మలప్పురం

కేరళ రాష్ట్రం లోని ఒక నగరం

మలప్పురం (మలపురం) భారతదేశం, కేరళ రాష్ట్రం, మలప్పురం జిల్లా లోని ఒక నగరం.[8] ఇది కాలికట్ - మద్రాసు రహదారిపై 12 కి.మీ.దూరంలో, మంజేరికి నైరుతి-పశ్చిమంగా 52 కి.మీ.దూరంలో ఉంది. మలప్పురం జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉంది. పూర్వ కాలంలో, మలప్పురం యూరోపియన్, బ్రిటీష్ దళాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. తరువాత అది మలబార్ స్పెషల్ పోలీస్ ప్రధాన కార్యాలయంగా మారింది. [9] ఇది పరిసర పట్టణ ప్రాంతాలతో సహా 158.20 కి.మీ2 (61.08 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.1970లో ఏర్పడిన జిల్లాలోని మొదటి పురపాలక సంఘం.మలప్పురం మలప్పురం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.ఇది 40 ఎన్నికల వార్డులుగా విభజించబడింది.నగరంలో జనసాంద్రత 1,742 చదరపు కిలోమీటరుకు (4,510 చదరపు మైలుకు) 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో కొచ్చి, కాలికట్, త్రిస్సూర్ పట్టణ ప్రాంతాల తర్వాత మలప్పురం మహానగర ప్రాంతం నాల్గవ అతిపెద్ద పట్టణ సముదాయం.ఇది 1.7 మిలియన్ జనాభాతో భారతదేశంలో 26వ అతి పెద్దనగరంగా నమోదైంది.[10] 2020 జనవరిలో పట్టణ ప్రాంత వృద్ధి ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన సర్వే ప్రకారం 2015, 2020 మధ్య 44.1% పట్టణ వృద్ధితో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తించబడింది .[11] [12]

Malappuram
Malapuram
City
An aerial view of Downhill, Malappuram (Photographed in 2016)
An aerial view of Downhill, Malappuram (Photographed in 2016)
Nickname(s): 
City of Hills, Soccer Capital[1]/ Mecca of Football
Malappuram is located in Kerala
Malappuram
Malappuram
location in Kerala,India
Malappuram is located in India
Malappuram
Malappuram
Malappuram (India)
Malappuram is located in Asia
Malappuram
Malappuram
Malappuram (Asia)
Malappuram is located in Earth
Malappuram
Malappuram
Malappuram (Earth)
Coordinates: 11°02′28″N 76°04′59″E / 11.041°N 76.083°E / 11.041; 76.083
Country India
StateKerala
DistrictMalappuram
Government
 • TypeMunicipal Council
 • BodyMalappuram Municipality
 • ChairmanMujeeb Kaderi
 • Deputy ChairpersonPerumpally Said
విస్తీర్ణం
 • City58.20 కి.మీ2 (22.47 చ. మై)
జనాభా
 (2011)[4]
 • City1,01,386 [2]
 • జనసాంద్రత1,743/కి.మీ2 (4,510/చ. మై.)
 • Metro17,29,522
DemonymMalappuramite[6]
Language
 • OfficialMalayalam.[7]
Time zoneUTC+౦5:30 (IST)
PIN
676505
Telephone code0483
Vehicle registrationKL-10
Literacy96.47%
ClimateAm/Aw (Köppen)
Precipitation3,100 మిల్లీమీటర్లు (120 అం.)
Avg. summer temperature39 °C (102 °F)
Avg. winter temperature20 °C (68 °F)

