ఈడిగ ఆంజనేయ గౌడ్

ఈడిగ ఆంజనేయ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేశాడు.[1] ఆంజనేయ గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (సాట్స్‌) ఛైర్మన్‌గా నియమిస్తూ 2023 జనవరి 2న రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.[2]  

ఈడిగ ఆంజనేయ గౌడ్
ఈడిగ ఆంజనేయ గౌడ్


తెలంగాణ స్పొర్ట్ అథారిటీ (సాట్స్‌) ఛైర్మెన్‌
పదవీ కాలం
2023 జనవరి 2 – ప్రస్తుతం

పదవీ కాలం
2016 – 2019

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 15
ఆలూరు గ్రామం, గట్టు మండలం, జోగులాంబ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నర్సమ్మ, చంద్రన్న గౌడ్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం సవరించు

ఆంజనేయ గౌడ్ తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లా,గట్టు మండలం, ఆలూరు గ్రామంలో ఏప్రిల్ 15న జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. [3]

రాజకీయ జీవితం సవరించు

ఆంజనేయ గౌడ్ విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా పనిచేశాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటిలో చేరిన తరువాత తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ తెలంగాణ బిసి ఫోరం అధ్యక్షునిగా, తెలుగుదేశం పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్‌ఎస్‌ఎఫ్) లో వివిధ హోదాల్లో పనిచేసి టిఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగాడు. ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఓయూలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

ఆంజనేయ గౌడ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా 2016 నుండి 2019 వరకు పనిచేశాడు.[4][5] ఆయన ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీ ఆదేశాలమేరకు గద్వాల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి అనేక సామజిక కార్యక్రమాలు నిర్వహించి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలకంగా పని చేశాడు.

ఆంజనేయ గౌడ్ పార్టీకి చేసిన సేవలకుగాను ఆయనను స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ (సాట్స్‌) చైర్మన్‌గా నియమిస్తూ 2023 జనవరి 2న రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయగా ఆయన 2023 జనవరి 5న క్రీడాప్రాథికార సంస్థ (సాట్స్‌) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[6]

మూలాలు సవరించు

  1. Deccan Chronicle (23 October 2016). "Eediga Anjaneya Goud appointed as Telangana BC Commission Member" (in ఇంగ్లీష్). Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  2. Mana Telangana (2 January 2023). "తెలంగాణ స్పొర్ట్ అథారిటీ ఛైర్మెన్‌గా ఈడిగ ఆంజనేయ గౌడ్". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
  3. Namasthe Telangana (21 April 2022). "నిజం తోడుగా యువజనం". www.ntnews.com. Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  4. నమస్తే తెలంగాణ (22 October 2016). "బీసీ కమిషన్ సభ్యుడిగా ఆంజనేయ గౌడ్". Archived from the original on 23 October 2016. Retrieved 22 October 2016.
  5. Mana Telangana (22 October 2016). "బీసీ కమిషన్ సభ్యుడిగా ఈడిగ ఆంజనేయ గౌడ్". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  6. Eenadu (12 January 2023). "సాట్స్‌, ఐడీసీ ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 12 January 2023. Retrieved 12 January 2023.