వాంఖెడే స్టేడియం
వాంఖెడే స్టేడియం ముంబైలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.[2] ఇది ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సిఏ) యాజమాన్యంలో ఉంది. ఐపియెల్ లోని ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది హోమ్ గ్రౌండ్. ఎమ్‌సిఏ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ల ప్రధాన కార్యాలయాలు ఈ స్టేడియం లోనే ఉన్నాయి.
Address | నేతాజీ సుభాస్ చంద్ర బోస్ రోడ్డు, చర్చ్‌గేట్, దక్షిణ ముంబై |
---|---|
Location | చర్చ్‌గేట్, ముంబై, మహారాష్ట్ర |
Owner | ముంబై క్రికెట్ అసోసియేషన్ |
Operator | ముంబై క్రికెట్ అసోసియేషన్ |
Seating type | స్టేడియం సీటింగు |
Capacity | 32,000 (2011–ఇప్పటి వరకు)[1] 39,000 (1974–2010)[1] |
Surface | పచ్చిక |
Construction | |
Architect | శశి ప్రభు అండ్ ఎసోసియేట్స్ (1974), శశి ప్రభు అండ్ ఎసోసియేట్స్, పి.కె. దాస్ అండ్ ఎసోసియేట్స్ (2017) |
మైదాన సమాచారం | |
స్థాపితం | 1974 |
వాడుతున్నవారు | ముంబై క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ భారత క్రికెట్ జట్టు |
ఎండ్‌ల పేర్లు | |
టాటా ఎండ్ గర్వారే పెవిలియన్ ఎండ్ | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి టెస్టు | 1975 జనవరి 23-29: భారతదేశం v వెస్ట్ ఇండీస్ |
చివరి టెస్టు | 2021 డిసెంబరు 3–7: భారతదేశం v న్యూజీలాండ్ |
మొదటి ODI | 1987 జనవరి 17: భారతదేశం v శ్రీలంక |
చివరి ODI | 2023మార్చి 17: భారతదేశం v ఆస్ట్రేలియా |
మొదటి T20I | 2012 డిసెంబరు 22: భారతదేశం v ఇంగ్లాండు |
చివరి T20I | 2023 జనవరి 3: భారతదేశం v శ్రీలంక |
ఏకైక మహిళా టెస్టు | 1984 ఫిబ్రవరి 10–13: భారతదేశం v ఆస్ట్రేలియా |
మొదటి WODI | 1997 డిసెంబరు 23: ఐర్లాండ్ v న్యూజీలాండ్ |
చివరి WODI | 2019 ఫిబ్రవరి 28: భారతదేశం v ఇంగ్లాండు |
ఏకైక WT20I | 2016 మార్చి 31: వెస్ట్ ఇండీస్ v న్యూజీలాండ్ |
2023 మార్చి 17 నాటికి Source: Cricinfo |
ఈ స్టేడియం చర్చ్‌గేట్ ప్రాంతంలో మెరైన్ డ్రైవ్‌కు సమీపంలో ఉంది. హిందూ జింఖానా, పార్సీ జింఖానా, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI)తో సహా అనేక పాత క్రికెట్ క్లబ్‌లు స్టేడియం సమీపంలో ఉన్నాయి.
ఈ స్టేడియంలో గతంలో అనేక హై-ప్రొఫైల్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ముఖ్యంగా 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్. ఇక్కడే భారత్ శ్రీలంకను ఓడించి, సొంత గడ్డపై క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మొదటి దేశంగా అవతరించింది. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్ జరిగింది కూడా ఈ స్టేడియం లోనే.
చరిత్ర
మార్చుమునుపటి స్టేడియాలు
మార్చుముంబైలో మూడు వేర్వేరు మైదానాల్లో టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. బాంబే జింఖానా మైదానంలో 1933-34లో ఇంగ్లండ్‌పై భారతదేశం మొట్టమొదటి టెస్టు ఆడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన బ్రాబోర్న్ స్టేడియంలో 17 టెస్టులు జరిగాయి. ఇది నగరంలోని రెండవ మైదానం.
