ప్రధాన మెనూను తెరువు

ఇస్లామీయ అఖీదా వ్యాసాల క్రమం:
అఖీదాహ్


Mosque02.svg
ఐదు స్థంభాలు (సున్నీ)

షహాద - విశ్వాస ప్రకటన
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - దానధర్మాలు (పేదలకు దానాలు)
సౌమ్ - రంజాన్ మాసంలో ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర

విశ్వాసాల ఆరు సూత్రాలు (సున్నీ ముస్లిం)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
ఇస్లామీయ ప్రవక్తలు
ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు
మలాయిక
యౌమల్ ఖియామ
మగ్‌ఫిరత్ (మోక్షము)

ధార్మిక సూత్రాలు (పండ్రెండుగురు)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
అదాలత్ - న్యాయం
నబువ్వత్ - ప్రవక్త పీఠం
ఇమామా - నాయకత్వం
యౌమల్ ఖియామ

మతావలంబీకరణ (పండ్రెండు ఇమామ్‌లు)

నమాజ్ - ప్రార్థనలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర
జకాత్ - దానధర్మాలు
ఖుమ్‌ - ఐదవవంతు పన్ను
జిహాద్ - సంఘర్షణ
న్యాయ ఉత్తర్వులు
చెడును త్యజించడం
తవల్లా - అహ్లె బైత్ తో ప్రేమ
తబర్రా - అహ్లె బైత్ శత్రువులతో విభేదన

ఏడు స్తంభాలు (ఇస్మాయిలీ)

వలాయ - సంరక్షణ
తహారా - పరిశుద్ధత
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - ప్రక్షాళణ, దానధర్మాలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా తీర్థయాత్ర
జిహాద్ - సంఘర్షణ

ఇతరములు

ఖారిజీలు ఇస్లాం ఆరవ స్తంభం.

ఇస్లామీయ ఐదు కలిమాలు (లేదా "ఐదు కలిమాలు") కలిమా అనగా వాక్కు. ఇస్లాంలో కలిమా అనగా విశ్వాసపు వాక్కు ప్రపంచమంతటా గల ముస్లింలందరూ ఏకీభవిస్తూ కలిగివున్న ఈమాన్ మరియు అఖీదాహ్. ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన ప్రథమ విశ్వాసం ఈ కలిమ. క్రింద ఇవ్వబడిన ఐదు కలిమాలలో మొదటి కలిమా షహాద, ఖురాన్ లోనూ హదీసుల లోనూ కనిపిస్తుంది. మిగతా నాలుగు కలిమాలు 'మొదటి కలిమా' ను పటిష్థం చేయుటకు ధార్మిక ఉలేమాలచే నిర్దేశింప బడినవి.

ఐదు కలిమాలు.

మొదటి కలిమాసవరించు

 
ఇస్లామీయ ప్రథమ స్తంభం (షహాద) చైనా లోని సుప్రసిధ్ధ జియాన్ మస్జిద్లో అరబ్బీలో వ్రాయబడ్డ కళాకృతి.

దీనిని స్వచ్ఛతా వాక్కు లేదా కలిమ-ఎ-తయ్యబా అంటారు.

 • أشهد أن] لا إله إلاَّ الله و [أشهد أن ] محمد رسول الله ]
 • తెలుగు లిప్యాంతరీకరణ :
 • అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్-న ముహమ్మదన్ రసూలుల్లాహ్
 • తెలుగార్థం :
 • నేను సాక్షీకరిస్తున్నాను, ఎవరూ లేరు కాని అల్లాహ్ వున్నాడని, నేను సాక్షీకరిస్తున్నాను, ముహమ్మద్ అల్లాహ్ చే పంపబడ్డ ప్రవక్తయని.

రెండవ కలిమాసవరించు

దీనిని సాక్షివాక్కు లేదాకలిమా-ఎ-షహాదత్ అంటారు.

 • اشْهَدُ انْ لّآ اِلهَ اِلَّا اللّهُ وَحْدَه لَا شَرِيْكَ لَه، وَ اَشْهَدُ اَنَّ مُحَمَّدً اعَبْدُه وَرَسُولُه
 • తెలుగు లిప్యాంతరీకరణ :
 • అష్ హదు అల్-లా ఇలాహ ఇల్లల్లాహు, వహదహు లా షరీక లహు, వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ
 • తెలుగుగార్థం :
 • నేను సాక్షీకరిస్తున్నారు, ఎవ్వరూ అర్హులు కారు ఆరాధనకు అల్లాహ్ తప్పితే, అతడు ఏకేశ్వరుడు, భాగస్వామిలేనివాడు, మరియు నేను సాక్షీకరిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క సేవకుడూ మరియు ప్రవక్తయని.

