గయానా (ఆంగ్లం : Guyana) (pronounced /ɡˈɑːnə/ or /ɡˈænə/), [2][3] అధికారికనామం కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా, [4] పాతపేరు బ్రిటిష్ గయానా. దక్షిణ అమెరికా లోని ఉత్తర తీరంలో గల దేశం.కరీబియ దేశాలు, కరీబియన్ సంఘంతో ఉన్న బలమైన రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక సంబంధాల కారణంగా గయానాను కరీబియన్ దేశాలతో కూడా చేర్చారు. దేశం సరిహద్దులలో తూర్పున సురినామ్, దక్షిణం, ఆగ్నేయాన బ్రెజిల్, పశ్చిమాన వెనుజులా, ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి.దేశం విస్తీర్ణం 2,15,000 చ.కి.మీ., జనాభా దాదాపు పదిలక్షలు. రాజధాని జార్జిటౌన్. దక్షిణ అమెరికాలోని అతి చిన్న దేశాలలో గయానా 4వ స్థానంలో ఉంది.మొదటి మూడు స్థానాలలో సురినామె, ఉరుగ్వే, " ఫ్రెంచి గయానా " ఉన్నాయి.

Co-operative Republic of Guyana
Flag of గయానా గయానా యొక్క చిహ్నం
నినాదం
"One people, one nation, one destiny"
జాతీయగీతం

గయానా యొక్క స్థానం
గయానా యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
జార్జిటౌన్
6°46′N 58°10′W / 6.767°N 58.167°W / 6.767; -58.167
అధికార భాషలు ఆంగ్లం, అరవాక్, హిందీ
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు en:Guyanese Creole, పోర్చుగీస్, స్పానిష్ భాష , en:Akawaio, Macushi, Wai-Wai, అరవాక్, భోజ్‌పురి
జాతులు  43.5% East Indian, 30% నల్లవారు, 17% Mixed, 9% అమెరిండియన్
ప్రజానామము గయనీస్
ప్రభుత్వం Semi-presidential republic
 -  President David Granger
 -  Prime Minister Moses Nagamootoo
స్వతంత్రం
 -  from the యునైటెడ్ కింగ్డం 26 మే 1966 
 -  జలాలు (%) 8.4
జనాభా
 -  March12,2009 అంచనా 1,182,2241 (154వది)
 -  2005 జన గణన 769,095 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $3.682 బిలియన్లు[1] 
 -  తలసరి $4,035[1] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $1.130 బిలియన్లు[1] 
 -  తలసరి $1,479[1] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.750 (medium) (97వది)
కరెన్సీ Guyanese dollar (GYD)
కాలాంశం (UTC-4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .gy
కాలింగ్ కోడ్ +592
1 Around one-third of the population (230,000) live in the capital, Georgetown.

గయానాలో అమెజాన్ నది ఉత్తరభూములు ఉన్నాయి. తూర్పున ఒరినొకొ నది (లాండ్ ఆఫ్ మెనీ వాటర్స్) ప్రవహిస్తుంది.పలు స్థానికజాతి ప్రజలకు ఆవాసమైన గయానా 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఆధీనంలోకి రాక ముందు ఇక్కడ డచ్ సెటిల్మెంట్లు ఉన్నాయి.ఇది బ్రిటిష్ గయానాగా పాలించబడింది.1950 వరకూ గయానా ఆర్థికరగంలో తోటల ద్వారా లభించిన ఆదాయం ఆధిక్యత చేసింది.1966లో గయానాకు స్వతంత్రం లభించింది.1970లో అధికారికంగా కామంవెల్త్ దేశాలలోని రిపబ్లిక్ చేయబడింది.బ్రిటిష్ వారసత్వ పరిపాలన ప్రభావం దేశ రాజకీయ, పాలనావిధానం మీద అధికంగా ఉంది.దేశప్రజలలో ఇండియన్లు, ఆఫ్రికన్లు, అమెరిండియన్లు, పలు ఇతర జాతీయులు ఉన్నారు.

దక్షిణ అమెరికా దేశాలలో గయానాలో మాత్రమే ఆగ్లం అధికారభాషగా ఉంది.అత్యధికమైన ప్రజలకు గయానీస్ క్రియోల్ వాడుకభాషగా ఉంది.ఆంగ్లం ఆధారిత క్రియోల్ భాష ప్రథమ భాషగా ఉంది.ఆంగ్లోఫోన్ కరీబియన్ దేశాలలో ఒకటి. వెస్టిండీస్ ద్వీపాలలో లేని ద్వీపంకాని కొన్ని కరీబియన్ దేశాలలో గయానా ఒకటి.గయానా సభ్యదేశంగా ఉన్న కారికోం (చి.ఎ.ఆర్.ఐ.సి.ఒ.ఎం) ప్రధానకార్యాలయం గయానా రాజధాని నగరం జార్జిటౌన్‌లో ఉంది. 2008లో గయానా " యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషంస్ " ఫండింగ్ మెంబర్‌గా ఉంది.

పేరు వెనుక చరిత్ర

మార్చు

గయానా పేరుకు గుయానా మూలపదంగా ఉంది. గయానాలో పూర్వం బ్రిటిష్ గాయానా, సురినమె (డచ్ గయానా), ఫ్రెంచి గయానా, కొలంబియా, వెనుజులా, బ్రెజిల్ దేశాలలో కొంతభూభాగం భాగంగా ఉన్నాయి.ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆధారంగా గయానా అంటే స్థానిక అమెరిండియన్ భాషలో " లాండ్ ఆఫ్ మెనీ వాటర్స్ " అని అర్ధం. I [5]

చరిత్ర

మార్చు
 
A map of Dutch Guiana 1667–1814
 
Map of British Guiana

గయానాలో వై వై ప్రజలు, మకుషి ప్రజలు, పటమొనా ప్రజలు, లొకొనొ, కలినా, వపిషనా, పెమాన్, అకవైయొ, వరయో అనే 9 స్థానిక జాతులకు చెందిన ప్రజలు నివసించారు. [6] చారిత్రకంగా లొకొనొజాతి ప్రజలు గయానాలో ఆధిక్యత సాధించారు.1498లో క్రిస్టోఫర్ కొలంబస్ ఈప్రాంతాన్న తన సాహసయాత్రలో ఈప్రాంతాన్ని సందర్శించినప్పటికీ డచ్ వారు మాత్రమే ఈప్రాంతంలో కాలనీలు స్థాపించారు. ఎస్సెక్యుయిబొ (1616), బెర్బిస్ (1627), డెమెరర (1752) కాలనీలు ఈప్రాంతంలో స్థాపించబడ్డాయి. తరువాత 1796లో గ్రేట్ బ్రిటన్ కింగ్డం స్థాపించబడింది.[7] 1814లో డచ్ ఈప్రాంతాన్ని వదులుకుంది.1831 లో మూడు విడి విడి కాలనీలు సమైక్యమై బ్రిటిష్ గయానాగా రూపొందింది.దిగువజాతి ఇండియన్ సేవకుల గ్రామాలు గయానాగా రూపుమార్చుకున్నాయి. వారు ఒకరితో ఒకరు కలిసిపోయి ప్రస్తుత గయానీ ప్రజలలో సగం సంఖ్యకు చేరుకున్నారు.

