1967, అక్టోబర్ 24న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని బెల్మాంట్‌లో జన్మించిన ఇయాన్ బిషప్ (Ian Raphael Bishop) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1989 నుంచి 1998 వరకు ఇతడి వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కేవలం 21 టెస్టు మ్యాచ్‌లలోనే తన తొలి 100 వికెట్లను సాధించాడు. ఫాస్ట్ బౌలర్ అయిన ఇతడు ఔట్ స్వింగ్ బౌలింగ్ వేయడంలో నేర్పరి. 1991లో వెన్ను నొప్పి వలన 1991లో జట్టు నుంచి వైదొలిగినాడు. 1992లో మళ్ళీ పునరాగమనం చేసిననూ 1993లో మరో సారి గాయాలబారిపడి 1995 వరకు జట్టులోకి రాలేడు. గాయాల వల్ల క్రీడాజీవితానికి కోలుకోలేని దెబ్బతగిలింది. చివరికి 1998లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిస్క్రమించేనాటికి 43 టెస్టులలో 161 వికెట్లు సాధించాడు. వన్డేలలో 84 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 118 వికెట్లు పడగొట్టినాడు.

ఇయాన్ బిషప్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ఇయాన్ రాఫెల్ బిషప్
జననం (1967-10-24) 1967 అక్టోబరు 24 (వయసు 55)
బెల్‌మోంట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ అండ్ టొబాకో
ఎత్తు 6 అ. 5 అం. (1.96 మీ.)
బ్యాటింగ్ శైలి కుడి చేయి
బౌలింగ్ శైలి కుడి చేయి ఫాస్ట్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు West Indies
టెస్టు అరంగ్రేటం 25 మార్చి 1989 v India
చివరి టెస్టు 12 మార్చి 1998 v England
వన్డే లలో ప్రవేశం 21 మే 1988 v England
చివరి వన్డే 4 నవంబరు 1997 v Pakistan
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1986–2000 ట్రినిడాడ్ అండ్ టొబాకో
1989–1993 డెర్బీషైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్డేలు FC LA
మ్యాచ్‌లు 43 84 159 156
సాధించిన పరుగులు 632 405 2,639 1,047
బ్యాటింగ్ సగటు 12.15 16.20 15.52 19.03
100s/50s 0/0 0/0 2/3 0/1
ఉత్తమ స్కోరు 48 33* 111 53
బాల్స్ వేసినవి 8,407 4,332 26,560 7,731
వికెట్లు 161 118 549 196
బౌలింగ్ సగటు 24.27 26.50 23.06 27.92
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 6 2 23 2
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 1 0
ఉత్తమ బౌలింగ్ 6/40 5/25 7/34 5/25
క్యాచులు/స్టంపింగులు 8/– 12/– 50/– 23/–
Source: క్రికెట్ ఆర్కివ్, 20 అక్టోబరు 2010

టెస్ట్ క్రికెట్సవరించు

ఇయాన్ బిషప్ తన క్రీడాజీవితంలో 43 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 24.27 సగటుతో 161 వికెట్లు సాధించాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 6 సార్లు సాధించాడు. టెస్టులలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 40 పరుగులకు 6 వికెట్లు. బ్యాటింగ్‌లో 12.15 సగటుతో 632 పరుగులు చేశాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ స్కోరు 48 పరుగులు.

వన్డే క్రికెట్సవరించు

బిషప్ 84 వన్డేలు ఆడి 26.50 సగటుతో 118 వికెట్లను పడగొట్టాడు. ఒకే వన్డేలో 5 వికెట్లను 2 సార్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 25 పరుగులకు 5 వికెట్లు. బ్యాటింగ్‌లో 16.19 సగటుతో 405 పరుగులు సాధించాడు. వన్డేలలో బిషప్ అత్యుత్తమ స్కోరు 33 (నాటౌట్).

ప్రపంచ కప్ క్రికెట్సవరించు

1991 వరకు అత్యుత్తమ ప్రదర్శన చూపిన బిషప్ 1992 ప్రపంచ కప్ సమయంలో గాయం వల్ల జట్టులోకి రాలేడు. బిషప్ 1996లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో వెస్ట్‌ఇండీస్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

బయటి లింకులుసవరించు