భౌగోళికం

మార్చు

మలప్పురం రాష్ట్రంలోని మధ్య భూభాగంలో ఉంది. పేరు సూచించినట్లుగా, ఇది పచ్చదనంతో కూడిన చిన్న పర్వతాలతో కూడి ఉంటుంది. కేరళలోని ప్రధాన నది కదలుండి పూజ నగరం చుట్టూ ప్రవహిస్తోంది. [13] మలప్పురం కాలికట్‌కు ఆగ్నేయంగా 54 కిమీ, పాలక్కాడ్‌కు వాయువ్యంగా 90 కిమీ దూరంలో ఉంది. [14] నగరం లోని మొత్తం నివాసితులకు ఉచిత వై.ఫైవ్. కనెక్టివిటీని అందించిన మొదటి భారతీయ పురపాలక సంఘం. [15] [16] ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ సర్టిఫికేట్ సాధించిన మొదటి భారతీయ పురపాలక సంఘం. [17] రాష్ట్రం రాష్ట్రంలో మొట్టమొదటి ఫిర్యాదు రహిత పురపాలక సంఘం కూడా ఇదే. [18]

పరిశుభ్రత అవార్డులు

మార్చు

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గత చరిత్ర ఉన్న రాష్ట్రంలోని కొన్ని పురపాలక సంఘాలలో మలప్పురం ఒకటి. 2011లో రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రత, ఆరోగ్యాన్ని కాపాడటంలో రెండవ 'ఉత్తమ' పురపాలకసంఘంగా గుర్తింపు పొందింది [19] 2019లో స్వచ్ఛతా ఎక్సలెన్స్ అవార్డుల కోసం 2019లో భారత ప్రభుత్వంచే రెండవ బహుమతి ద్వారా పురపాలకసంఘ నిజాయితీ ప్రయత్నాలను గుర్తించింది. [20] మలప్పురం జిల్లాలోనే అతిపెద్ద సంభావ్యత ఉంది.

రవాణా సౌకర్యం

మార్చు

ఇతర జిల్లా ప్రధాన కార్యాలయాల మాదిరిగా కాకుండా, మలప్పురం ఉత్తర-దక్షిణంతో పాటు పశ్చిమ-తూర్పు రవాణాలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇది జాతీయ రహదారి లేదా రాష్ట్ర రహదారి ద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరికీ నగరాన్ని అందుబాటులోకి తెచ్చింది. [21]

వ్యుత్పత్తి శాస్త్రం

మార్చు

మలప్పురం అనే పదానికి అర్థం " కొండల పైన ఉన్నప్రదేశం " లేదా కేవలం " కొండ శిఖరం " సాధారణ భౌగోళిక లక్షణాల నుండి నగరం ఉద్భవించింది. [22] [23] [24]

జనాభా గణంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నగరంలో మొత్తం జనాభా 101,386, అందులో 48,957 మంది పురుషులుకాగా, 52,429 మంది స్త్రీలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు పరిధిలో ఉన్న జనాభా 14,629. షెడ్యూల్డ్ కులాలు జనాభా 5,323 మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 77 మంది ఉన్నారు. నగర పరిధిలో 19785 గృహాలు ఉన్నాయి [4]

చరిత్ర

మార్చు

మలప్పురం పురాతన కాలం నుండి సైనిక, పరిపాలనా ప్రధాన కార్యాలయంగా ఉంది. అయినప్పటికీ నగరం అనేక పురాతన చరిత్రలు నమోదు కాలేదు. అయితే, కొన్ని పూర్వ-చారిత్రక అవశేషాలు ఉన్నాయి, ప్రత్యేకించి ఊరకం, మేల్మూరి, పొన్మల, వెంగర నగరాల లోని మొదలైన కొన్ని ప్రాంతాలలో చెక్కిన రాతి గుహలు కనుగొనబడ్డాయి.[25] వలియంగడి, కూటిలంగడి, పల్లిపురం మొదలైన ప్రాంతాలు మలప్పురం జైన-బౌద్ధ చరిత్రను సూచిస్తాయి. ముఖ్యంగా మలప్పురం లోని ఊరకం కొండ వద్ద 1500 సంవత్సరాల క్రిందట (2020 నాటికి) సముద్ర మట్టం కంటే 2000 అడుగుల ఎక్కువ ఎత్తులో నిర్మించిన పురాతన జైన దేవాలయం నిస్సందేహంగా రుజువు చేస్తుంది.[26] సంగం కాలంలో, ఎరనాడన్ మలప్పురం చేరా సామ్రాజ్యం కింద ఉండేది. పత్తర్ కడవ్, పనక్కడ్ మొదలైన ప్రదేశాలు బహుశా అక్కడ నివసించిన పత్తర్లు, పనార్ల నుండి ఉద్భవించి ఉండవచ్చు. కానీ సంగమ యుగంలో లేదా సంగం అనంతర కాలంలో ప్రజల జీవితం, సంస్కృతి గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. [27]

