ఎం. చిన్నస్వామి స్టేడియం

మంగళం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులోని క్రికెట్ స్టేడియం. దీనిని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని కూడా పిలుస్తారు.

ఎం. చిన్నస్వామి స్టేడియం
కెఎస్‌సిఏ స్టేడియం
ఎం. చిన్నస్వామి స్టేడియం
మైదాన సమాచారం
ప్రదేశంబెంగళూరు
స్థాపితంమే 1969; 55 సంవత్సరాల క్రితం (1969-05)
సామర్థ్యం (కెపాసిటీ)40,000
యజమానికర్ణాటక ప్రభుత్వం
ఆపరేటర్కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ)
వాడుతున్నవారు
ఎండ్‌ల పేర్లు
పెవిలియన్ ఎండ్
బిఇఎమ్‌ఎల్ ఎండ్
అంతర్జాతీయ సమాచారం
మొదటి టెస్టు1974 నవంబరు 22–27:
 India v  వెస్ట్ ఇండీస్
చివరి టెస్టు2022 మార్చి 12–16:
 India v  శ్రీలంక
మొదటి ODI1982 26 సెప్టెంబరు:
 India v  శ్రీలంక
చివరి ODI202019 జనవరి:
 India v  ఆస్ట్రేలియా
మొదటి T20I2012 25 డిసెంబరు:
 India v  పాకిస్తాన్
చివరి T20I2022 19 జూన్:
 India v  దక్షిణాఫ్రికా
ఏకైక మహిళా టెస్టు1976 31 అక్టోబరు – 2 నవంబరు:
 India v  వెస్ట్ ఇండీస్
మొదటి WODI1997 12 డిసెంబరు:
 ఆస్ట్రేలియా v  దక్షిణాఫ్రికా
చివరి WODI2015 8 జూలై:
 India v  న్యూజీలాండ్
మొదటి WT20I2014 30 నవంబరు:
 India v  దక్షిణాఫ్రికా
చివరి WT20I2016 28 మార్చి:
 శ్రీలంక v  దక్షిణాఫ్రికా
2022 19 జూన్ నాటికి
Source: Cricinfo

బెంగుళూరు నగరం నడిబొడ్డున, చుట్టూ సుందరమైన కబ్బన్ పార్క్, క్వీన్స్ రోడ్, MG రోడ్‌లతో ఉన్న ఈ స్టేడియం ఐదు దశాబ్దాల నాటిది. దీనికి 40,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.[1] టెస్టు క్రికెట్‌, వన్ డే ఇంటర్నేషనల్స్ (ODI), ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20i) ఇతర ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ స్టేడియం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ లకు ఇది హోమ్ గ్రౌండ్. ఇది కర్నాటక ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఈ స్టేడియాన్ని 100 సంవత్సరాల కాలానికి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)కి లీజుకు ఇచ్చారు.

గతంలో దీన్ని కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంగా పిలిచేవారు. ఆ తరువాత మాండ్యాకు చెందిన న్యాయవాది, మైసూర్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు అయిన మంగళం చిన్నస్వామి ముదలియార్‌కు నివాళిగా పేరు మార్చారు.[2] అతను నాలుగు దశాబ్దాల పాటు KSCAకి సేవలందించాడు. 1977 నుండి 1980 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.

స్టేడియం నడపడానికి అవసరమైన విద్యుత్‌లో ఎక్కువ భాగం ఉత్పత్తి చేయడానికి సౌర ఫలకాలను ఉపయోగించిన క్రికెట్ స్టేడియంలలో ప్రపంచంలోనే ఇది మొదటిది.[3] 2016లో నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసారు.[4] 2017 జనవరిలో తడిగా ఉన్న అవుట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్‌లు కుదించబడకుండా ఉండటానికి గాలిని పంపుచేసే వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.[5]

చరిత్ర

మార్చు

కర్నాటక ప్రభుత్వం నుండి ఉదారమైన ప్రోత్సాహంతో, ఈ స్టేడియానికి 1969లో పునాది వేసారు. 1970లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1972-73 సీజన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఈ స్టేడియాన్ని మొదట ఉపయోగించారు. 1974-75 సీజన్‌లో వెస్టిండీస్ భారత్‌లో పర్యటించినప్పుడు ఇది టెస్టు హోదాను పొందింది.[6][7]