నిర్మాణం
మార్చుక్రికెట్ మ్యాచ్‌ల టిక్కెట్ల కేటాయింపు విషయమై బ్రాబోర్న్ స్టేడియం యాజమాన్యానికి (సిసిఐ), బాంబే క్రికెట్ అసోసియేషన్కూ (బిసిఏ; ఇప్పుడు ముంబై క్రికెట్ అసోసియేషన్) వివాదాలు వచ్చాయి.[3] 1973లో భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన టెస్టు తర్వాత ఈ వివాదాలు ముదిరాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, రాజకీయ నాయకుడూ అయిన SK వాంఖెడే చొరవతో బిసిఏ, దక్షిణ బొంబాయిలో చర్చ్‌గేట్ స్టేషన్‌కు సమీపంలో కొత్త స్టేడియం నిర్మించుకుంది. 1974లో దీనికి వాంఖెడే పేరే పెట్టారు. సుమారు 13 నెలల్లో నిర్మించి,1975లో భారత, వెస్టిండీస్ ల మధ్య జరిగిన చివరి టెస్టుతో దీన్ని ప్రారంభించారు.[4] అప్పటి నుండి, వాంఖెడే స్టేడియం నగరంలో ప్రధాన క్రికెట్ వేదికగా ఉంటూ వచ్చింది.
తొలి ఆటలు
మార్చు1974-75 సీజన్‌లో వెస్టిండీస్ భారత్‌లో పర్యటించినప్పుడు వాంఖెడే స్టేడియంలో మొదటి టెస్టు జరిగింది. ఆ మ్యాచిలో భారత్ 201 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్ ఆటగాడు క్లైవ్ లాయిడ్‌ను పలకరించడానికి ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. రెండు సీజన్ల తర్వాత న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచిలో భారత్ ఈ స్టేడియంలో తొలి విజయం సాధించింది. 1978-79 సిరీస్‌లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ 205 పరుగులు, అదే గేమ్‌లో ఆల్విన్ కాళీచరణ్ 187 పరుగుల ఇన్నింగ్స్‌కు, ఇయాన్ బోథమ్ సెంచరీతో పాటు, పదమూడు వికెట్ల వంటి ఆల్ రౌండ్ ప్రదర్శనలకూ ఈ స్టేడియం సాక్షి. 1979-80లో జూబ్లీ టెస్టులో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో గెలిచింది. 2016–17లో ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లి చేసిన 235 పరుగులే వాంఖెడే స్టేడియంలో భారత ఆటగాడి అత్యధిక స్కోరు. యాదృచ్ఛికంగా రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీకి వెళ్లే క్రమంలో రవిశాస్త్రి, బరోడా ఆటగాడు తిలక్ రాజ్ వేసిన ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు, 1984-85లో ఈ మైదానంలోనే నమోదైంది. శాస్త్రి 123 బంతుల్లో 113 నిమిషాల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో చేసిన అజేయమైన 200 పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీకి రికార్డుగా నిలిచింది. 2017–18 సీజన్లో షఫీకుల్లా షఫాక్ 89 బంతుల్లో డబుల్ సెంచరీ చేసినపుడు ఆ రికార్డు బద్దలైంది.[5][6]
నవీకరణ
మార్చు2011 ప్రపంచ కప్‌ను భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించాయి. ఫైనల్ మ్యాచ్ వాంఖెడే స్టేడియంలో జరిగింది. ప్రేక్షకులకు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు స్టేడియాన్ని అభివృద్ధి చేసారు.
మేనేజింగ్ కమిటీ పి.కె. దాస్ & అసోసియేట్స్, శశి ప్రభు & అసోసియేట్స్ తో సంయుక్తంగా వాంఖెడే స్టేడియం పునరాభివృద్ధి కోసం ఒక ప్రాజెక్ట్‌ను రూపొందించింది. స్టేడియాన్ని తిరిగి అభివృద్ధి చేస్తున్నప్పుడు, బకెట్ సీటింగ్, పెద్ద సంఖ్యలో టాయిలెట్లు, ఫుడ్ కోర్ట్‌ల పరంగా ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలతో ఉత్తర, దక్షిణ ఎండ్‌లలో పెద్ద మార్పులు చేసారు.
