్చు


వనరులు

మార్చు
  1. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  2. Includes Easter Island in the Pacific Ocean, a Chilean territory frequently reckoned in Oceania. Santiago is the administrative capital of Chile; Valparaíso is the site of legislative meetings.
  3. Claimed by Argentina.
  4. Claimed by Argentina; the South Georgia and the South Sandwich Islands in the South Atlantic Ocean are commonly associated with Antarctica (due to proximity) and have no permanent population, only hosting a periodic contingent of about 100 researchers and visitors.