1977 నుండి 1980 వరకు BCCI ప్రెసిడెంట్‌గా ఉండి KSCAకి సేవలందించిన M. చిన్నస్వామి ముదలియార్‌కు నివాళిగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) స్టేడియం పేరు మార్చారు.[6][7] 1900లో మాండ్యలో జన్మించిన అతను మైసూర్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు, వృత్తిరీత్యా న్యాయవాది.[2] ఇతర ప్రముఖుల తోడ్పాటుతో అతను,1969లో ప్రైమ్ MG రోడ్ ప్రాంతంలో క్రికెట్ కోసం మైదానాన్ని కేటాయించడానికి కర్ణాటక ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు [8]

ఈ స్టేడియంలో మొదటి టెస్టు 1974 నవంబరు 22-29 లలో జరిగింది [7] యాదృచ్ఛికంగా, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, గార్డన్ గ్రీనిడ్జ్‌లకు అదే తొలి టెస్టు మ్యాచ్. క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ 256 పరుగుల భారీ తేడాతో MAK పటౌడీ నేతృత్వం లోని భారత జట్టును చిత్తు చేసింది. 1976-77లో టోనీ గ్రెగ్ నేతృత్వంలోని టూరింగ్ ఇంగ్లిష్ జట్టుపై భారత్ ఈ మైదానంలో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఈ వేదికపై మొదటి ODI మ్యాచ్ 1982 సెప్టెంబరు 6 న జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.

1996 విల్స్ ప్రపంచ కప్ కోసం ఈ స్టేడియంలో ఫ్లడ్‌లైట్‌లు మొదటగా ఏర్పాటు చేసారు. 1996 మార్చి 9న చిరకాల ప్రత్యర్థులు భారత పాకిస్థాన్‌ల మధ్య జరిగిన క్వార్టర్-ఫైనల్ పోరులో 39 పరుగుల తేడాతో భారతదేశం పాకిస్థాన్‌ను ఓడించింది. 2007లో, భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్లు 61/4 నుండి 300 పరుగుల భాగస్వామ్యం సాధించి, అనేక రికార్డులను బద్దలు కొట్టారు. ఆట ముగిసే సమయానికి భారత్ సాధించిన 365/5 భారత్‌లో తొలి రోజున సాధించిన అత్యధిక స్కోరు. 300 పరుగుల భాగస్వామ్యం స్టేడియంలో అత్యధిక భాగస్వామ్యం. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లు సాధించిన అత్యధిక భాగస్వామ్యం. సౌరవ్ గంగూలీ 239 పరుగులే ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక స్కోరు.

2000లో BCCI జాతీయ క్రికెట్ అకాడమీకి బెంగళూరును కేంద్రంగా ఎంచుకున్నప్పటి నుండి, ఈ మైదానంలో ఉన్న అకాడమీ నుండి చాలా మంది వర్ధమాన క్రికెటర్లు ఉత్తీర్ణులయ్యారు. చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఫ్రాంచైజీ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క హోమ్ గ్రౌండ్ కూడా. ఈ స్టేడియం 1996 మిస్ వరల్డ్ పోటీకి వేదికగా కూడా పనిచేసింది.[9]

KSCA సీటింగ్ కెపాసిటీని 70,000కి పెంచాలని యోచిస్తోంది. 70,000–80,000 సీటింగ్ కెపాసిటీతో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని కూడా ఆలోచించింది.[10] అయితే, ఆ ప్రణాళికలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఐపీఎల్ మొదటి సీజన్ కోసం ఈ స్టేడియానికి కొత్త రూపాన్ని అందించారు.

క్రికెట్ ప్రపంచ కప్‌లు

మార్చు

ఈ స్టేడియం భారతదేశంలో జరిగిన ప్రపంచ కప్‌ లన్నిటి లోనూ వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.


1986 అక్టోబరు 14
స్కోరు
భారతదేశం  
252/7 (50 ఓవర్లు)
v
  న్యూజీలాండ్
236/8 (50 ఓవర్లు)
ఇండియా 16 పరుగులతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, ఇండియా
అంపైర్లు: David Archer, డిక్య్ బర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కపిల్ దేవ్

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్


1996 మార్చి 9
స్కోరు
భారతదేశం  
287/8 (50 ఓవర్లు)
v
  పాకిస్తాన్
248/9 (49 ఓవర్లు)
ఇండియా 39 పరుగులతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, ఇండియా
అంపైర్లు: స్టీవ్ బక్నర్, డేవిడ్ షెపర్డ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ
  • నిదానంగా బౌలింగు చేసినందుకు గాను పాకిస్తాన్‌కు 1 ఓవరు జరిమానా విధించారు

ICC ప్రపంచ కప్ 2011, 15వ మ్యాచ్, గ్రూప్ B

2011 మార్చి 2
స్కోరు
ఇంగ్లాండు  
327/8 (50 ఓవర్లు)
v
  ఐర్లాండ్
329/7 (49.1 ఓవర్లు)
ఐర్లాండ్ 3 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, ఇండియా
అంపైర్లు: బిల్లీ బౌడెన్, అలీం దార్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కెవిన్ ఓ బ్రయన్