 
Georgetown in 1823

1824లో స్వతంత్రం వచ్చిన తరువాత వెనుజులా ఎస్సెక్యుయిబొ నదీ పశ్చిమ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. సైమన్ బొలివర్ ఈప్రాంతంలో సెటిల్మెంటు ఏర్పరుచుకున్న బెర్బిస్, డెమెరర సెటిలర్ల గురించి హెచ్చరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖవ్రాసాడు.1899లో ఇంటర్నేషనల్ ట్రిబ్యూనల్ ఈప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి చెందుతుందని తెలియజేసింది.

1966 మే 26న గయానాకు యునైటెడ్ స్టేట్స్ నుండి స్వతంత్రం లభించింది.1970 ఫిబ్రవరి 23న గయానా రిపబ్లిక్ చేయబడి కామంవెల్త్ దేశాల సభ్యదేశంగా మారింది.ఈసమయంలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంటు, యు.ఎస్. సెంట్రల్ ఇంటెలిజెంస్ ఏజెంసీ బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి గయానా రాజకీయాలను ప్రభావితం చేసాయి. [8] చెడ్డి జపాన్ మార్కిస్టుగా గుర్తించబడిన కారణంగా స్వతంత్రం లభించిన ఆరంభకాలంలో యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం " ఫోర్బ్స్ బర్న్‌హాం "కు మద్దతు ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వంబర్న్‌హాం యొక్క పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పోరాటాలకు సలహాలు అందిస్తూ రహస్యంగా నిధిసహాయం అందించి గయానాలోని ఈస్టిండియన్లు మద్దతిస్తున్న పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీని పడగొట్టడానికి ప్రయత్నించింది.1978లో గయానా 918 మంది అమెరికన్ మతారాధకులు (పీపుల్స్ టెంపుల్) మూకుమ్మడిగా హత్యకు గురైనందుకు ఇంటర్నేషనల్ నోటీసు అందుకున్నది. 2008 మేలో అధ్యక్షుడు " భర్రాట్ జగ్డియొ " యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషంస్ సంబంధిత " యునసర్ కాన్శ్టిట్యూటివ్ ట్రీటీ " మీద సంతకం చేసాడు.గయానా ఒప్పందానికి అంగీకరించింది.

భౌగోళికం

మార్చు
 
Rupununi Savannah

గయానా 1-9 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 56-62 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. దేశం 5 సహజ విభాగాలుగా విభజించబడింది:అట్లాంటిక్ సముద్రతీరం వెంట సన్నని, సారవంతమైన చిత్తడి మైదానాలు (సముద్రతీర దిగువ భూములు) ఉన్నాయి.ఇక్కడ అధికంగా ప్రజలు నివసిస్తుంటారు; తెల్లని ఇసుక బెల్టు చాలా లోతట్టు ప్రాంతం (అత్యధికంగా ఇసుక స్వల్పంగా బంకమట్టి, ఇక్కడ గయానా ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయి;దట్టమైన వర్షారణ్యాలు (ఎగువన ఉన్న అరణ్యప్రాంతం), ఇది దేశం దక్షిణ భూభాగంలో ఉంది;నైరుతిలోని సవన్నాహ్ ఎడారి;చిన్న లోతట్టు దిగువభూములు (లోతట్టు సవన్నాహ్) అధికంగా పర్వతమయంగా ఉండి క్రమంగా బ్రెజిల్ సరిహద్దు వైపుగా ఎత్తూగా మారుతూ ఉంటుంది.

గయానాలో అత్యంత ఎత్తైన ప్రాంతాలలో అయంగన్నా పర్వతం (2042 మీ ఎత్తు), మొంటె కబురై (1465 మీ ఎత్తు), రోరైమా పర్వతం (2772మీ ఎత్తు) ఇది గయానాలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది.ఇది బ్రెజిల్, గయానా, వెనుజులా త్రికేంద్ర (ట్రిపాయింట్) సరిహద్దులో ఉంది.ఇది పకరైమా పర్వతశ్రేణిలో ఉంది. రొరైమా పర్వతం, గయానా టేబుల్ టాప్ ప్రాంతాలు సర్ ఆర్థర్ కొనాన్ డొయ్లె " ది లాస్ట్ వరల్డ్ " నవలకు ప్రేరణ ఇచ్చాయి. గయానాలో అగ్నిపర్వత చరియలు, జలాశయాలు, కైటియర్ జలపాతాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద వాటర్ డ్రాప్‌గా గుర్తించబడుతుంది.[9] రుపునుని నదికి ఉత్తరంలో రూపునుని సవన్నాహ్ దక్షిణంలో కనుకు పర్వతాలు ఉన్నాయి.

గయానాలో నదులలో అతిపెద్ద నదులలో ఎస్సెక్విబొ (1010 కి.మి పొడవు), కౌరంటినె నది (724 కి.మీ పొడవు), బెర్బిక్ నది (595 కిమి.పొడవు), డెమెరర నది (346 కి.మీ పొడవు) ప్రధానమైనవి.కొరెంటైన్ నది గయానా, సురినామె మద్య సరిహద్దును ఏర్పరుస్తుంది. ఎస్సెక్విబొ నదీ ముఖద్వారంలో తీరానికి వాయవ్యభాగంలో145 కి.మీ వెడల్పైన షెల్ బీచ్ వంటి అనేక పెద్ద లంకలు (నదీ ద్వీపాలు) ఉన్నాయి. షెల్ బీచ్ సముద్రతాబేళ్ళు గ్రుడ్లు పెట్టే ప్రధాన ప్రాంతంగాను (ప్రధానంగా లీదర్ బ్యాక్), ఇతర జంతువుల నివాసిత ప్రాంతంగా ఉంది.

