హెన్రిక్ ఇబ్సన్

నార్వే దేశానికి చెందిన నాటక రచయిత, దర్శకుడు. (1828–1906)
(ఇబ్సన్ నుండి దారిమార్పు చెందింది)

హెన్రిక్ ఇబ్సన్[1] (మార్చి 20, 1828 - మే 23, 1906) నార్వే దేశానికి చెందిన నాటక రచయిత, దర్శకుడు.[2] ఆధునిక నాటకరంగ స్థాపకుల్లో ఒకడైన ఇబ్సెన్‌ను "వాస్తవికతవాద నాటకరంగ పితామహుడు" అని పిలుస్తారు. ఆధునిక నాటకరంగంలో అత్యంత ప్రభావవంతమైన నాటక రచయితలలో ఒకడిగా నిలిచాడు.[3] ప్రపంచంలో షేక్స్పియర్ తరువాత ఎక్కువగా ఇబ్సన్ నాటకాలే ప్రదర్శించబడ్డాయి.[4][5] 2006లో ఎ డాల్స్ హౌస్ నాటకం ప్రపంచంలోనే అత్యధికంగా ప్రదర్శించబడింది.[6]

హెన్రిక్ ఇబ్సన్
పుట్టిన తేదీ, స్థలంహెన్రిక్ జోహన్ ఇబ్సన్
(1828-03-20)1828 మార్చి 20
స్కెయిన్, టెలిమార్క్, నార్వే
మరణం1906 మే 23(1906-05-23) (వయసు 78)
ఓస్లో, నార్వే
వృత్తిరచయిత, నాటక రచయిత
రచనా రంగంsనాచురలిజం
గుర్తింపునిచ్చిన రచనలుపీర్ జింట్ (1867)
ఎ డాల్స్ హౌస్ (1879)
గోస్ట్స్ (1881)
ఎన్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్ (1882)
ది వైల్డ్ డక్ (1884)
హెడ్డా గాబ్లర్ (1890)
జీవిత భాగస్వామిసుజన్నా తోరేసన్ (మ. 1858)
సంతానంసిగుర్డ్ ఇబ్సెన్
బంధువులునాడ్ ఇబ్సెన్ (తండ్రి)
మారిచెన్ ఆల్టెన్బర్గ్ (తల్లి)

సంతకం

జీవిత విశేషాలు

మార్చు

ఇబ్సన్ 1828, మార్చి 20న నాడ్ ఇబ్సెన్, మారిచెన్ ఆల్టెన్బర్గ్ దంపతులకు నార్వే, టెలిమార్క్ ఆగ్నేయ ఓడరేవు పట్టణం స్కెయిన్ లో జన్మించాడు. మొదట్లో ఉన్నత కుటుంబంకావడంతో సుఖవంతమైన జీవితాన్నే అనుభవించినా, తండ్రి వ్యాపారంలో నష్టంరావడంతో ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చేసరికి పేదరికాన్ని అనుభవించాల్సివచ్చింది. పదిహేనేళ్ళ వయసులో ఇంటినుంచి వెళ్లిపోయిన ఇబ్సన్ ఒక కెమిస్ట్ వద్ద పనిలో చేరాడు. మెడిసిన్ చదవాలనుకున్నా బ్రేక్ లాటిన్, గణితాల్లో ఫెయిల్ కావటంతో జర్నలిజం పూర్తిచేశాడు. ఆ సమయంలో కవితలు, నాటకాలు రాయడంతో 1851లో నార్వే థియేటర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది.[7]

 
ఇబ్సన్ (1901)

రచనా ప్రస్థానం

మార్చు

జెనా విశ్వవిద్యాలయం ఆచార్యుడు హెర్మాన్ హిట్టర్ చెప్పిన రచయితల అర్హతలను ఇబ్సన్ ఆపాదించుకున్నాడు. హిట్లర్ రాసిన దాస్ మోడర్న్ డ్రామా అనే గ్రంథం వాస్తవికవాద నాటకాలు రాయడానికి ఇబ్సన్ కు ప్రేరణనిచ్చింది. నూతన ప్రయోగం, ఆశావాదం, సత్యాన్వేషణ, వాస్తవిక చిత్రణ, సమకాలీన సమస్యలకు ప్రతిబింబాలుగా ఇబ్సన్ నాటకాలు ఉంటాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో పర్యటించడం వల్ల అక్కడి అనుభవాలు కూడా నాటక రచనా వైవిధ్యానికి తోడ్పడ్డాయి.