స్టేడియం ముఖ్యాంశాలలో కాంటిలివర్ పైకప్పు ఒకటి. దీనికి వేసిన టెఫ్లాన్ ఫాబ్రిక్ పైకప్పు బరువు తక్కువగా ఉంటుంది, వేడిని తట్టుకోగలదు. ఆట చూసేటపుడు ప్రేక్షకులకు అడ్డం లేకుండా ఉండేలా కప్పుకి స్తంభాలు లేకుండా నిర్మించారు. పైకప్పుపై, స్టాండ్‌ల నుండి వేడి గాలిని పీల్చేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు ఉన్నాయి. వీటివలన పశ్చిమం నుండి చల్లటి గాలి లోపలికి వీస్తుంది. స్టేడియంలో ఉత్తర, దక్షిణ స్టాండ్‌ల కోసం 20 ఎలివేటర్లు ఉన్నాయి.[7]
2011 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పునరుద్ధరణల తరువాత స్టేడియంలో 32,000 మంది కూచునే సామర్థ్యం మిగిలింది. పునరుద్ధరణకు ముందు సామర్థ్యం సుమారు 39,000 ఉండేది.[1]
2023 ప్రపంచ కప్
మార్చు2023 ప్రపంచ కప్ పోటీల్లో వేదికగా వాంఖెడే స్టేడియాన్ని ఉపయోగించాలని ప్రతిపాదించారు. దానికోసం స్టేడియాన్ని నవీకరించారు. అవుట్‌ఫీల్డ్ మొత్తాన్ని పునరుద్ధరించే పనిని పర్యవేక్షించడానికి శశి ప్రభు & అసోసియేట్‌లను మరోసారి నియమించారు. మ్యాచ్‌లు 2023 అక్టోబరు, నవంబరుల్లో జరగనున్నాయి.
పిచ్
మార్చుమైదానంలో నేల పైపొర అంతా స్థానికంగా లభించే ఎర్ర మట్టి పరచారు. దీనివలన బంతికి అదనపు బౌన్స్ లభిస్తూ, బ్యాటింగ్ చెయ్యడం కొద్దిగా క్లిష్టతరంగా మారుతుంది. కొద్ది సంవత్సరాలుగా ఇక్కడి పిచ్ సాధారణంగా బౌలర్ల కంటే బ్యాటర్లకే ఎక్కువగా అనుకూలంగా ఉంటూ వచ్చింది. అయితే, 2004 నాటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4వ టెస్టు సందర్భంగా పిచ్ తీవ్ర విమర్శలకు గురైంది. ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే భారత్ విజయంతో ముగిసింది. అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ మైదానాన్ని "మందుపాతర" అని వర్ణించాడు. ఆట 1వ సెషన్ నుండి బంతి చాలా వేగంగా తిరగడం ప్రారంభించింది. మామూలుగానే, స్టేడియం వెంబడి సముద్రపు గాలి ప్రవాహం కారణంగా కొత్త బంతితో పేస్ బౌలర్లు పిచ్ నుండి కొంత సహాయం పొందుతారు.
ప్రపంచ కప్ పోటీలు
మార్చుక్రికెట్ ప్రపంచ కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన ప్రతిసారీ ఈ స్టేడియం 20 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది:
1987 క్రికెట్ ప్రపంచ కప్
మార్చు1996 ప్రపంచ కప్
మార్చు2011 ప్రపంచ కప్
మార్చువాంఖడే స్టేడియంలో 2011 ప్రపంచ కప్ గెలిచినపుడు, సొంతగడ్డపై క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
ఇతర సంఘటనలు
మార్చు- 2014లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం వాంఖెడే స్టేడియం లోనే జరిగింది.[8]
రికార్డులు, గణాంకాలు
మార్చుటెస్టు రికార్డులు
మార్చు- అత్యధిక స్కోరు: 2016/17 సీజన్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 631-ఆల్ అవుట్.
- అత్యల్ప స్కోరు: 2021/22 సీజన్‌లో న్యూజిలాండ్ 62, భారత్‌పై.
- వాంఖెడే స్టేడియంలో 1986/87 సీజన్‌లో ఆస్ట్రేలియాపై భారత్ తరఫున వెంగ్‌సర్కార్, రవి శాస్త్రి చేసిన 298 పరుగుల భాగస్వామ్యం అత్యధికం.
