ఇరానీ కప్
ZR ఇరానీ కప్ లేదా కేవలం ఇరానీ ట్రోఫీ, (IDFC ఫస్ట్ బ్యాంక్ ఇరానీ ట్రోఫీ) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నిర్వహించే ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంటు. [3] ఇది రంజీ ట్రోఫీ విజేతలకు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకూ మధ్య ప్రతి సంవత్సరం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో వివిధ రాష్ట్రాల రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లు ఉంటారు.
ఇరానీ ట్రోఫీ | |
---|---|
దేశాలు | భారతదేశం |
నిర్వాహకుడు | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ |
ఫార్మాట్ | ఫస్ట్ క్లాస్ క్రికెట్ |
తొలి టోర్నమెంటు | 1959–60 |
చివరి టోర్నమెంటు | 2022–23 |
తరువాతి టోర్నమెంటు | 2023–24 |
టోర్నమెంటు ఫార్మాట్ | ప్లే ఆఫ్ |
జట్ల సంఖ్య | 2 |
ప్రస్తుత ఛాంపియన్ | రెస్ట్ ఆఫ్ ఇండీయా (30వ టైటిలు) |
అత్యంత విజయవంతమైన వారు | రెస్ట్ ఆఫ్ ఇండీయా (30వ టైటిళ్ళు) |
అర్హత | రంజీ ట్రోఫీ |
అత్యధిక పరుగులు | వసీం జాఫర్ (1,294)[1] |
అత్యధిక వికెట్లు | పద్మాకర్ శివాల్కర్ (51)[2] |
2022–23 ఇరానీ కప్ |
రంజీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌కు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ టోర్నమెంట్ 1959-60 సీజన్‌లో రూపొందించబడింది. దివంగత BCCI ప్రెసిడెంట్ జల్ R. ఇరానీ పేరు దీనికి పెట్టారు. 1928లో BCCI ప్రారంభం నుండి 1970లో మరణించే వరకు అతనికి బిసిసిఐతో అనుబంధం ఉంది.
చరిత్ర
మార్చురంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌కు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకూ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ 1959-60లో ఆడారు. ఈ ట్రోఫీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో దీర్ఘకాలం పాటు కోశాధికారిగా, అధ్యక్షుడిగా చేసిన, ఆటకు గొప్ప పోషకుడైన జల్ ఇరానీ పేరిట స్థాపించారు. మొదటి కొన్ని సంవత్సరాలు, దీన్ని సీజన్ ముగింపులో ఆడేవారు. దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన బిసిసిఐ దానిని సీజన్ ప్రారంభానికి తరలించింది. 1965-66 నుండి 2012-13 వరకు, ఇది కొత్త దేశీయ సీజన్ ప్రారంభానికి గుర్తుగా ఉండేది. 2013లో, ఇది రంజీ ట్రోఫీ ఫైనల్ ముగిసిన వెంటనే జరిపారు. ఫలితంగా 2012/13 సీజన్‌లో రెండు ఇరానీ కప్ మ్యాచ్‌లు జరిగాయి. అప్పటి నుండి దీన్ని సీజన్ చివరిలో జరుపుతున్నారు. రంజీ ట్రోఫీ ఫైనల్ అయ్యాక కొన్నాళ్లకు దీన్ని జరుపుతారు.[4]
2022లో, ఇరానీ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా, టోర్నమెంట్‌లోని రెండు సీజన్‌లను బ్యాక్‌టు బ్యాక్‌గా (2019–20, 2022–23 ట్రోఫీలు) నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. [5]
విజేతలు
మార్చుకింది పట్టిక 1959–60 నుండి 2022–23 వరకు ఇరానీ ట్రోఫీ ఫలితాలను చూపుతుంది. [6]
సీజను | విజేత | ఫలితం | ప్రత్యర్థి | అతిథేయి |
---|---|---|---|---|
1959-60 | బొంబాయి | 1వ ఇన్నింగ్స్ ఆధిక్యం | మిగిలిన భారతదేశం | కర్నైల్ సింగ్ స్టేడియం |
1960-61 | నిర్వహించలేదు | |||
1962-63 | బొంబాయి | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | బ్రాబౌర్న్ స్టేడియం |
1963-64 | బొంబాయి | 109 పరుగుల తేడాతో విజయం | రెస్ట్ ఆఫ్ ఇండియా | నీలం సంజీవ రెడ్డి స్టేడియం |
1964-65 | నిర్వహించలేదు | |||
1965-66 | బొంబాయి / రెస్ట్ ఆఫ్ ఇండియా (భాగస్వామ్యం) | జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (చెన్నై) | ||
1966-67 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 6 వికెట్లు | బొంబాయి | ఈడెన్ గార్డెన్స్ |
1967-68 | బొంబాయి | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | బ్రబౌర్న్ స్టేడియం |
1968-69 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 119 పరుగుల తేడాతో విజయం | బొంబాయి | బ్రబౌర్న్ స్టేడియం |
1969-70 | బొంబాయి | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | పూణే క్లబ్ గ్రౌండ్ |
1970-71 | బొంబాయి | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఈడెన్ గార్డెన్స్ |
1971-72 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 119 పరుగుల తేడాతో విజయం | బొంబాయి | బ్రబౌర్న్ స్టేడియం |