మూడవ కలిమసవరించు

దీనిని కీర్తి వాక్కు లేదా కలిమ-ఎ-తమ్ జీద్

 • سُبْحَان اللهِ وَ الْحَمْدُ لِلّهِ وَ لآ اِلهَ اِلّا اللّهُ، وَ اللّهُ اَكْبَرُ وَلا حَوْلَ وَلاَ قُوَّة ِ الَّا بِاللّهِ الْعَلِىّ الْعَظِيْم
 • తెలుగు లిప్యాంతరీకరణ :
 • సుబహానల్లాహి, వల్ హందు లిల్లాహి, వ ల ఇలాహ ఇల్లల్లాహు, వ అల్లాహు అక్బర్, వలా హౌలా వలా ఖువ్వతా ఇల్లా బిల్లాహిల్-అలియ్యిల్ అజీమ్
 • తెలుగార్థం :
*కీర్తనలూ అల్లాహ్ కే శ్లాఘనలూ అల్లాహ్ కే, అల్లాహ్ తప్పితే ఎవ్వరూ ఆరాధించుటకు అర్హులుకారు, పూజకు అర్హుడు అల్లాహ్ మాత్రమే, అల్లాహ్ పరమ శక్తిమంతుడు. ఏబలమూ, ఏశక్తీ అల్లాహ్ ను మించింది లేదు, అతడే బలశాలి అతడే ఘనశాలి.

నాలుగవ కలిమాసవరించు

దీనిని ఏకేశ్వరవాక్కు తౌహీద్ లేదా కలిమ-ఎ-తౌహీద్ అంటారు.

 • لا الهَ اِلَّا اللّهُ وَحْدَهُ لا شَرِيْكَ لَهْ، لَهُ الْمُلْكُ وَ لَهُ الْحَمْدُ يُحْى وَ يُمِيْتُ وَ هُوَحَىُّ لَّا يَمُوْتُ اَبَدًا اَبَدًا ذُو الْجَلَالِ وَ الْاِكْرَامِ بِيَدِهِ الْخَيْرُ وَهُوَ عَلى كُلِّ شَئ ٍ قَدِيْرٌ
 • తెలుగు లిప్యాంతరీకరణ :
 • లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు, యుహ్ యి, వ యుమీతు వహువ హయ్యుల్లా యమూతు అబదన్ ,అబద జుల్ జలాలి వల్ ఇక్రామ్, బియదిల్-ఖైర్, వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్.
 • తెలుగార్థం :
 • అల్లాహ్ తప్పితే వేరొకరు ఆరాధించుటకు అర్హులుగారు. అతనొక్కడే. అతనికి భాగస్వామి ఎవ్వరూ లేరు. సామ్రాజ్యం అతడికే, స్తోత్తములు అతనికే. అతడే జీవనాన్ని మృత్యువునూ నొసంగువాడు. అతడు సజీవి. అతడు చిరంజీవి. అతడే గౌరవాలూ ఔన్నత్యాలూ గల్గినవాడు. మంచి అతడిచేతుల్లోనేవుంది. అతడే మంచి. అతడే సకల శక్తిమంతుడూ.

ఐదవ కలిమాసవరించు

దీనిని అవిశ్వాస నిరాకరణా వాక్కు లేదా కలిమ-ఎ-రద్ద్-ఎ-కుఫ్ర్ అంటారు.

 • اَللّهُمََّ اِنّىْ اَعُوْدُ بِكَ مِنْ انْ اُشْرِكَ بِكَ شَيئًا وََّ اَنَا اَعْلَمُ بِه وَ اسْتَغْفِرُكَ لِمَا لا اَعْلَمُ بِه تُبْتُ عَنْهُ وَ تَبَرَّاْتُ مِنَ الْكُفْرِ وَ الشّرْكِ وَ الْكِذْبِ وَ الْغِيْبَةِ وَ الْبِدْعَةِ وَ النَّمِيْمَةِ وَ الْفَوَاحِشِ وَ الْبُهْتَانِ وَ الْمَعَاصِىْ كُلِّهَا وَ اَسْلَمْتُ وَ اَقُوْلُ لآ اِلهَ اِلَّا اللّهُ مُحَمَّدُ رَّسُوْلُ اللّهِ
 • తెలుగు లిప్యాంతరీకరణ :
 • అల్లాహుమ్మ ఇన్ని ఔజుబిక మిన్ అన్ ఉష్ రిక, బికా షయ్ అన్,వ్వ అనా ఆలము బిహీ వస్తఘఫిరుక లిమా లా ఆలము బిహీ తుబ్ తు అన్ హు వ తబర్రాతు మినల్-కుఫ్రి వష్ షిర్కి వల్ కిజ్ బి, వల్-ఘీబతి వల్-బిద్అతి వన్ నమీమాతి వల్ ఫవాహిషి వల్ బుహ్ తాన వల్ మఆసి కుల్లిహా వ అస్ లమ్ తు వ అఖూలు లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్-రసూలుల్-లాహ్.
 • తెలుగార్థం :
 • " ఓ అల్లా! నీ శరణుజొచ్చుచున్నాను, నేను స్పృహతో ఉన్నంతవరకూ నీతో ఎవరినీ భాగస్వామిని చేయకూడదని. నాకు తెలియనివాటికి నేను క్షమకోరుచున్నాను. నా అజ్ఞానానికి పశ్చాత్తాపపడుతున్నాను, అవిశ్వాస దాస్యసృంఖనాలనుండి విముక్తి పొందగోరుతున్నాను, నీ భాగస్వామిని ఎవర్నీచేయక, మరియు అన్ని పాపములనుండి. నేను నీ ఇక్షకర్పిస్తున్నాను. నేను విశ్వసిస్తున్నాను మరియు: నీవు తప్ప పూజార్హుడు ఎవ్వరూ లేరని, ముహమ్మదు (శాంతికలుగునుగాక) నీ ప్రవక్తయని.