- సునీల్ గవాస్కర్ ఈ స్టేడియంలో అత్యధిక టెస్టు పరుగులు (1122 పరుగులు) సాధించగా, సచిన్ టెండూల్కర్ (921), దిలీప్ వెంగ్‌సర్కార్ (631) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.[9]
- అనిల్ కుంబ్లే (38 వికెట్లు), ఆర్ అశ్విన్ (34 వికెట్లు), కపిల్ దేవ్ (28) అత్యధిక వికెట్లు తీసిన స్థానాల్లో ఉన్నారు[10]
వన్‌డే రికార్డులు
మార్చు- అత్యధిక స్కోరు: 2015 వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 438/4, ఆ తర్వాత న్యూజిలాండ్ 358/6, భారత్ 299/4, శ్రీలంక 289/7.[11]
- అత్యల్ప స్కోరు: 1998 సీజన్లో భారత్‌పై బంగ్లాదేశ్ 115 ఆలౌట్.
- సచిన్ టెండూల్కర్ (455 పరుగులు) వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించగా, మహ్మద్ అజారుద్దీన్ (302), విరాట్ కోహ్లీ (249) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- వెంకటేష్ ప్రసాద్ (15 వికెట్లు), అనిల్ కుంబ్లే (12), హర్భజన్ సింగ్ (9) బౌలింగులో రాణించారు.
T20I రికార్డులు
మార్చు- అత్యధిక స్కోరు: 2019 డిసెంబరు 11న వెస్టిండీస్‌పై భారత్ 240/3
- అత్యల్ప స్కోరు: 2017 డిసెంబరు 24న భారత్‌పై శ్రీలంక 135/7 (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3వ మ్యాచ్).
- ఇంగ్లండ్‌కు చెందిన జెఇ రూట్ (131) అత్యధిక పరుగులు సాధించగా, భారత్‌కు చెందిన వి కోహ్లీ (127), వెస్టిండీస్‌కు చెందిన సిహెచ్ గేల్ (104) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
స్టాండ్లు
మార్చు- సునీల్ గవాస్కర్ స్టాండ్
- నార్త్ స్టాండ్
- విజయ్ మర్చంట్ స్టాండ్
- సచిన్ టెండూల్కర్ స్టాండ్
- ఎమ్‌సిఏ స్టాండ్
- విఠల్ దివేచా స్టాండ్
- గర్వారే స్టాండ్
- గ్రాండ్ స్టాండ్
మీడియాలో
మార్చు- MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016) హిందీ సినిమా కోసం కొన్ని షాట్లు ఈ మైదానంలో చిత్రీకరించారు.
చిత్ర మాలిక
మార్చు-
వాంఖెడేలో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ XI పంజాబ్‌పై గెలిచినపుడు
-
2006 లో టెస్టు మ్యాచ్ జరుగుతూండగా.
-
నవీకరణకు ముందు - స్టాండ్లు, ఫ్లడ్‌లైట్ల టవరు ప్రేక్షకులు కూచునే చోటు నుండి
-
పాత ప్రవేశ ద్వారం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Janardhan, Arun (17 October 2013). "Sachin's last Test: Wankhede braces for ticket rush". livemint.com. Retrieved 18 March 2018.
- ↑ Caless, Kit (19 February 2017). "クリケットの街から眺めるインドサッカー界の未来" [The future of Indian football seen from the city of cricket]. vice.com (in జపనీస్). Vice Japan. Archived from the original on 28 January 2022. Retrieved 28 February 2023.
- ↑ "Cricinfo: Brabourne Stadium". ESPNcricinfo. Retrieved 5 March 2011.
- ↑ Inglis, Simon (25 May 2000). Sightlines: a stadium odyssey. Yellow Jersey. ISBN 978-0-224-05968-8. Retrieved 20 May 2012.
- ↑ "Wankhede Stadium - CricBlogg". Archived from the original on 30 December 2019.
- ↑ "Every T20 record at the Wankhede Stadium | Highest total to highest run-scorer". 13 October 2021.[permanent dead link]
- ↑ "MCA: Wankhede Stadium". mumbaicricket.com. Archived from the original on 31 May 2014. Retrieved 21 February 2012.
- ↑ "BJP govt's swearing-in at Wankhede costed Rs 98.33 lakh: RTI". Hindustan Times (in ఇంగ్లీష్). 2015-01-20. Retrieved 2022-09-18.
- ↑ "Records: Wankhede Stadium, Mumbai: Test matches: Most runs". ESPN Cricinfo. Retrieved 15 October 2016.
- ↑ "Records: Wankhede Stadium, Mumbai: Test matches: Most wickets". ESPN Cricinfo. Retrieved 15 October 2016.
- ↑ "Records: Wankhede Stadium, Mumbai: One-Day Internationals: Highest totals". ESPN Cricinfo. Retrieved 15 October 2016.