1972-73 | బొంబాయి | 220 పరుగుల తేడాతో విజయం | రెస్ట్ ఆఫ్ ఇండియా | నెహ్రూ స్టేడియం, పూణే |
1973-74 | రెస్ట్ ఆఫ్ ఇండియా | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | బొంబాయి | ఎం. చిన్నస్వామి స్టేడియం |
1974-75 | కర్ణాటక | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ |
1975-76 | బొంబాయి | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ |
1976-77 | బొంబాయి | 10 వికెట్లు | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఫిరోజ్ షా కోట్లా |
1977-78 | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఇన్నింగ్స్, 168 పరుగులు | బొంబాయి | వాంఖడే స్టేడియం |
1978-79 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 9 వికెట్లు | కర్ణాటక | ఎం. చిన్నస్వామి స్టేడియం |
1979-80 | నిర్వహించలేదు | |||
1980-81 | ఢిల్లీ | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఫిరోజ్ షా కోట్లా |
1981-82 | బొంబాయి | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | నెహ్రూ స్టేడియం, ఇండోర్ |
1982-83 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 5 వికెట్లు | ఢిల్లీ | ఫిరోజ్ షా కోట్లా |
1983-84 | కర్ణాటక | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్ |
1984-85 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 4 వికెట్లు | బొంబాయి | ఫిరోజ్ షా కోట్లా |
1985-86 | బొంబాయి | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ |
1986-87 | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఇన్నింగ్స్, 232 పరుగులు | ఢిల్లీ | బర్కతుల్లా ఖాన్ స్టేడియం |
1987-88 | హైదరాబాద్ | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | జింఖానా గ్రౌండ్, సికింద్రాబాద్ |
1988-89 | తమిళనాడు | 3 వికెట్లు | రెస్ట్ ఆఫ్ ఇండియా | M. A. చిదంబరం స్టేడియం |
1989-90 | ఢిల్లీ | 309 పరుగులు | రెస్ట్ ఆఫ్ ఇండియా | వాంఖడే స్టేడియం |
1990-91 | రెస్ట్ ఆఫ్ ఇండియా | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | బెంగాల్ | ఎం. చిన్నస్వామి స్టేడియం |
1991-92 | హర్యానా | 4 వికెట్లు | రెస్ట్ ఆఫ్ ఇండియా | నహర్ సింగ్ స్టేడియం |
1992-93 | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఇన్నింగ్స్, 122 పరుగులు | ఢిల్లీ | ఫిరోజ్ షా కోట్లా |
1993-94 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 181 పరుగులు | పంజాబ్ | పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్టేడియం |
1994-95 | బొంబాయి | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | వాంఖడే స్టేడియం |
1995-96 | బొంబాయి | 9 వికెట్లు | రెస్ట్ ఆఫ్ ఇండియా | వాంఖడే స్టేడియం |
1996-97 | కర్ణాటక | 5 వికెట్లు | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఎం. చిన్నస్వామి స్టేడియం |
1997-98 | ముంబై | 54 పరుగులు | రెస్ట్ ఆఫ్ ఇండియా | వాంఖడే స్టేడియం |
1998-99 | కర్ణాటక | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఎం. చిన్నస్వామి స్టేడియం |
1999-00 | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఇన్నింగ్స్, 60 పరుగులు | కర్ణాటక | ఎం. చిన్నస్వామి స్టేడియం |
2000-01 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 10 వికెట్లు | ముంబై | వాంఖడే స్టేడియం |
2001-02 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 6 వికెట్లు | బరోడా | విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ |
2002-03 | రైల్వేలు | 5 వికెట్లు | రెస్ట్ ఆఫ్ ఇండియా | కర్నైల్ సింగ్ స్టేడియం |
2003-04 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 3 వికెట్లు | ముంబై | MA చిదంబరం స్టేడియం |
2004-05 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 290 పరుగులు | ముంబై | పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం |
2005-06 | రైల్వేలు | 9 వికెట్లు | రెస్ట్ ఆఫ్ ఇండియా | కర్నైల్ సింగ్ స్టేడియం |
2006-07 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 9 వికెట్లు | ఉత్తర ప్రదేశ్ | విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ |
2007-08 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 9 వికెట్లు | ముంబై | మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్ |