ఎరనాడ్‌ను పొరుగున ఉన్న వల్లువనాడ్‌ రాజ్యం లోని వెల్లోడిలు, నెడుంగనాడ్‌లోని నెడుంగడిల మాదిరిగానే ఎరాడిస్ అని పిలువబడే సామంతన్ నాయర్ వంశం పాలించింది. ఎరనాడ్ పాలకులను ఎరల్‌ప్పాడ్ /ఎరాడి అనే బిరుదుతో పిలుస్తారు. మలప్పురంలో లభించిన పురావస్తు అవశేషాలలో జామోరిన్ పాలన తూర్పు శాఖకు చెందిన రాజభవనాల అవశేషాలు ఉన్నాయి. మలప్పురం ఎరనాడ్ ప్రాంతంలోని జామోరిన్ సైనిక ప్రధాన కార్యాలయం.జామోరిన్‌లు మలప్పురంపై ఆధిపత్యం చెలాయించారు.వారి అధిపతి పారా నంబి, మలప్పురం డౌన్‌హిల్ (కొత్తప్పాడి) వద్ద ప్రధాన కార్యాలయంతో ప్రారంభ రోజుల్లో ఈ ప్రాంతాన్ని పాలించాడు.[28] తరువాతి జామోరిన్‌ల పూర్వీకులు పూర్వపు మలప్పురం పాలకుల వివరాలు భాస్కర రవి వర్మన్ (సా. శ. 1000) యూదు రాగి ఫలకాలలో వీర రాఘవ చక్రవర్తి (సా.శ. 1225) కొట్టాయం రాగి ఫలకాలలో ఉన్నాయి. నగరం తరువాతి చరిత్ర జామోరిన్ పాలన చరిత్రతో ముడిపడి ఉంది. [29]

వలసరాజ్యాల కాలంలో,మలప్పురం యూరోపియన్, బ్రిటీష్ దళాలకు ప్రధాన కార్యాలయంగా ఉంది.ఇది 1885లో ఏర్పడిన మలప్పురం మలబార్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ [30] ప్రధాన కార్యాలయంగా మారింది. మలప్పురం కొండ, కదలుండి నది ఒడ్డున తమ బలగాలను నిలబెట్టడానికి, అక్కడ ఒకప్పుడు టిప్పు కోట ఉండేది. ప్రధాన భవనం సివిల్ కార్యాలయం ఇప్పుడు మలప్పురం జిల్లా పరిపాలనా స్థానంగా మారింది. [31] [32] మలప్పురం పూర్వపు మలబార్ జిల్లా లోని ఐదు రెవెన్యూ విభాగాలలో ఒకదాని ప్రధాన కార్యాలయంగా మారింది. [33] నగరంలోని వలియంగడిలో 1916లో నిర్మించిన బావి ఒక గోడపై మలప్పురం తాలూకా బోర్డు శాసనం ఇప్పటికీ చూడవచ్చు. [34] [35] మలబార్ జిల్లా రెవెన్యూ డివిజనల్ మేజిస్ట్రేట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలు మలప్పురంలో ఉన్నాయి. [36]

పౌర పరిపాలన

మార్చు

ప్రధాన కార్యాలయ నగరంగా, మలప్పురం జిల్లా కలెక్టరేట్, జిల్లా ఖజానా, ఆర్.టి.ఒ. కార్యాలయం పి.డబ్ల్యు.డి. విభాగ కార్యాలయం, జిల్లా పంచాయతీ, పట్టణ ప్రణాళిక కార్యాలయం, జిల్లా వైద్య కార్యాలయం జిల్లాలోని మొదలైన ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు, ఇతర ప్రవేట్ సంస్థల కార్యాలయాలు కలిగిఉన్నాయి. మునిసిపల్ ఛైర్మన్ నేతృత్వంలోని మలప్పురం పురపాలక సంఘం ద్వారా నగర పరిపాలన సాగుతుంది. [37] మలప్పురం పురపాలకసంఘానికి ఎన్నికలు 2015లో జరిగాయి. [38]

