ఇస్మాయీల్

(ఇస్మాయిల్ నుండి దారిమార్పు చెందింది)

'ఇస్మాయీల్' ఇబ్రాహీం, 'హాజిరా ల కుమారుడు. భారతంలో కర్ణుడు లాంటి ప్రవక్త.ఇబ్రాహీం గారు దేవుని అనుమతితోనే ఇష్మాయిల్ హాజరా లను ఎడారిలో వదిలేస్తాడు. అల్లాహ్ ఇతని దప్పిక తీర్చటం కోసం హాజరా (హాగరు) ప్రార్థన విని నీళ్ళ ఊటను పుట్టిస్తాడు. అదే జమ్ జమ్ బావిగా స్థిరపడింది. ఇస్మాయిల్ను యుక్తవయసులో ఇబ్రాహీం దేవునికి బలి ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు ఇస్మాయిల్ కు బదులుగా ఒక గొర్రెను బలి ఇమ్మని చెబుతాడు. ఇతని సంతానం నుండే మహమ్మదు ప్రవక్త జన్మించారు. యూదులు క్రైస్తవులు బలి ఇవ్వటానికి తీసుకెళ్ళింది ఇస్ హాక్ (ఇస్సాకు) ను అంటారు. ఈ ఖుర్బానీ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈదుల్-అజ్ హా (బక్రీదు ) పండుగ జరుపుకుంటారు.

ఇవీ చూడండి

మార్చు