ICC ప్రపంచ కప్ 2011, 22వ మ్యాచ్, గ్రూప్ B

2011 మార్చి 6
స్కోరు
ఐర్లాండ్  
207/10 (47.5 ఓవర్లు)
v
  భారతదేశం
210/5 (46 ఓవర్లు)
యువరాజ్ సింగ్ 50 (75)
Trent Johnston 2/16 (5 ఓవర్లు)
ఇండియా 5 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, ఇండియా
అంపైర్లు: బిల్లీ బౌడెన్, Rod Tucker
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యువరాజ్ సింగ్

ICC ప్రపంచ కప్ 2011, 31వ మ్యాచ్, గ్రూప్ A

2011 మార్చి 13
స్కోరు
ఆస్ట్రేలియా  
324/6 (50 ఓవర్లు)
v
  కెన్యా
264/6 (50 ఓవర్లు)
ఆస్ట్రేలియా 60 పరుగులతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, ఇండియా
అంపైర్లు: అసద్ రౌఫ్ (PAK), రిచర్డ్ కెటిల్‌బరో (ENG)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కాలిన్స్ ఒబుయా (KEN)

ICC ప్రపంచ కప్ 2011, 35వ మ్యాచ్, గ్రూప్ A

2011 మార్చి 16
స్కోరు
కెనడా  
211/10 (45.4 ఓవర్లు)
v
  ఆస్ట్రేలియా
212/3 (34.5 ఓవర్లు)
Hiral Patel 54 (45)
బ్రెట్ లీ 4/46 (8.4 ఓవర్లు)
షేన్ వాట్సన్ 94 (90)
John Davison 1/29 (4 ఓవర్లు)
ఆస్ట్రేలియా 7 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, ఇండియా
అంపైర్లు: Amiesh Saheba, బిల్లీ బౌడెన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షేన్ వాట్సన్

ICC ప్రపంచ కప్ 2011, 11వ మ్యాచ్, గ్రూప్ B

2011 ఫిబ్రవరి 27
స్కోరు
భారతదేశం  
338/10 (49.5 ఓవర్లు)
v
  ఇంగ్లాండు
338/8 (50 ఓవర్లు)
Match Tied
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, ఇండియా
అంపైర్లు: మరాయిస్ ఎరాస్మస్, బిల్లీ బౌడెన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రూ స్ట్రాస్

ఈవెంట్లు

మార్చు

మిస్ వరల్డ్ 1996 అందాల పోటీ ఈ స్టేడియంలో జరిగింది, భారతదేశంలో ఈ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. గ్రీస్‌కు చెందిన ఐరీన్ స్క్లివా విజేతగా నిలిచింది.

రికార్డులు, గణాంకాలు

మార్చు

2017లో ICC 'టెస్టు స్టేటస్' మంజూరు చేసిన తర్వాత, ఈ వేదికపై తమ మొట్టమొదటి టెస్టు మ్యాచ్ 2018 జూన్ 14 న, ఆఫ్ఘనిస్తాన్ భారత్‌తో ఆడింది.[11]

టెస్టు మ్యాచ్ రికార్డులు

మార్చు

బ్యాటింగ్

మార్చు

Most career runs[12]
Runs Player Period
869 (16 Innings)   సచిన్ టెండుల్కర్ 1994–2012
600 (12 ఇన్నింగ్స్‌లు)   సునీల్ గవాస్కర్ 1974–1987
513 (11 ఇన్నింగ్స్‌లు)   వీరేంద్ర సెహ్వాగ్ 2001–2012
503 (13 ఇన్నింగ్స్‌లు)   సౌరవ్ గంగూలీ 1998–2008
450 (8 ఇన్నింగ్స్‌లు)   గుండప్ప విశ్వనాథ్ 1974–1981

Most career runs (Non-India)[13]
Runs Player Period
431 (4 ఇన్నింగ్స్‌లు)   యూనిస్ ఖాన్ 2005–2007
305 (5 ఇన్నింగ్స్‌లు)   రికీ పాంటింగ్ 1998–2010
287 (6 ఇన్నింగ్స్‌లు)   సైమన్ కాటిచ్ 2004–2010
245 (4 ఇన్నింగ్స్‌లు)   ఆల్విన్ కాళీచరణ్ 1974–1978
231 (4 ఇన్నింగ్స్‌లు)   మైకెల్ హస్సీ 2008–2010