శాంతి భద్రతలు

మార్చు

మలప్పురం డీఎస్పీ నేతృత్వంలో నగర పోలీసులు ఉంటారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం మలప్పురంలో ఉంది. సాధారణ శాంతిభద్రతలతో పాటు,నగర పోలీసులలో మలప్పురం ట్రాఫిక్ పోలీస్,మలప్పురం వనిత పోలీస్ స్టేషన్, [39] జిల్లాలో ఉన్న ఏకైక మహిళా స్టేషన్, [40] క్రైమ్ బ్రాంచ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఉమెన్స్ సెల్, నార్కోటిక్స్ సెల్, మలబార్ స్పెషల్ పోలీస్, సాయుధ పోలీసు శిబిరం, జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇవి కాకుండా 24/7 హైవే పోలీస్ పెట్రోలింగ్ అలాగే మలప్పురం పోలీస్ డివిజన్ పరిధిలో ప్రత్యేక పింక్ పెట్రోలింగ్ (డయల్-1515) మహిళలకు సేవలు అందిస్తుంది. [41]

విద్యా సౌకర్యాలు

మార్చు

నగరంలో పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్య వరకు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయ, మలప్పురం, జవహర్ నవోదయ విద్యాలయ, మలప్పురం, మలబార్ స్పెషల్ పోలీస్ ఎచ్.ఎస్.ఎస్, ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాల, శ్రీ అరుణోదయ విద్యా నికేతన్ మొదలైన కొన్ని పాఠశాలలను పేర్కొనవచ్చు. ప్రభుత్వ కళాశాల, మలప్పురం, జిల్లాలో 1972లో ప్రారంభమైన పురాతన కళాశాల. [42] కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ మలప్పురం 1987లో ప్రారంభమైంది [43] ప్రభుత్వ మహిళా కళాశాల, మలప్పురం [44] 2015 సంవత్సరంలో ప్రారంభమై, అనేక ఇతర ప్రైవేట్ కళాశాలలతో పాటు ఉన్నత విద్యా ప్రయోజనాల సేవలు అందిస్తోంది. జిల్లాలోని రెండు న్యాయ కళాశాలల్లో ఒకటి నగరంలో ఉంది. [45] రిజినల్ డైరెక్టరేట్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ [46], స్టేట్ ఓపెన్ స్కూల్ ప్రాంతీయ కార్యాలయం (మలబార్) [47] సివిల్ స్టేషన్ లోపల నగరంలో ఉన్నాయి.

