ఇయాన్ కోల్‌కౌన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

ఇయాన్ అలెగ్జాండర్ కోల్‌కౌన్ (1924, జూన్ 8 - 2005, ఫిబ్రవరి 26) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1950లలో న్యూజీలాండ్ జట్టు తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

ఇయాన్ కోల్‌కౌన్
దస్త్రం:Ian Colquhoun.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఇయాన్ అలెగ్జాండర్ కోల్‌కౌన్
పుట్టిన తేదీ(1924-07-08)1924 జూలై 8
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2005 ఫిబ్రవరి 25(2005-02-25) (వయసు 80)
పరాపరము బీచ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 68)1955 మార్చి 11 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1955 మార్చి 25 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 2 57
చేసిన పరుగులు 1 768
బ్యాటింగు సగటు 0.50 14.76
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 1* 44*
క్యాచ్‌లు/స్టంపింగులు 4/0 108/28
మూలం: Cricinfo, 1 April 2017

ఇయాన్ అలెగ్జాండర్ కోల్‌కౌన్ 1924 జూలై 8న న్యూజీలాండ్ లోని వెల్లింగ్టన్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

కోల్‌కౌన్ వికెట్ కీపర్ గా, లోయర్-ఆర్డర్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. ఇతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు ఆలస్యంగా వచ్చాడు. 29 ఏళ్ళ వరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లకు అరంగేట్రం చేయలేదు. 1954-55 ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌లలో ఆడాడు.[3]

కోల్‌కౌన్ తను రిటైరయ్యే సమయంలో 1963–64 వరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లకు వికెట్ కీపింగ్ చేస్తూనే ఉన్నాడు. 1952 నుండి 1963 వరకు హాక్ కప్‌లో మనవాటు తరపున కూడా ఆడాడు.

కోల్‌కౌన్ పామర్‌స్టన్ నార్త్ బాయ్స్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆల్ బ్లాక్స్ కోసం రగ్బీ ట్రయలిస్ట్ కూడా. 1985 న్యూ ఇయర్ ఆనర్స్‌లో, ప్రజా సేవలకు గాను అతనికి క్వీన్స్ సర్వీస్ మెడల్ లభించింది.

మూలాలు

మార్చు
  1. "Ian Colquhoun Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
  2. "Ian Colquhoun Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
  3. "NZ vs ENG, England tour of New Zealand 1954/55, 1st Test at Dunedin, March 11 - 16, 1955 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.

బాహ్య లింకులు

మార్చు