2008-09 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 187 పరుగులు | ఢిల్లీ | రిలయన్స్ క్రికెట్ స్టేడియం |
2009-10 | రెస్ట్ ఆఫ్ ఇండియా | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | ముంబై | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం |
2010-11 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 361 పరుగులు | ముంబై | సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం |
2011-12 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 404 పరుగులు | రాజస్థాన్ | సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం |
2012-13 | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఇన్నింగ్స్, 79 పరుగులు | రాజస్థాన్ | ఎం. చిన్నస్వామి స్టేడియం |
2013[7] | రెస్ట్ ఆఫ్ ఇండియా | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | ముంబై | వాంఖడే స్టేడియం |
2013-14 | కర్ణాటక | ఇన్నింగ్స్, 222 పరుగులు | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఎం. చిన్నస్వామి స్టేడియం |
2014-15 | కర్ణాటక | 246 పరుగులు | రెస్ట్ ఆఫ్ ఇండియా | ఎం. చిన్నస్వామి స్టేడియం |
2015-16 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 4 వికెట్లు | ముంబై | బ్రబౌర్న్ స్టేడియం |
2016-17 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 6 వికెట్లు | గుజరాత్ | బ్రబౌర్న్ స్టేడియం |
2017–18 | విదర్భ | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం |
2018–19 | విదర్భ | మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం | రెస్ట్ ఆఫ్ ఇండియా | విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం |
2019–20 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 8 వికెట్ల తేడాతో విజయం | సౌరాష్ట్ర | సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం |
2020–21 | COVID-19 కారణంగా నిర్వహించలేదు | |||
2022–23 | రెస్ట్ ఆఫ్ ఇండియా | 238 పరుగుల తేడాతో విజయం | మధ్యప్రదేశ్ | కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం |
జట్ల వారీగా ప్రదర్శనలు
మార్చుజట్టు | ప్రదర్శనలు | గెలుపు | నష్టం | గీయండి | చివరి విజయం | చివరి ప్రదర్శన |
---|---|---|---|---|---|---|
రెస్ట్ ఆఫ్ ఇండియా | 58 | 25 | 25 | 8 | 2023 | 2023 |
ముంబై (బాంబే) | 29 | 12 | 12 | 5 | 1997 | 2016 |
కర్ణాటక | 8 | 6 | 2 | 0 | 2014 | 2015 |
ఢిల్లీ | 6 | 2 | 4 | 0 | 1989 | 2008 |
రైల్వేలు | 2 | 2 | 0 | 0 | 2005 | 2005 |
విదర్భ | 2 | 0 | 0 | 2 | - | 2019 |
రాజస్థాన్ | 2 | 0 | 2 | 0 | - | 2012 |
హైదరాబాద్ | 1 | 1 | 0 | 0 | 1987 | 1987 |
తమిళనాడు | 1 | 1 | 0 | 0 | 1988 | 1988 |
హర్యానా | 1 | 1 | 0 | 0 | 1991 | 1991 |
బెంగాల్ | 1 | 0 | 0 | 1 | - | 1990 |
పంజాబ్ | 1 | 0 | 1 | 0 | - | 1993 |
బరోడా | 1 | 0 | 1 | 0 | - | 2001 |
ఉత్తర ప్రదేశ్ | 1 | 0 | 1 | 0 | - | 2006 |
గుజరాత్ | 1 | 0 | 1 | 0 | - | 2017 |
మధ్యప్రదేశ్ | 1 | 0 | 1 | 0 | - | 2023 |
ప్రసారకులు
మార్చుBCCI అధికారిక ప్రసారకర్తలు Sports18, JioCinema దీనిని TV, ఇంటర్నెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. BCCI వెబ్‌సైట్ bcci.tv మ్యాచ్ హైలైట్‌లు, స్కోర్‌లను ప్రసారం చేస్తుంది. [8]
మూలాలు
మార్చు- ↑ "Records | Irani Cup (Irani Trophy) | Most Runs". ESPNcricinfo. Retrieved 3 March 2019.
- ↑ "Records | Irani Cup (Irani Trophy) | Most Wickets". ESPNcricinfo. Retrieved 3 March 2019.
- ↑ "Mastercard acquires title sponsorship rights for all BCCI international and domestic home matches". www.bcci.tv (in ఇంగ్లీష్). Retrieved 2022-09-21.
- ↑ Menon, Mohandas. "Irani Cup: history and perspective". wisdenindia.com. Archived from the original on 1 March 2014. Retrieved 18 February 2014.
- ↑ "Both Saurashtra and Madhya Pradesh to play Irani Cups in 2022-23". 6 September 2022.
- ↑ "Irani Trophy".
- ↑ "Irani cup 2012-13". Cricinfo. 10 February 2013.
- ↑ "Irani Cup live streaming info..." The Hindu. 28 February 2023. Retrieved 2 March 2023.