నాటకరంగం

మార్చు

ఇబ్సన్ 22ఏళ్ళ వయస్సులో ఒక పురాతన రోమన్ తిరుగుబాటుదారుడిని కథతో కాటిరినా అనే నాటకాన్ని రాశాడు. ఆ నాటకం ప్రచురించబడింది కానీ ప్రదర్శన కాలేదు. 1850లో రాసిన ది బరయల్ మౌండ్ నాటకం ప్రదర్శన జరిగింది. ఇబ్సన్ రాసిన నాటకల్లో ప్రదర్శన జరిగిన తొలినాటకం ఇదే. ఇబ్సెన్ యూరోపియన్ సంప్రదాయంలో అత్యంత పేరొందిన నాటక రచయితలలో ఒకడిగా గుర్తించబడ్డాడు.[8] షేక్స్పియర్ తరువాత ఇబ్సన్ ఉత్తమ కవితాత్మక రచయిత అని రిచర్డ్ హార్న్బీ అభివర్ణించాడు.[9] ఇతను పంతొమ్మిదవ శతాబ్దపు ఉత్తమ నాటక రచయితగా విస్తృతంగా గుర్తింపబడ్డాడు.[8][10] ఇతను జార్జ్ బెర్నార్డ్ షా, ఆస్కార్ వైల్డ్, ఆర్థర్ మిల్లెర్, జేమ్స్ జాయిస్, యూజీన్ ఓ'నీల్, మిరోస్లావ్ క్రెలేనా వంటి ఇతర నాటక రచయితలను, నవలా రచయితలను ప్రభావితం చేశాడు. ఇబ్సెన్ 1902, 1903, 1904లో సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు. ఇబ్సెన్ తన నాటకాలను డానిష్ భాష (డెన్మార్క్, నార్వే దేశాల సాధారణ లిఖిత భాష)లో రాయగా, వాటిని డానిష్ ప్రచురణకర్త గిల్డెండల్ ప్రచురించాడు. పెట్రిషియన్ వ్యాపారి కుటుంబంలో జన్మించిన ఇబ్సెన్ తన కుటుంబ నేపథ్యం ప్రకారం తన నాటకాలను, తన కుటుంబ సభ్యుల వంటి పాత్రలను రూపొందించాడు.

రాసినవి

మార్చు
  1. కాటిరినా (1950)
  2. ది బరయల్ మౌండ్ (1950)
  3. లవ్స్ (1862)
  4. బ్రాండ్ (1866)
  5. పీర్ జింట్ (1867)
  6. పిల్లర్స్ ఇఫ్ ది సోసైటీ (1877)
  7. ఎ డాల్స్ హౌస్ (1879)
  8. ఘోస్ట్స్ (1881)
  9. ఎన్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్ (1882)
  10. ది వైల్డ్ డక్ (1884)
  11. హెడ్డా గాబ్లర్ (1890)
  12. ది మాస్టర్ బిల్డర్
  13. వెన్ ఉయ్ డెడ్ ఎవేకెన్ (1899)
  14. వైల్డ్ డక్
  15. ది లేడీ ఫ్రం ది సీ

ఇబ్సన్ 1906, మే 23న నార్వే లోని ఓస్లో లో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "Ibsen". Random House Webster's Unabridged Dictionary.
  2. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  3. On Ibsen's role as "father of modern drama", see "Ibsen Celebration to Spotlight 'Father of Modern Drama'". Bowdoin College. 23 జనవరి 2007. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 27 మార్చి 2020.; on Ibsen's relationship to modernism, see Moi (2006, 1–36)
  4. "shakespearetheatre.org" (PDF). Archived from the original (PDF) on 2019-02-14. Retrieved 2020-03-27.
  5. "Henrik Ibsen – book launch to commemorate the "Father of Modern Drama"". Archived from the original on 2016-09-19. Retrieved 2020-03-27.
  6. Bonnie G. Smith, "A Doll's House", in The Oxford Encyclopedia of Women in World History, Vol. 2, p. 81, Oxford University Press
  7. హెన్రిక్ ఇబ్సన్, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.226.
  8. 8.0 8.1 Valency, Maurice. The Flower and the Castle. Schocken, 1963.
  9. Richard Hornby, "Ibsen Triumphant", The Hudson Review, Vol. 56, No. 4 (Winter, 2004), pp. 685–691
  10. Byatt, AS (15 December 2006). "The age of becoming". The Guardian. London.

ఇతర లంకెలు

మార్చు