గయానా తేమతో కూడిన వేడిగా ఉండే ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. సముద్రతీరం వెంట నైరుతీ ఋతుపవనాల కారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. రెండు వర్షాకాలాలు ఉంటాయి. మొదటి సీజన్ మే అర్ధభాగం నుండి ఆగస్టు వరకు ఉంటుంది. రెండవ సీజన్ నవంబరు అర్ధభాగం నుండి జనవరి వరకు ఉంటుంది.

దక్షిణ అమెరికాలో చెక్కుచెదరని అతిపెద్ద వర్షారణ్యాలలో ఒకటి గయానాలో ఉంది. ఇందులో కొంత ప్రాంతాలు ఇప్పటికే మానవులచేత అభివృద్ధి చేయబడ్డాయి. ఆరంభకాల అన్వేషకులు వాల్టర్ రాలెఘ్, చార్లెస్ వాటటన్, ప్రకృతి పరిశోధకులు డేవిడ్ ఆటెంబొరొహ్, జెరాల్డ్ డురెల్ గయానా సుసంపన్నమైన ప్రకృతి వనరుల గురించి వర్ణించారు. 2008 లో బి.బి.సి. " లాస్ట్ లాండ్ ఆఫ్ ది జగుయార్ " పేరుతో మూడు భాగాలుగా చేసిన ప్రసారాలలో గయానాలోని వైవిధ్యమైన వన్యజీవితం ప్రధానాంశంగా ఉంది. జెయింట్ ఓట్టర్ (ముంగిసజాతికి చెందిన జంతువు), హ్యాపీ ఈగల్ వంటి అరుదైన జంతువులు, ఇప్పటివరకూ కనిపెట్టబడని జంతువులకు గయానా నిలయంగా ఉంది.

2012లో గయానా వర్షారణ్య రక్షణ ప్రయత్నాల కొరకు నార్వే నుండి 45 మిలియన్ల అమెరికన్ డాలర్ల రివార్డ్ అందుకుంది. నేచురల్ హేబిట్ సంరక్షణ, నిర్వహణ కొరకు 2009 లో దేశాల మద్య జరిగిన 250 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఒప్పందంలో గయానా 115 మిలియన్ల అమెరికన్ డాలర్లను అందుకుంది.

ప్రాంతాలు, పొరుగు కౌంసిల్స్

మార్చు

గయానా 10 ప్రాంతాలుగా విభజించబడింది: [10][11]

నంబర్ ప్రాంతం వైశాల్యం కి.మీ 2 జనసంఖ్య (2012 గణాంకాలు) జనసంఖ్య (2012 గణాంకాలు)
per km2
1 బరిమా - వైని 20,339 26,941 1.32
2 పొమెరూన్ - సుపెనాం 6,195 46,810 7.56
3 ఎస్సెక్యుయిబొ ద్వీపాలు - వెస్ట్ డెమెరా 3,755 107,416 28.61
4 డెమెరా- మహైకా 2,232 313,429 140.43
5 మహైకా - బెర్బికా 4,190 49,723 11.87
6 ఈస్ట్ బెర్బిస్ - కొరెంటినె 36,234 109,431 3.02
7 కుయుని - మజరుని 47,213 20,280 0.43
8 పొటరొ - సిపరుని 20,051 10,190 0.51
9 అప్పర్ టకులు - అప్పర్ ఎస్సెక్యుయిబొ 57,750 24,212 0.42
10 అప్పర్ డెమెర - బెర్బిస్ 17,040 39,452 2.32
గయానా 214,999 747,884 3.48

ప్రాంతాలు 27 నైబర్‌హుడ్స్‌గా విభజించబడ్డాయి. [12]

పర్యావరణం, జీవవైవిధ్యం

మార్చు
 
Satellite image of Guyana from 2004
 
Anomaloglossus beebei (Kaieteur), specific to the Guianas
 
The hoatzin is the national bird of Guyana

గయానా భౌగోళికంగా తీర, సముద్ర, సముద్రతీరం, ఎస్టారిన్ పాలస్ట్రైన్, మడ్రోవ్, నదీ, లాక్షస్త్రైన్, చిత్తడి, సవన్నా, తెల్ల ఇసుక అరణ్యం, మట్టిరంగు ఇసుక అరణ్యం, మొంటానె, మేఘారణ్యం, దిగువ చిత్తడి భూమి, పొడి సతతహరిత పొదల అరణ్యంగా వర్గీకరించబడింది." నేషనల్ ప్రొటెక్టెడ్ ఏరియా సిస్టం " 14 పర్యావరణ వైవిధ్యం కలిగిన ప్రాంతాలను గుర్తించింది.

80% కంటే అధికమైన గయానా ప్రాంతం ఇప్పటికీ అరణ్యాలతో కప్పబడి ఉంది. ఈ అరణ్యాలలో అరుదైన లతలు ఉన్నాయి. పొడి సతతహరితారణ్యం, సీజనల్ అరణ్యం, దిగువభూభాగం సతతహరితారణ్యంగా వర్గీకరించబడ్డాయి. అరణ్యం 1000 కంటే అధికమైన జాతులకు చెందిన వృక్షజాలానికి నిలయంగా ఉంది. గయానా ఉష్ణమండల వాతావరణం, సహజ పరిస్థితి విస్తారమైన వర్షారణ్యాలకు, అత్యున్నత స్థానీయ వృక్షజాలానికి అనుకూలంగా ఉన్నాయి. గయానాలో ఉన్న 8 వేల జాతుల మొక్కలలో సగం మరెక్కడా లేవు.

గయానా ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశాలలో ఒకటి. గయానాలో 1,168 సకశేరుకాల జాతులు, 814 జాతుల పక్షులు ఉన్నాయి.గయానా ప్రపంచంలో పలు క్షీరద జాతులు, వృక్షజాతులు ఉన్న సుసంపన్నమైన సాటిలేని ప్రాంతమని సగౌరవంగా చెప్పుకుంటుంది. గయానా లోని ప్రకృతి సంపద 70% సురక్షితంగా ఉంది.