Highest individual score[14]
Runs Player Year
267 vs ఇండియా   యూనిస్ ఖాన్ 2005
239 vs పాకిస్తాన్   సౌరవ్ గంగూలీ 2007
214 vs ఆస్ట్రేలియా   సచిన్ టెండుల్కర్ 2010
201 vs పాకిస్తాన్   వీరేంద్ర సెహ్వాగ్ 2005

కెరీర్లో అత్యధిక వికెట్లు[15]
Wickets ఆటగాడు కాలం
41 (16 ఇన్నింగ్స్‌లు)   అనిల్ కుంబ్లే 1994–2008
30 (14 ఇన్నింగ్స్‌లు)   హర్భజన్ సింగ్ 1998–2010
29 (9 ఇన్నింగ్స్‌లు)   రవిచంద్రన్ అశ్విన్ 2012–2022
27 (15 ఇన్నింగ్స్‌లు)   కపిల్ దేవ్ 1978–1994
18 (7 ఇన్నింగ్స్‌లు)   రవీంద్ర జడేజా 2015–2022

కెరీర్లో అత్యధిక వికెట్లు (భారతేతర)[16]
Wickets ఆటగాడు కాలం
11 (4 ఇన్నింగ్స్‌లు)   డానిష్ కనేరియా 2005–2007
10 (4 ఇన్నింగ్స్‌లు)   మైకెల్ కాస్ప్రోవిజ్ 1998–2004
9 (5 ఇన్నింగ్స్‌లు)   ఇక్బాల్ కాసిం 1979–1987
9 (4 ఇన్నింగ్స్‌లు)   మొహమ్మద్ సమీ 2005–2007
9 (2 ఇన్నింగ్స్‌లు)   తౌసీఫ్ అహ్మద్ 1987–1987
9 (4 ఇన్నింగ్స్‌లు)   షేన్ వార్న్ 1998–2004

ఒక ఇన్నింగ్సులో గణాంకాలు[17]
గణాంకాలు ఆటగాడు సంవత్సరం
8/50 vs ఇండియా   నాథన్ ల్యాన్ 2017
7/27 vs పాకిస్తాన్   మణీందర్ సింగ్ 1987
7/64 vs ఇండియా   టిం సౌథీ 2012
6/41 vs ఆస్ట్రేలియా   రవిచంద్రన్ అశ్విన్ 2017
6/53 vs ఇండియా   బాబ్ విల్లిస్ 1977
6/59 vs న్యూజీలాండ్   నరేంద్ర హిర్వాణీ 1988
6/71 vs ఇంగ్లాండ్   బిషన్ సింగ్ బేడి 1977

Best match figures[18]
Figures ఆటగాడు సంవత్సరం
11/224 vs ఇంగ్లాండ్   హర్భజన్ సింగ్ 2004
10/126 vs ఆస్ట్రేలియా   మణీందర్ సింగ్ 1987
9/120 vs పాకిస్తాన్   అనిల్ కుంబ్లే 1995
9/121 vs ఇండియా   ఇక్బాల్ కాసిం 1987
9/131 vs న్యూజీలాండ్   బి.ఎస్. చంద్రశేఖర్ 1977
9/139 vs ఇండియా   తౌసీఫ్ అహ్మద్ 1987

జట్టు రికార్డులు

మార్చు

Highest innings score[19]
Score Team Year
626   భారతదేశం vs Pakistan 2007
570   పాకిస్తాన్ vs India 2005
541/6d   భారతదేశం vs Sri Lanka 1974
537   పాకిస్తాన్ vs India 2007
495   భారతదేశం vs Australia 2010

Lowest completed innings[20]
Score Team Year
103   ఆఫ్ఘనిస్తాన్ vs India 2018
109   ఆఫ్ఘనిస్తాన్ vs India 2018
109   శ్రీలంక vs India 2022
112   ఆస్ట్రేలియా vs India 2017
145   భారతదేశం vs Pakistan 1987

భాగస్వామ్య రికార్డులు

మార్చు

2015 నవంబరు 10 నాటికి ఉన్న రికార్డులు

వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ రికార్డులు

మార్చు

అత్యధిక మొత్తం: 383–6భారత్ v ఆస్ట్రేలియా 2013 నవంబరు 2. రెండవది 347–2 – ఆస్ట్రేలియా v ఇండియా, 2011 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 338 వద్ద టై అయిన మూడవ, నాల్గవ అత్యధిక స్కోర్లు.

అత్యధిక పరుగుల వేట: 329–7 – ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా 2011 మార్చి 2న 50 ఓవర్లలో ఇంగ్లండ్ 327 పరుగులకు వ్యతిరేకంగా ఐర్లాండ్ 329 (49.1 ఓవర్లలో) పరుగులు చేసింది.

