ఇ.మొయిదు మౌలవీ

స్వాతంత్ర సమరయోధుడు

ఇ. మొయిదు మౌలవి (1886–1995) భారత జాతీయ కాంగ్రెస్ (INC) నాయకుడు, [1] ఇస్లామిక్ పండితుడు. సలాఫీ ఉద్యమాల సంస్కర్తలలో ఒకరు, పండితుడు, విద్యావేత్త. [2] మౌలవి మలబార్ జిల్లాలో (ప్రస్తుత మలప్పురం జిల్లా), పొన్నానిలోని మారంచెరిలో జన్మించాడు. కేరళలో ఇస్లాహీ ఉద్యమానికి మద్దతునిచ్చాడు. KM మౌలవి, సయ్యద్ సనావుల్లా మక్తి తంగల్, మహమ్మద్ అబ్దుల్ రహిమాన్, KM సీతీ సాహిబ్ వంటి నాయకులతో కలసి నడిచాడు.[3]

జీవిత విశేషాలు మార్చు

ఇ.మొయిదు మౌలవి 1886 లో మలయంకులతేల్ మరక్కర్ ముస్లియార్ మారంచెరి కుటుంబంలో జన్మించాడు. అతను పొన్నానికి చెందిన పండితుడు, స్వాతంత్ర్య ఉద్యమకారుడూ అయిన బిదాత్‌కు శత్రువు. కోడెంచెర్రి దార్స్ మత పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసాక, వజక్కాడ్ వెళ్ళి అక్కడ దారుల్ ఉలూం అరబిక్ కాలేజీలో హాజీ చిలాలకాత్ కున్హామహమ్మద్ వద్ద చదువుకున్నాడు. విద్యాభ్యాసం అయ్యాక, 1919 లో భారత జాతీయోద్యమంలో చేరాడు. నైపుణ్యం కలిగిన వక్తగా, నిర్వాహకుడిగా, అతను మహమ్మద్ అబ్దుల్ రహిమాన్‌ను భారత స్వాతంత్ర్య ఉద్యమంలోకి లాగడంలో కీలక పాత్ర పోషించాడు. మాప్పిల సమాజంలో సంస్కరణలు తెచ్చి వారిని భారత జాతీయోద్యమంలో పాల్గొనేలా చేసేందుకు ఉద్దేశించి స్థాపించిన మజ్లిస్ఉ ఉల్‌ ఉలేమా సంస్థకు అతను వ్యవస్థాపక కార్యదర్శి. 1921 నాటి ఖిలాఫత్ ఉద్యమంలో మౌలవి అరెస్టై, కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. 1930లో పయ్యన్నూరు ఉప్పు సత్యాగ్రహ పోరాటంలో పాల్గొన్నందుకు మరో 9 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు అతనికి మరోసారి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1947లో ఆయన విడుదలయ్యాడు. [4] [5]

మొయిదు మౌలవి కెపిసిసి వర్కింగ్ కమిటీ సభ్యుడుగా, ఎఐసిసి సభ్యుడుగా పనిచేశాడు. 1938లో అండతోడ్ ఫర్కా నుండి మలబార్ జిల్లా బోర్డుకు ఎన్నికయ్యాడు. అతను కోజికోడ్ మునిసిపాలిటీ సభ్యుడుగా కూడా పనిచేసాడు. అతన్ని పార్లమెంటు సభ్యత్వానికి ప్రతిపాదించగా, దాన్ని తిరస్కరించి రాజకీయాల నుండి వైదొలగి, సంఘంలో విద్య, సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టాడు.

ఇ మొయిదు మౌలవి, మహ్మద్ అబ్దుల్ రహిమాన్‌తో కలిసి 1929-1939 సమయంలో కాలికట్ నుండి అల్-అమీన్ వార్తాపత్రికను నడిపాడు. తర్వాత బ్రిటిష్ అధికారులు దీనిని మూసివేశారు. [6]

పుస్తకాలు మార్చు

అతని ఆత్మకథ 1981 లో మౌలవీయుడే ఆత్మకథగా ప్రచురించబడింది. [7] అతను తన సన్నిహిత సహచరుడు మహ్మద్ అబ్దుల్ రహిమాన్ జీవిత చరిత్రను ఎంటే కుట్టుకారన్ (నా స్నేహితుడు) అనే పేరుతో రాశాడు. [8] [9]

మౌలవి 1995లో తన 109 వ ఏట మరణించాడు. కోజికోడ్‌లో అతని జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. [10] పాత్రికేయుడు, రచయిత M రషీద్ అతని కుమారుడు. [11]

ప్రస్తావనలు మార్చు

  1. "'Nationalism now linked to mob psychology'". thehindu.com. The Hindu. 8 June 2017. Retrieved 12 March 2020.
  2. This movement was led by progressive leaders like Vakkom Abdul Khader Moulavi, freedom fighters Mohammed Abdurahiman sahib, E Moidu Moulavi, K M Seethi Sahib, K M Maulavi etc. and supported by political leaders like C H Muhammad Koya. People from all quarters should come forward to support this genuine Islamic entity of Kerala..."
  3. Educational Empowerment of Kerala Muslims: A Socio-historical ... 2007..."
  4. "Malappuram district Official portal - Famous personalities - E Moidu Moulavi (Malayalam)". Archived from the original on 21 July 2011. Retrieved 28 November 2010.
  5. Pg 361, Who is who of freedom fighters in Kerala - K. Karunakaran Nair, 1975
  6. Pg 474, The Indian economic and social history review, Volume 26, Delhi School of Economics, Vikas Pub. House, 1989
  7. No 117, www.keralahistory.ac.in/ListofBiographiesinKCHRarchives.pdf
  8. Vasanthi V. Women in public life in Malabar 1900-1957 (PDF). p. 252. Retrieved 14 November 2019.
  9. Pg 465, Roland Miller, The Encyclopaedia of Islam, Vol VI, Brill 1988
  10. "Malappuram district Official portal - Famous personalities - E Moidu Moulavi (Malayalam)". Archived from the original on 21 July 2011. Retrieved 28 November 2010.
  11. Pg 85, Muhammad Abdurahman, NP Chekkutty, National Book Trust, 2006