కొంషెన్

మార్చు

2004 ఫిబ్రవరిలో గయానా ప్రభుత్వం కొంషెన్ ఇండిజెనియస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న 1 మిలియన్ హెక్టారుల భూభాగాన్ని " కొంషెన్ కమ్యూనిటీకి స్వంతమైన సంరక్షిత ప్రాంతం "గా ప్రకటించింది. ఇది వై వై ప్రజల నిర్వహణలో ఉంది. ప్రంతంచంలో అతిపెద్ద కమ్యూనిటీకి స్వంతమైన సంరక్షిత ప్రాంతం " ఇది గుర్తించబడుతుంది. [13] ప్రాముఖ్యత సంతరించుకున్న ఈసంఘటన తరువాత వైవై ప్రజలు గయానా ప్రభుత్వం, " కంసర్వేటివ్ ఇంటనేషనల్ గయానాలకు కొంషెన్‌లోని తమ భూముల అభివృద్ధి ప్రణాళికకు సహాయం కావాలని అభ్యర్ధన చేసారు. " మెమొరాండం ఆఫ్ కోపరేషన్ " మీద మూడు పార్టీలు సంతకం చేసారు. ప్రణాళికలో కొంషెన్ బయలాజికల్ వనరుల స్థిరమైన ఉపయోగం, ఈప్రాంతం జీవవైద్యనికి ఎదురౌతున్న బెరింపులను గుర్తించడం, అభివృద్ధి పనులకు సహాయం అందించి జాగరీకత కలిగించడం అలాగే సంరక్షిత స్థితిని కొనసాగించడానికి అవసరమైన ఆదాయం అభివృద్ధి మార్గాలను రూపొందించడం భాగం అయ్యాయి.

అరణ్య ప్రాంతం

మార్చు

గయానా సదరన్ డిస్టిక్ట్ కొంషెన్‌లో ఎస్సెక్యుబి నదీ జలాలు గయానా ప్రధాన నీటివనరుగా ఉంది. సదరన్ గయానా విస్తారమైన సతతహరితారణ్యాలకు నిలయంగా ఉంది. ఇక్కడ అరణ్యాలు చాలా ఎత్తైన చెట్లు, సతతహరితమైన కొండప్రాంతం, దిగువ పర్వతప్రాంత అరణ్యం ఉన్నాయి. ఈ ప్రాంతంలో జనసంఖ్య తక్కువగా ఉంటుంది. స్మిత్సొనియన్ ఇంస్టిట్యూషన్ ఇక్కడ239 కుటుంబాలకు చెందిన 2,700 జాతుల మొక్కలను గుర్తించింది.వీటిలో కొన్ని జాతులు ఇంకా నమోదు చేయబడలేదు.

జంతుజాలం

మార్చు

గయానాలో ఆశ్చర్యకరమైన వైవిధ్యం కలిగిన మొక్కలు పలు వైవిధ్యమైన జంతువులు నివసించడానికి సహకరిస్తున్నాయి. కంసర్వేటివ్ ఇంటర్నేషనల్ సమీపకాలంలో నిర్వహించిన బయోలాజికల్ సర్వే స్వచ్ఛమైన కలుషితరహితమైన ఎస్సెక్యుబొ నది వాటర్షెడ్ జలాలు వైవిధ్యమైన చేపల అభివృద్ధికి, ఇతర జలచరాలకు, జెయింట్ ఒట్టర్స్, కాపిబరాస్, పలు కైమన్ జాతులకు గణనీయంగా సహకరిస్తున్నాయని తెలియజేస్తుంది.

గాయానాలోని కొంషెన్ అరణ్యంలో చిరుత, టాపిర్స్, బుష్ డాగ్, జెయింట్ యాంట్ ఈటర్, సకి మంకీ మొదలైన జతువులు గయానాలో సాధారణంగా కనిపిస్తుంటాయి.400 కంటే అధికమైన పక్షులు ఉన్నాయి.సరీసృపాలు, అంఫిబియన్ ఫ్యూనాస్ అధికంగా ఉన్నాయి. కొంషెన్ అరణ్యాలు అనేక ఇంజెక్ట్స్, లతలు, ఇతర అకశేరుకాలకు నిలయంగా ఉన్నాయి.వీటిలో కొన్ని ఇప్పటికీ గుర్తించి నామకరణం చేయబడలేదు.అత్యున్నత స్థాయి జీవవైద్యం కలిగిన కొంషెన్ అరణ్యాలలో కలుషితరహితమైన, అటవీసంపదను దుర్వినియోగం చేయని, పర్యావరణాన్ని స్థిరంగా ఉంచగలిగిన ఎకోపర్యాటకం అభివృద్ధి చేయబడుతుంది.

ప్రపంచ వారసత్వ ప్రాంతాలు

మార్చు
 
Kaieteur Falls is the world's largest single-drop waterfall by volume

1977లో గయానా " కంవర్షన్ కంసర్నింగ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది వరల్డ్ కల్చర్ అండ్ నేచురల్ హెరిటేజ్ " ఒప్పందం మీద సంతకం చేసింది.కరీబియన్ దేశాలలో ఈ ఒప్పందం మీద సంతకం చేసిన మొదటి దేశంగా గయానా గుర్తించబడుతుంది.1990లో గయానా దేశంలోని ప్రపంచవారసత్వ సంపదగా కైటియర్ నేషనల్ పార్క్, షెల్ బీచ్, హిస్టారిక్ జార్జి టౌన్‌లను నామినేషన్ చేసింది. 1997 " కైటర్ నేషనల్ పార్క్ " పని మొదలైంది 1988లో " హిస్టారిక్ జార్జిటౌన్ " పని ఆరంభం అయింది, అయినప్పటికీ 2015 ఆగస్టు వరకు గయానా ప్రపంచవారసత్వ సంపద నామినేషన్ విజయవంతం కాలేదు.

గయానా " కైటర్ నేషనల్ పార్క్" కైటర్ జపాతంతో చేర్చి ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కోకు సమర్పించింది. ప్రతిపాదన చేయబడిన ప్రాంతం, పరిసర ప్రాంతాలు గయానాలోని అత్యధిక జీవవైవిధ్యం, అత్యధిక అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి. కైటర్ జలపాతం పార్క్‌ ప్రధాన ఆకర్షణగా ఉంది. జలపాతం ఎత్తు 226 మీ. అయినప్పటికీ నామినేషన్ విఫలం అయుంది.గయానా ప్రపంచ వారసత్వ సంపద బిడ్ కొనసాగిస్తూ ఉంది.

