అఖీదాహ్ (కొన్నిసార్లు : అఖీదా, అఖీదత్ అని కూడా పలుకుతారు) (అరబ్బీ : عقيدة) ఇస్లామీయ ధార్మిక విశ్వాస పద్ధతిని అఖీదాహ్ అంటారు. ఇస్లామీయ ధార్మిక విశ్వాసాన్నిగల్గిన సముదాయాన్నిగూడా అఖీదాహ్ అంటారు.

ఇస్లామీయ అఖీదా వ్యాసాల క్రమం:
అఖీదాహ్


ఐదు స్థంభాలు (సున్నీ)

షహాద - విశ్వాస ప్రకటన
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - దానధర్మాలు (పేదలకు దానాలు)
సౌమ్ - రంజాన్ మాసంలో ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర

విశ్వాసాల ఆరు సూత్రాలు (సున్నీ ముస్లిం)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
ఇస్లామీయ ప్రవక్తలు
ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు
మలాయిక
యౌమల్ ఖియామ
మగ్‌ఫిరత్ (మోక్షము)

ధార్మిక సూత్రాలు (పండ్రెండుగురు)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
అదాలత్ - న్యాయం
నబువ్వత్ - ప్రవక్త పీఠం
ఇమామా - నాయకత్వం
యౌమల్ ఖియామ

మతావలంబీకరణ (పండ్రెండు ఇమామ్‌లు)

నమాజ్ - ప్రార్థనలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర
జకాత్ - దానధర్మాలు
ఖుమ్‌ - ఐదవవంతు పన్ను
జిహాద్ - సంఘర్షణ
న్యాయ ఉత్తర్వులు
చెడును త్యజించడం
తవల్లా - అహ్లె బైత్ తో ప్రేమ
తబర్రా - అహ్లె బైత్ శత్రువులతో విభేదన

ఏడు స్తంభాలు (ఇస్మాయిలీ)

వలాయ - సంరక్షణ
తహారా - పరిశుద్ధత
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - ప్రక్షాళణ, దానధర్మాలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా తీర్థయాత్ర
జిహాద్ - సంఘర్షణ

ఇతరములు

ఖారిజీలు ఇస్లాం ఆరవ స్తంభం.

పరిచయము

మార్చు

ప్రపంచంలోని అన్ని ముస్లిం సముదాయాలూ ఈ అఖీదాను గలిగివున్నాయి. అందరూ ఏకగ్రీవంగా ఖురాన్ సూచించిన విశ్వాసమార్గాన్ని తు.చ. తప్పకుండా శిరసా ఆమోదించే విషయమిది. షియా, సున్నీలు పరస్పరం విరుద్ధంగా కనబడుతారు. కానీ "ఈమాన్", "అఖీదా" విషయంలో ఏలాంటి పొరపొచ్ఛాలు లేకుండా ఆమోదిస్తారు. ఉదాహరణకు అల్లాహ్, మలాయికాల స్థితిపై భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాని, అల్లాహ్, మలాయికాల ఉనికిపై ఏలాంటి సందేహాలు ఉండవు.

 
మస్జిద్ లో ఉపవాస ముగింపు

ఆరు విశ్వాసాంగాలు

మార్చు

సహీ ముస్లిం, సహీ బుఖారి హదీసుల ప్రకారము మహమ్మదు ప్రవక్త ప్రవచించారు "ఈమాన్ అనునది ఈ విషయాలపై స్థిరమైన అఖీదాహ్ ను కలిగివుండడమే, విశ్వాసం అల్లాహ్ పై, అతడి మలాయిక (దూతలపై), అతడిచే అవతరింపబడ్డ గ్రంధాలు పై (ఖురాన్, జబూర్, తౌరాత్, ఇంజీల్ , ఇతర సహీఫాలు), అతడి ప్రవక్తలపై, ఖయామత్ పై , అల్లాహ్ చే వ్రాయబడ్డ తఖ్దీర్ (విధి) మంచిదైననూ, గాకున్ననూ."

ఆరు విశ్వాసాంగాలు

మార్చు
  1. అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ ఒక్కడే పూజింపబడుటకు సరియైనవాడు. (తౌహీద్).
  2. ప్రవక్తలపై విశ్వాసం. అల్లాహ్ చే పంపబడ్డ అందరు ప్రవక్తలపై విశ్వాసం.
  3. మలాయిక పై విశ్వాసం. అల్లాహ్ దూతలపై విశ్వాసం.
  4. అవతరింపబడ్డ గ్రంధాలపై విశ్వాసం. అల్లాహ్ చే అవతరింపజేయబడిన గ్రంధాలపై విశ్వాసం. (ఖురాన్ తో సహా)
  5. యౌమ్-అల్-ఖియామ పై విశ్వాసం. ఖయామత్ పై విశ్వాసం. మరణం తరువాత జీవితంపై విశ్వాసం.
  6. తఖ్దీర్ పై విశ్వాసం. మంచిదైననూ గాకున్ననూ విధిపై విశ్వాసం.

సున్నీ, షియా ల అఖీదాహ్ ఈమాన్ పై, ఈమాన్ సదరు విశ్వాసాంగాలపై ఆధారపడియున్నది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=అఖీదాహ్&oldid=3262144" నుండి వెలికితీశారు