ఇవి కూడా చూడు

మార్చు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Soccer Capital". The Indian Express.
  2. "Malappuram census handbook" (PDF). censusindia.gov.in.
  3. "Malappuram census handbook" (PDF). censusindia.gov.in.
  4. 4.0 4.1 "Census of India: Malappuram". www.censusindia.gov.in. Retrieved 23 January 2020.
  5. "Urban Agglomerations/Cities having population 1 million and above" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 19 November 2011.
  6. "Malappuram's first book stall bids adieu". The Hindu. 19 December 2018. Retrieved 4 July 2020.
  7. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 29 March 2019.
  8. "Revised List of Classification Cities for HRA of central government employees - Govt. Employees India". 2 June 2015. Archived from the original on 25 ఆగస్టు 2016. Retrieved 27 మే 2023.
  9. "History | Welcome to Malappuram | India". Retrieved 2023-05-27.
  10. "Trends of urbanisation in Kerala" (PDF). Census of India.
  11. "3 of world's 10 fastest-growing urban areas are in Kerala: Economist ranking". 8 January 2020. Retrieved 13 January 2020.
  12. "Malappuram is world's fastest-growing city; Kozhikode, Kollam also in top 10". www.newindianexpress.com.
  13. "Malappuram District Profile". Malappuram.
  14. "malappuram Web". Retrieved 28 July 2015.
  15. "Malappuram of Kerala to log on to free Wi-Fi". www.thehindu.com. 30 July 2015. Retrieved 1 July 2020.
  16. "Malappuram Municipality To Be India's First To Offer Free Wi-Fi Connectivity". thelogicalindian.com. 22 August 2015. Archived from the original on 1 జూలై 2020. Retrieved 1 July 2020.
  17. Staff Reporter (24 February 2014). "First-in-India ISO tag for Malappuram". The Hindu. Retrieved 29 July 2020.
  18. Abdul Latheef, Naha (2 November 2014). "Malappuram aims to be complaint-free". The Hindu. Retrieved 29 July 2020.
  19. Sivaramakrishnan, K. C. (4 August 2011). Re-visioning Indian Cities: The Urban Renewal Mission (in ఇంగ్లీష్). SAGE Publishing India. ISBN 9788132119470.
  20. "Amrut Cities--Municipal Corporations of Raigarh, Ambikapur, and Kumbakonam Bag Top Swachhata Excellence Awards". pib.gov.in. Retrieved 24 August 2019.
  21. Work Study Report on Police Department 2013. P & A R (AR-VII) DEPARTMENT, Government of Kerala. 2013. p. 77.
  22. "District Profile". spb.kerala.gov.in. Archived from the original on 4 సెప్టెంబరు 2019. Retrieved 24 August 2019.
  23. Travel Guide from native planet
  24. Cultural Malappuram | Financial Express
  25. "History of Malappuram" (PDF). censusindia.gov.in.
  26. "Oorakam Mala". www.cpreecenvis.nic.in. Retrieved 24 August 2019.
  27. DISTRICT CENSUS HANDBOOK. DIRECTORATE OF CENSUS OPERATIONS, KERALA. 2011. p. 15.
  28. Logan, William. MALABAR MANUAL: With Commentary by VED from VICTORIA INSTITUTIONS (Volume 2 ed.). VICTORIA INSTITUTIONS, Aaradhana, DEVERKOVIL 673508. Retrieved 12 July 2020.
  29. PART XII-A (2011). DISTRICT CENSUS HANDBOOK MALAPPURAM. DIRECTORATE OF CENSUS OPERATIONS, Kerala. p. 15.
  30. C.A., Innes (1908). Madras District Gazetteers: Malabar and Anjengo. Government Press, Madras. p. 371. Retrieved 30 September 2020.
  31. "Malappuram British History". Archived from the original on 2020-10-10. Retrieved 2023-05-27.
  32. DISTRICT CENSUS HANDBOOK. DIRECTORATE OF CENSUS OPERATIONS, KERALA. 2011. p. 15.
  33. 1951 census handbook - Malabar district (PDF). Chennai: Government of Madras. 1953. p. 1.
  34. Celebrating centenary of a public well
  35. Deshabhimani - 100 year old well
  36. C.A., Innes (1908). Madras District Gazetteers: Malabar and Anjengo. Government Press, Madras. p. 416. Retrieved 30 September 2020.
  37. Staff Reporter (27 May 2020). "New Malappuram Collector takes charge". Keralakoumudi. Retrieved 1 July 2020.
  38. "Malappuram Municipality election 2015". lbtrend. Archived from the original on 13 December 2020. Retrieved 11 December 2020.
  39. Malappuram Police
  40. Malappuram Vanitha Station Inaugurated
  41. http://www.malappurampolice.gov.in/mlpol/ Archived 2016-08-13 at the Wayback Machine [bare URL]
  42. "History – Govt College Malappuram".
  43. "CAS Malappuram". Archived from the original on 2023-05-27. Retrieved 2023-05-27.
  44. "GWC Malappuram". Archived from the original on 2023-05-27. Retrieved 2023-05-27.
  45. "MCT Law College Address". Archived from the original on 2020-10-27. Retrieved 2023-05-27.
  46. DHSE Portal
  47. "SCOLE Kerala". Archived from the original on 2021-01-26. Retrieved 2023-05-27.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మలప్పురం&oldid=4361085" నుండి వెలికితీశారు