ప్రముఖ ప్రాంతాలు

మార్చు
 
St George's Cathedral, Georgetown
  • సెయింట్ జార్జ్ ఆగ్లికన్ కాథడ్రల్: ప్రపంచంలో అత్యంత పొడవైన వుడన్ చర్చిలలో ఒకటి.పొడవైన ఆరాధన మందిరాలలో ఇది ద్వీతీయస్థానంలో ఉంది.మొదటి స్థానంలో టొడై - జి ఆలయం (జపాన్) ఉంది.
  • డెమెరరా హార్బర్ వంతెన: ఫ్లోటిగ్ బ్రిడ్జిలో ఇది ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది.
  • బర్బిస్ వంతెన: ఫ్లోటిగ్ బ్రిడ్జిలో ఇది ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది.
  • కరీబియన్ కమ్యూనిటీ భవనం: శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన కరీబియన్‌లోని అతిపెద్ద యూనియన్.
  • ప్రొవిడెంస్ స్టేడియం: డెమెరరా నది ఉత్తరతీరంలో ప్రొవిడెంస్ ప్రాంతంలో ఉంది. ఇది 2007లో ఐ.సి.సి.వరల్డ్ కప్ సమయంలో నిర్మించబడింది.ఇది దేశంలోని అత్యంత విశాలమైన క్రీడారగం.ఇది ప్రొవిడెంస్ మాల్ సమీపంలో ఉంది.
  • గయానా ఇంటర్నేషనల్ కాంఫరెంస్ సెంటర్: పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గయానా ప్రభుత్వానికి బహుమతిగా నిర్మించి ఇచ్చింది. ఇలాంటి నిర్మాణం దేశంలో ఇది ఒక్కటే ఉంది.
  • స్టాబ్రోక్ మార్కెట్ : అతిపెద్ద పోత ఇనుము నిర్మాణం. ఇది డెమెరరా నది ప్రక్కన శిల్పంగా నిలబడి ఉంది.
  • సిటీ హాల్: అందమైన వుడెన్ నిర్మాణం.ఇది కాలనీ సమయంలో నిర్మించబడింది.
  • టకుటు నది వంతెన: టకుటు నది మీద నిర్మించబడిన వంతెన. ఇది గయానాలోని లెథరెన్ ప్రాంతాన్ని బ్రెజిల్ లోని బొంఫిం ప్రాంతంతో అనుసంధానిస్తుంది.

Takutu River Bridge

  • ఉమన యాన : ఇది ఒక అమెరిండియన్ బెనాబ్. 1972లో జాతీయ స్మారకచిహ్నంగా ఇది నిర్మించబడింది.ఇది అలీనదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కొరకు నిర్మించబడింది. 2016లో ఇది పునర్నిర్మించబడింది.

ఆర్ధిక రంగం

మార్చు
 
A tractor in a rice field on Guyana's coastal plain
 
Graphical depiction of Guyana's product exports in 28 colour-coded categories

గయానా ఆర్థికరంగంలో వ్యవసాయం (నేచురల్ బ్రౌన్ షుగర్) బాక్సైట్ త్రవ్వకాలు, బంగారు త్రవ్వకం, టింబర్, రొయ్యలు, చేపలు, ఖనిజాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. నిపుణత కలిగిన కార్మికులు లోటు, ఇంఫ్రాస్ట్రక్చర్ కొరత ఆర్థికాభివృద్ధికి సమస్యగా మారింది. 2007లో సంభవించిన గ్లోబల్ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ 2008 ఆర్థికరంగం 3% అభివృద్ధి చెందింది. 2011 కు 5.4% అభివృద్ధి చెందింది. 2012 లో 3.7% అభివృద్ధి చెందింది.

అతితక్కువ ధరలు ప్రధాన మైనింగ్, వ్యవసాయం కమ్మోడిటీస్‌లకు (బాక్సిట్, చక్కెర పరిశ్రమలకు) సమస్యాత్మకంగా మారాయి. గయానా ఆర్థికరంగం కోలుకుని 1999 నుండి మోడరేట్ అభివృద్ధి చెందుతూ ఉంది. వ్యవసాయరంగం, మైనింగ్ పరిశ్రమ విస్తరించబడ్డాయి. వ్యాపారం ప్రారంభించేవారికి చాలా అనుకూల వాతావరణం ఏర్పడింది.ద్రవ్యోల్భణం తరుగుదల జరిగింది.అంతర్జాతీయ సేవాసంస్థల సహాయం కొనసాగింది.

గై సుకొ యాజమాన్యంలో చక్కెర పరిశ్రమ 28% అభివృద్ధి చెందింది. అది ఇతర పరిశ్రలకంటే అధిక సంఖ్యలో ఉపాధి కల్పించింది. పలు కంపెనీలకు విదేశీపెట్టుబడులు లభించాయి. ఉదాహరణగా మినరల్ కంపెనీలకు అమెరికన్ కంపెనీ " రెనాల్డ్స్ మెటల్స్ ", ది బ్రిటిష్ - ఆస్ట్రేలియన్ రియో- టింటొ సహకారం అందించాయి. లాగింగ్ పరిశ్రలో ది కొరియన్/మలేషియన్ బర్మా కంపెనీ లకు అధికమైన షేర్లు ఉన్నాయి.

గయానాలో బలాటా తయారీ పెద్ద వ్యాపారంగా ఉంది. రుపునుని లోని కనుకు పర్వతపాద (ఫూట్ హిల్స్) ప్రాంతంలో బలాటా విస్తారంగా లభిస్తుంది.వాయవ్య డిస్టిక్ట్‌లో ఇది అత్యధికగా సేకరించబడింది. అయినప్పటికీ చట్టబద్ధంగా తీసే విధానాలు చెట్లు పడిపోవడానికి దారి తీస్తుంది.బలాటాను క్రికెట్ బాలు తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది.దంతవైద్యంలో ఫిల్లింగ్ కొరకు దీనిని ఉపయోగిస్తుంటారు.కనుకు పర్వతప్రాంతంలో నివసిస్తున్న మకుషి ప్రజలు దీనిని అలకరణ వస్తువుల తయారీకి, ఫిగర్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు.[14]

2007లో గయానా ప్రభుత్వం టాక్స్ కోడ్ రూపొందించింది. వాల్యూ ఏడెడ్ టాక్స్ (వి.ఎ.టి) అమలులోకి తీసుకొనిరాబడింది. గతంలో ఉన్న 6 వైవిధ్యమైన టాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టబడింది. సేల్స్ టాక్స్ ఎగవేతకు ఇది సులువైన మార్గంగా మారింది. పలు వ్యాపారాలు టాక్స్ కోడ్‌ను అతిక్రమించాయి. దీనికి పేపర్ వర్క్ అధికం అయిన కారణంగా వ్యాట్‌ను వ్యాపారులు వ్యతిరేకించారు. ప్రభుత్వ ఆడిటర్లకు నిధులదుర్వినియోగం గుర్తించడం సులువుగా మారింది.గత పాలనలో వ్యాట్ ఇది ప్రాబల్యత సంతరించుకుంది. వ్యాట్ సవరణ కష్టమైనది.