అత్యధిక వ్యక్తిగత స్కోరు: రోహిత్ శర్మ 209 పరుగులు చేశాడు

అత్యధిక పరుగులు సచిన్ టెండూల్కర్ (534 పరుగులు), రోహిత్ శర్మ (437 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (328 పరుగులు) చేశారు.

అత్యధిక వికెట్లు జహీర్ ఖాన్ (14 వికెట్లు), జవగల్ శ్రీనాథ్ (10 వికెట్లు), వెంకటేష్ ప్రసాద్ & కపిల్ దేవ్ (తలా 8 వికెట్లు)

IPL రికార్డులు [22]

మార్చు

అత్యధిక మొత్తం - 263 - RCB v పూణే వారియర్స్, 2013

అత్యధిక వ్యక్తిగత స్కోరు - CH గేల్, 175 (66 బంతుల్లో) RCB v పూణే వారియర్స్, 2013

ఉత్తమ బౌలింగ్ గణాంకాలు - S బద్రీ, RCB v MI 4/9, 2017

గ్యాలరీ

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
  • టెస్ట్ క్రికెట్ మైదానాల జాబితా

మూలాలు

మార్చు
  1. "M. Chinnaswamy Stadium, Bengaluru". The Board of Control for Cricket in India. Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 21 January 2021.
  2. 2.0 2.1 S. S. Shreekumar (2021). Karnataka Cricket's Hall of Fame And It's Corridors. Chennai: Clever Fox Publishing. p. 103. ISBN 9789390850730.
  3. "A sunny pitch at Chinnaswamy stadium". The Hindu. 10 April 2015. ISSN 0971-751X. Retrieved 25 April 2018.
  4. Anirudh R Gangavaram (21 April 2016). "KSCA to modernize the Chinnaswamy stadium". CricTracker.
  5. "Historic: Bengaluru's M Chinnaswamy Stadium gets next-generation outfield to fight rain delays". OneIndia. 3 August 2017 – via MyKhel.
  6. 6.0 6.1 "M Chinnaswamy Stadium, Bangalore, India". Hindustan Times. 26 February 2005. Retrieved 21 February 2021.
  7. 7.0 7.1 7.2 "Bengaluru's M Chinnaswamy Stadium: Where iconic matches were fought". Bangalore Mirror. 15 October 2017. Retrieved 21 February 2021.
  8. "'The frank, honest MC I knew'". The New Indian Express. 5 November 2012. Retrieved 17 February 2022.
  9. "Miss World Crowned As Indians Protest". The New York Times. Reuters. 24 November 1996.
  10. Coovercolly Indresh (15 January 2023). "20.8 acres handed over to KSCA for new stadium: MUDA". Hindustan Times.
  11. "Only Test, Afghanistan tour of India at Bengaluru, Jun 14-15 2018: Match Summary". ESPNcricinfo. Retrieved 24 August 2018.
  12. "Statistics / Statsguru / Test matches / Batting records/ M. Chinnaswamy Stadium / Runs scored". ESPN Cricinfo. Retrieved 10 November 2015.
  13. "Statistics / Statsguru / Test matches / Batting records / M. Chinnaswamy Stadium / Runs scored (Non-India)". ESPN Cricinfo. Retrieved 10 November 2015.
  14. "Statistics / Statsguru / Test matches / Batting records / M. Chinnaswamy Stadium / Runs scored in an innings". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  15. "Statistics / Statsguru / Test matches / Bowling records / M. Chinnaswamy Stadium / తీసుకున్న వికెట్లు". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  16. "Statistics / Statsguru / Test matches / Bowling records / M. Chinnaswamy Stadium / తీసుకున్న వికెట్లు (భారతేతర)". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  17. "Statistics / Statsguru / Test matches / Bowling records / M. Chinnaswamy Stadium / Wickets taken in an innings". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  18. "Statistics / Statsguru / Test matches / Bowling records / M. Chinnaswamy Stadium / Wickets taken in a match". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  19. "Statistics / Statsguru / Test matches / Team records / M. Chinnaswamy Stadium / Team score". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  20. "Statistics / Statsguru / Test matches / Team records / M. Chinnaswamy Stadium / Team score (lowest)". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  21. "Statistics / Statsguru / Test matches / Partnership records / M. Chinnaswamy Stadium / Partnership runs". ESPNcricinfo. Retrieved 10 November 2015.
  22. "IPL Records M. Chinnaswamy Stadium Karnataka Bangalore". T20 Head to Head. 1 March 2023. Retrieved 20 March 2023.