ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్

(ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ నుండి దారిమార్పు చెందింది)

ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ 2021లో తెలుగులో విడుదలైన వెబ్​సిరీస్. ప్రియదర్శి, నందినీ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్​సిరీస్ ను సురేష్ కృష్ణ నిర్మించగా విద్యాసాగర్‌ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహించాడు.[1] ఈ వెబ్​సిరీస్ 18 జూన్ 2021న ఆహా ఓటీటీలో విడుదలైంది.

ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం విద్యాసాగర్‌ ముత్తుకుమార్‌
నిర్మాణం సురేష్ కృష్ణ
కథ ఆదిత్యా ముత్తుకుమార్‌
తారాగణం ప్రియదర్శి, నందినీ రాయ్‌
సంగీతం దీపక్ అలెగ్జాండర్
సంభాషణలు ప్రదీప్‌ ఆచార్య
ఛాయాగ్రహణం వరుణ్ డికె
కూర్పు నిఖిల్ శ్రీకుమార్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

రాజమండ్రిలో ట్రావెల్స్‌ డ్రైవర్‌గా పనిచేసే ఆది (ప్రియదర్శి)కి ఓ రిసార్ట్‌ కొనుక్కోవాలని ఆశతో ఉంటాడు. అదే ఊరిలో ఉండే అయ్యప్ప (పోసాని), మీనా (నందినీ రాయ్) భార్యభర్తలు. మీనా థామస్ (వికాస్) అనే కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె ఒక రోజు తన భర్త అయ్యప్పకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. వీరిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో అయ్యప్ప తన భార్య చేతిలోనే హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసులో ఆది ఇరుకుంటాడు. హైదరాబాద్ లో దందాలు చేసే ఫకీర్ భాయ్ (ఉమామహేశ్వరరావు) ఓ వ్యక్తిగత సమస్యలో చిక్కుకుని తన దగ్గర ఉన్న హవాలా డబ్బు 5 కోట్ల రూపాయలను అయ్యప్ప తమ్ముడు విష్ణు (చంద్రకాంత్ దత్)కు ఇచ్చి రాజమండ్రి పంపుతాడు. అయ్యప్ప హత్య తరువాత ఐదు కోట్లు ఎక్కడ ఉన్నాయి ?? అది ఈ హత్య కేసు నుండి ఎలా బయట పడ్డాడు ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • నిర్మాత: సురేష్ కృష్ణ
 • మాటలు: ప్రదీప్‌ ఆచార్య
 • కాన్సెప్ట్‌: ఆదిత్యా ముత్తుకుమార్‌
 • రచన & దర్శకత్వం: విద్యాసాగర్‌ ముత్తుకుమార్‌
 • సినిమాటోగ్రఫీ : వరుణ్ డికె
 • సంగీతం : దీపక్ అలెగ్జాండర్
 • ఎడిటింగ్ : నిఖిల్ శ్రీకుమార్

మూలాలు మార్చు

 1. The Hindu (29 May 2021). "Priyadarshi headlines Telugu crime series 'In the Name of God (ING)'". The Hindu (in Indian English). Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
 2. The New Indian Express (18 June 2021). "In the Name of God Series Review: Irrepairable ending undoes a promising start". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
 3. Sakshi (21 June 2021). "రివ్యూ: ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌... వెబ్‌ సిరీస్‌ ఇలాగా?". Sakshi. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
 4. Telangana Today (18 June 2021). "Nandini Rai reveals why co-star Vikas slapped her hard". Telangana Today. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.