అధ్యక్షుడు భర్రాత్ జగ్డియొ తనపాలనలో ౠణబిముక్తి సాధించడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్", వరల్డ్ బ్యాంక్, ఇంటర్ అమెరికన్ డెవెలెప్మెంట్ బ్యాంక్‌కు $800 యు.ఎస్.డి చీల్లించడంలో విజయం సాధించాడు. మరొక 2 మిలియన్ యు.ఎస్.డి ఇతర పారిశ్రామిక దేశాలకు చెల్లించాడు.

సమ్మరీ

మార్చు
 
Thatched roof houses in Guyana
జి.డి.పి. (2007 అంచనాలు)
$3.08 బిలియన్ యు.ఎస్.డి.(తలసరి జి.డి.పి. 4,029 యు.ఎస్.డి)
రియల్ గ్రోత్ రేట్
3.6%
ద్రవ్యోల్భణం
12.3%
నిరుద్యోగం
11.0% (2007)[15]
వ్యవసాయ క్షేత్రాలు
2%
శ్రామిక శక్తి
418,000 (2001 అంచనాలు )
వ్యవసాయ ఉత్పత్తులు
చక్కెర, బియ్యం, కూరగాయలు, ఆయిల్, గొడ్డు మాసం, పంది మాంసం, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులు, చేపలు రొయ్యలు.
పారిశ్రామిక ఉత్పత్తులు
బాక్సైట్, చక్కెర, బియ్యం,టింబర్, వస్త్రాలు, బంగారం.
సహజ వనరులు
బాక్సిట్, బంగారం, వజ్రాలు, హార్డ్ వుడ్ తింబర్, రొయ్యలు, చేపలు,
ఎగుమతులు
$621.6 మిలియన్ యు.ఎస్.డి. (2006 అంచనాలు)
చక్కెర, బంగారం, బాక్సిట్/అల్యూమినియం, బియ్యం,రొయ్యలు, రం, టింబర్, సర్క్యూట్స్, పండ్లు.
దిగుమతులు
$706.9 యు.ఎస్.డి. (2006 అంచనాలు)
మాన్యుఫాక్చర్ ఐటంస్, మెషినరీ, పెట్రోలియం, ఆహారం.
ప్రధాన వ్యాపార భాగస్వాములు
కెనడా, యు.కె., పోర్చుగల్, జమైకా, ట్రినిడాడ్, టొబాగొ, చైనా, క్యూబా, సింగపూర్, జపాన్,బ్రెజిల్, సురినామె (2009)

గణాంకాలు

మార్చు
 
Guyana's population density in 2005 (people per km2)
 
A graph showing the population of Guyana from 1961 to 2003. The population decline in the 1980s can be clearly seen.

గయానా ప్రజలలో 90% మంది (0.74 మిలియన్) సముద్రతీరంలోని సన్నని ఇరుకైన స్ట్రిప్‌లో నివసిస్తున్నారు. 16 నుండి 64 కిలోమీటర్లు (10 నుండి 40 మై.) దేశ మొత్తం భూభాగంలో 10% ఉన్న ఈప్రాంతం వెడల్పు 10 మై-40మై. [16]ప్రస్తుత గయానాలో ఇండియా, ఆఫ్రికా, యూరప్, చైనా దేశాల ప్రజలు అలాగే స్థానిక ఆదిమజాతి ప్రజలు నివసిస్తున్నారు.వీరికి ఆంగ్లం, క్రియోల్ భాషలు వాడుకభాషలుగా ఉన్నాయి. 2002 గణాంకాల ఆధారంగా వీరిలో సంఖ్యాపరంగా ఇండో- గయానీస్ (వీరిని ఇండో కరీబియన్లు, ఈస్టిండియన్లు అని కూడా అంటారు) మొదటి స్థానంలో ఉన్నారు. జనసంఖ్యలో వీరు 45.5% ఉన్నారు. వీరి పూర్వీకులు సేవకులుగా ఇక్కడకు తీసుకురాబడ్డారని భావిస్తున్నారు. తరువాతి స్థానంలో ఆఫ్రో - గయానీస్ ఉన్నారు.వీరు బానిసల సంతతికి చెందినవారుగా భావిస్తున్నారు. మొత్తం జనసంఖ్యలో వీరి సంఖ్య 30.2%. మిశ్రిత జాతి గయానీస్ 16.7%, స్థానికజాతి ప్రజలు 9.1% ఉన్నారు. స్థానికజాతి ప్రజలలో అరవాక్ ప్రజలు, వైవై ప్రజలు, కరీబియన్లు, అకవైయొ ప్రజలు, అరక్యునా ప్రజలు, పటమొనా, వాపిక్సానా, మాకష్, వారావు ప్రజలు ఉన్నారు.[15] అతిపెద్ద సమూహాలైన ఇండో- గయానీస్, ఆఫ్రో- గయానీస్ మద్యన వర్గసంఘర్షణలు ఉన్నాయి.[17][18][19]అత్యధికసంఖ్యలో ఉన్న ఇండో - గయానీస్ ఒప్పంద సేవకులుగా ఇక్కడకు తీసుకురాబడ్డారు. వీరిలో అధికంగా ఉత్తరభారతదేశంలోని భోజ్పురికి చెందిన ప్రజలు ఉన్నారు. వీరికి భోజ్పురి భాష వాడుకభాషగా ఉంది. [20] వీరిలో అల్పసంఖ్యాకంగా దక్షిణ భారతదేశానికి చెందిన తమిళ సంతతికి చెందిన ప్రజలు, తెలుగు సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.[21]

