ఇస్మాయిల్ బేగ్ పేట
ఇస్మాయిల్ బేగ్ పేట కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామస్థులకు తమ గ్రామంలో పోలింగు కేంద్రం లేదు. వీరు వోటు వేయాలంటే, మరో శివారు గ్రామమైన నరసింహాపురం గ్రామానికి 3 కి.మీ. పైగా నడచి వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది. [1]
ఇస్మాయిల్ బేగ్ పేట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′10″N 81°01′29″E / 16.002859°N 81.024807°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుకొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం 79 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లాపరిషత్ హైస్కూల్, పిట్టల్లంక
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం, కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీరామాలయం
మార్చుఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ధనుర్మాసంలోనూ, వినాయకచవితి, మొదలగు పర్వదినాలలో గూడా ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలను హిందూసంప్రదాయాల ప్రకారం నిర్వహించుచున్నారు. కార్తీకమాసంలోనూ హరేరామనామ సప్తాహాలు నిర్వహించుచూ గ్రామాన్ని ఆధ్యాత్మకతకు నెలవుగా తీర్చిదిద్దినారు. [2] ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఆలయాన్ని పునర్నిర్మించారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమాలను 2016,ఫిబ్రవరి-24వ తేదీ బుధవారం సాయంత్రం, శ్రీ విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, వాస్తుహోమం పూజలతో ప్రారంభించారు. 25వ తేదీ గురువారం ఉదయం 7-52 గంటలకు విగ్రహ పునఃప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణమహోత్సవం నిర్వహించారు. [4] ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాలలో భాగంగా, 2017,ఫిబ్రవరి-25వతేదీ శనివారంనాడు హరేరామనామ ఏకాహం ప్రారంభించారు. 26వతేదీ ఆదివారంనాడు ముగింపు, హారతి కార్యక్రమాలను నిర్వహించెదరు. [5]
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుగ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
మార్చువరికూటి హనుమంతరావు, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు:- ఇతను 89 సంవత్సరాల వయసులో, 2015,ఆగస్టు-21వ తేదీనాడు స్వగృహంలో అనారోగ్యంతో అశువులుబాసినారు. [3]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-4; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చి-28; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-22; 3వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-26; 3వపేజీ. [5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఫిబ్రవరి-26; 1వపేజీ.