1980, 1991 గణాంకాలు 2002 గణాంకాలలో బేధం తక్కువగా ఉన్నప్పటికీ ప్రధాన సమూహాలు రెండింటి శాతం స్వల్పంగా క్షీణించింది. 1980లో ఇండో- గయానీస్ 51.9% ఉంది, 1991లో ఇది 48.6%కు తగ్గింది, 2002 నాటికి 43.5% ఉంది. ఆఫ్రో-గయానీస్ శాతం 1980లో 30.8%, 1991లో 32.3%,2002లో 30.2% ఉంది. మొత్తం జనసంఖ్యలో స్వల్పంగా అభివృద్ధి చెందింది. ఆధిక్యతలో ఉన్న రెండు సమూహాల శాతంలో జరిగిన క్షీణత స్థానికజాతి ప్రజల శాతం అభివృద్ధికి దారితీసింది. బహుళ సంప్రదాయాలకు చెందిన ప్రజలలో అమెరిండియన్లు 22,097 (1991-2002), ఈమద్యకాలంలో వీరు మొత్తం 47.3% అభివృద్ధి (వార్షికంగా 3.5%) చెందారు. అలాగే బహుళ సంప్రదాయాలకు చెందిన ప్రజలసంఖ్య 37,788 ఉంది. మొత్తం 43% అభివృద్ధి (వార్షికంగా 3.2%) చెందింది.పోర్చుగీసు - గయానీస్ (1891లో 4.3%), వార్షికంగా 3.2% అభివృద్ధి చెందారు. దశాబ్ధాల కాలంలో వీరి సంఖ్య క్రమంగా క్షీణించింది.[22]

పెద్ద నగరాలు

మార్చు
గయానాలో పెద్ద నగరాలు [23]
ర్యాంక్ పేరు ప్రాంతాలు జనసంఖ్య
1 జార్జి టౌన్ డెమెరరా - మిచికన్ 235,017
2 లిండెన్ అప్పర్ డెమెరరా - బెర్బిస్ 44,690
3 న్యూ అంస్టర్ డాం, గయానా ఈస్ట్ బెర్బిస్ - కొరెంటినె 35,039
4 అన్నా రెఫినా పొమెరూన్ 12,448
5 బార్టికా కుయుని - మజరుని 11,157
6 స్కెల్డన్, గయానా ఈస్ట్ బెర్బిస్- కొరెంటినె 5,859
7 రొసింగొల్ మహైకా- బెర్బిస్ 5,782
8 మహైక (గ్రామం) డెమెరరా - మహైక 4,867
9 పరిక ఎస్సెక్యుయిబొ ద్వీపాలు - వెస్ట్ డెమెరరా 4,081
10 వ్రీడ్ ఎన్ హూప్ డెమెరరా - మహైక 3,073

భాషలు

మార్చు

గయానా అధికారభాషగా ఆగ్లం ఉంది. ఇది విద్య, ప్రభుత్వ కార్యకలాపాలు, మాధ్యమం, సేవారంగాలలో ఉపయోగించబడుతుంది. అత్యధిక ప్రజలు గయానీస్, క్రియోల్ అధికంగా వాడుకలో ఉన్నాయి. ఆంగ్ల ఆధారిత క్రియోల్ ఆఫ్రికన్, ఈస్టిండియన్ ప్రభావంతో స్థానిక భాషగా వాడుకలో ఉంది. [24] అదనంగా కరీబియన్ భాషలు (అకవైయొ, వైవై, మకుషి) భాషలు అల్పసంఖ్యాక ప్రజలకు వాడుకభాషలుగా ఉన్నాయి. ఇండో - ఆర్యన్ భాషలు సాంస్కృతిక, మతసంబంధిత కార్యక్రమాలకు ఉపయోగించబడుతున్నాయి.

గయానాలో మతం, 2002[25]
మతం శాతం
క్రైస్తవులు
  
57.4%
హిందూయిజం
  
28.4%
ముస్లిం
  
7.2%
ఇతర మతాలు
  
1.9%
ఏమతానికి చెందనివారు
  
2.3%

2002లో దేశం అంతటా నిర్వహించబడిన గణాంకాల ఆధారంగా 57.4% క్రైస్తవులు, 28.4% హిందువులు, 7.2% ముస్లిములు, 1.9% ఇతర మతాలకు చెందిన వారు, ఏమతం వెల్లడించని ప్రజలు 2.3% ఉన్నారు.[25] క్రైస్తవులలో ప్రొటెస్టెంట్లు 34.8%, ఇతర క్రైస్తవులు 20.8%, రోమన్ కాథలిక్కులు 7.1%, ఉన్నారు. హిందువులలో వైష్ణవులు అధికంగా ఉన్నారు. ముస్లిములలో సున్ని ముస్లిములు అధికంగా ఉన్నారు. షియా, అహమ్మదీయులు స్వల్పసంఖ్యలో ఉన్నారు. ఇతర మతస్థులలో రాస్టఫారి ఉద్యమం, బుద్ధిజం, బహై మతస్థులు ఉన్నారు.

సంస్కృతి

మార్చు
Holidays
1 జనవరి న్యూ ఇయర్ డే
వసంతకాలం యుమన్ నబి
23 ఫిబ్రవరి రిపబ్లిక్ డే (మాష్రమని)
మార్చి ఫగ్వాహ్
మార్చి /ఏప్రిల్ గుడ్ ఫ్రై
మార్చి/ఏప్రిల్ ఈస్టర్ సన్ డే
5 మే ఇండియన్ అరైవల్ డే
26 మే స్వతంత్ర దినం
జూలై ఫస్ట్ మండే కరికోం డే
1 ఆగస్టు ఎమాంసిపేషన్ డే
అక్టోబరు/నవంబరు దీపావళి
25 డిసెంబరు క్రిస్మస్
26/27 డిసెంబరు బాక్సింగ్ డే

గయానా సంస్కృతి ఇంగ్లీష్ - మాట్లాడే కరీబియన్ సంస్కృతిని పోలి ఉంటుంది. 19వ శతాబ్దంలో ఈప్రాంతం బ్రిటిష్ పాలనలోకి మారిన తరువాత చారిత్రకంగా ఇంగ్లీష్ - మాట్లాడే కరీబియన్‌తో ముడిపడింది. కరికోం (కరీబియన్ కమ్యూనిటీ) స్థాపన సభ్యదేశాలలో గయానా ఒకటి. గయానాలో కరికోం ఎకనమిక్ బ్లాక్, బ్లాక్ ప్రధానకార్యాలయాలకు (కరికోం సెక్రటరేట్) ఉన్నాయి.

గయానా భౌగోళిక స్థితి, జనసాధ్తత తక్కువగా ఉండే వర్షారణ్యాలు, గణనీయమైన అమెరిండియన్ ప్రజలు గయానాను ఇంగ్లీష్ మాట్లాడే కరీబియన్ దేశాల నుండి వేరుచేస్తుంది. గయానా ఇండో - గయానాస్ సంస్కృతి (ఈస్టిండియన్ ), ఆఫ్రో- గయానీస్ (ఆఫ్రికన్) సంస్కృతుల మిశ్రమంగా ఉంటుంది. ఇది ట్రినిడాడ్ సంస్కృతిని పోలి ఉంటుంది. ఇది గయానాను ఇతర అమెరికన్ భాగాలతో వేరుచేస్తూ ఉంది. గయానా ఆహారం, పండుగలు, సంగీతం, క్రీడలు వంటి ఆసక్తికరమైన విషయాలను వెస్ట్ ఇండీస్‌తో పంచుకుంటుంది.

గయానా " వెస్టిండీస్ క్రికెట్ టీం "తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ క్రీడలలో పాల్గొంటుంది. గయానాస్ క్రికెట్ టీం ఇతర దేశాలతో ఇతర కరీబియన్ దేశాలకు వ్యతిరేకంగా " ఫస్ట్ - క్లాస్- క్రికెట్ " క్రీడలో పాల్గొంటున్నది. 2007 మార్చి, ఏప్రిల్ మాసాలలో " క్రికెట్ వరల్డ్ కప్‌కు " కో- హోస్ట్ (ఇతర కరీబియన్ దేశాలతో కలిసి) చేసింది. కరికోం సభ్యత్వంతో గయానా కాంకకాఫ్ సభ్యత్వం, ది ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఉత్తర, మద్య అమెరికా, కరీబియా కొరకు) సభ్యత్వం కలిగి ఉంది.

మాష్రమని (మాష్), ఫగ్వా, హోలి, దీపావళి పండుగలను జరుపుకుంటుంది.

క్రీడలు

మార్చు
 
Providence Stadium as seen from the East Bank Highway

గయానాలో ప్రధానక్రీడలలో క్రికెట్ .[26]), బాస్కెట్ బాల్, వాలీ బాల్ ప్రధానమైనవి.[27] మైనర్ క్రీడలలో సాఫ్ట్ బాల్ క్రికెట్ (బీచ్ క్రికెట్), ఫీల్డ్ హాకీ, నెట్ బాల్, రౌండర్స్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, స్క్వాష్, రగ్బీ, గుర్రపు పందాలు, ఇతర క్రీడలు ప్రధానమైనవి. గయాన వరల్డ్ కప్ ఆతిథ్యం ఇవ్వడానికి 15,000 మంది వీక్షించే క్రీడారంగాన్ని నిర్ణీతసమయంలో నిర్మించింది. [28] ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ కొరకు కాంకకాఫ్‌లో భాగస్వామ్యం వహించింది. గయానా హార్స్ రేసింగ్ కొరకు ఫైవ్ కోర్సెస్ ఉన్నాయి[29]

క్రీడాకారులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Guyana". International Monetary Fund. Retrieved 2009-04-22.
  2. Wells, John C. (1990). Longman pronunciation dictionary. Harlow, England: Longman. ISBN 0582053838. entry "Guyana"
  3. "Guyana – Dictionary definition and pronunciation – Yahoo! Education". Education.yahoo.com. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 30 March 2014.
  4. "Independent States in the World". state.gov.
  5. "Guyana". Oxford Dictionaries. Archived from the original on 7 జూలై 2015. Retrieved 9 May 2015.
  6. "Ministry of Amerindian Affairs – Georgetown, Guyana". Amerindian.gov.gy. Archived from the original on 2 జూన్ 2013. Retrieved 30 March 2014.
  7. "South America 1744–1817 by Sanderson Beck".
  8. US Declassified Documents (1964–1968). guyana.org Archived 12 ఫిబ్రవరి 2007 at the Wayback Machine
  9. Rowe, Mark (14 November 2004). "South America: Do the continental: The best of what's new; spectacular waterfalls, forgotten cities, pre-Inca trails". The Independent. p. Features, page 3.
  10. Bureau of Statistics – Guyana Archived 2012-02-17 at the Wayback Machine, CHAPTER III: POPULATION REDISTRIBUTION AND INTERNAL MIGRATION, Table 3.4: Population Density, Guyana: 1980–2002
  11. Guyana – Government Information Agency, National Profile. gina.gov.gy Archived 14 ఆగస్టు 2007 at the Wayback Machine
  12. "Government of Guyana, Statistics" (PDF). Archived from the original (PDF) on 17 మే 2017. Retrieved 2 May 2010.
  13. "Biodiversity in the Konashen Community-Owned Conservation Area, Guyana" (PDF). Archived from the original (PDF) on 6 డిసెంబరు 2010. Retrieved 7 జూలై 2017.
  14. RedSpider, Romona Khan. "Private Sector Commission". Psc.org.gy. Archived from the original on 28 జూన్ 2010. Retrieved 2 May 2010.
  15. 15.0 15.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; cia అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  16. "Guyana General Information". Geographia.com. Retrieved 2 May 2010.
  17. "Guyana turns attention to racism". BBC News. 20 September 2005.
  18. "Conflict between Guyanese-Indians and Blacks in Trinidad and Guyana Socially, Economically and Politically". Gabrielle Hookumchand, Professor Moses Seenarine. 18 May 2000.
  19. International Business Times: "Guyana: A Study in Polarized Racial Politics" Archived 15 జూలై 2012 at the Wayback Machine 12 December 2011
  20. Helen Myers (1999). Music of Hindu Trinidad. ISBN 9780226554532.
  21. Indian Diaspora (PDF). Archived from the original (PDF) on 2011-04-30. Retrieved 2017-07-15.
  22. "Portuguese emigration from Madeira to British Guiana"
  23. "Biggest Cities Guyana".
  24. Damoiseau, Robert (2003) Eléments de grammaire comparée français-créole guyanais Ibis rouge, Guyana, ISBN 2-84450-192-3
  25. 25.0 25.1 "Final 2002 Census Compendium 2" (PDF). Archived from the original (PDF) on 2017-01-01. Retrieved 2017-07-15.
  26. "Composition and countries". W.I Cricket team. West Indies Cricket Board. Retrieved 27 November 2013.
  27. "SPORTS, LITERATURE". Guyana News and Information. Retrieved 30 November 2015.
  28. "Providence stadium – Records and statistics". Cricket World 4U. Archived from the original on 2 డిసెంబరు 2013. Retrieved 27 November 2013.
  29. Service, K News (11 July 2013). "Guyana Horse Racing Authority continues its drive to regularize the sport". Kaiteur News. Retrieved 27 November 2013.


బయటి లింకులు

మార్చు
ప్రభుత్వం
"https://te.wikipedia.org/w/index.php?title=గయానా&oldid=4307292" నుండి వెలికితీశారు