ఈద్గాహ్
ఈద్ గాహ్ లేదా ఈద్గాహ్ (Urdu: عید گاہ) ఒక గాలి బయట మైదాన స్థలంలోని మస్జిద్, సాధారణంగా ఇది ఊరి బయట వుంటుంది. దీనిని ఈద్ (పండుగ), గాహ్ (ప్రదేశం), ఈద్ సమయాన సలాహ్ (నమాజు) లేదా ఈద్ నమాజ్ చేయుటకు ఉపయోగిస్తారు.[1]
మహమ్మదు ప్రవక్త దీనిని ఆచరణలోకి తీసుకు వచ్చారు.sawa ఈద్ నమాజ్ ఊరి బయట చదివే రివాజు. ఈద్ నమాజ్ ఊరి బయట చదవడం సున్నహ్ కూడానూ.[2]
ప్రప్రథమ ఈద్ గాహ్ మదీనా నగరపు పొలిమేరల్లో యుండేది, ఇది మస్జిద్-ఎ-నబవి నుండి దాదాపు 1000 అంగల దూరంలో వుండేది.[3], [4]
సంవత్సరంలో రెండు ప్రముఖ పండుగలైన రంజాన్, బక్రీదు ల సామూహిక నమాజు ఈ ఈద్‌గాహ్ లో ఆచరించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో వీటినే "నమాజు కట్ట" అని కూడా వ్యవహరిస్తూ వుంటారు. పండుగలు కాని సమయాలలో ఈ ఈద్గాహ్ ను ఖాళీగా వుంచడమో లేక ధార్మిక కార్యక్రమాల ఉపయోగానికో ఉపయోగిస్తుంటారు.
పండుగల రోజున ఊరినుండి ఈద్గాహ్ కు బయలుదేరే ముస్లిం సమూహం అల్లాహ్ స్తోత్రములు "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్" (అల్లాహ్ ఘనమైన వాడు, ఒక్కడే దేవుడు, అతడే అల్లాహ్, మేమంతా నీనామమే కీర్తిస్తాము) అని పలుకుతూ బయలుదేరి, ఈద్గాహ్ కు చేరేంతవరకూ పఠిస్తూనే వుంటారు.
- సున్నహ్ ప్రకారం ఈద్ నమాజ్ లేదా ఈద్ ప్రార్థనలు పట్టణాలలో లేదా నగరాలలో చేయుటకన్నా ఊరి పొలిమేరల్లో చేయుట మిక్కిలి పుణ్యకార్యం.[5]
- మస్జిద్ లలో ఈద్ ప్రార్థనలు చేస్తే అవి పరిపూర్ణాలే కాని ఈద్ గాహ్ (సాధారణంగా ఊరి పొలిమేరల్లో ఉంటాయి) లో చేయడం సున్నహ్. ఇలా చేయకపోవడం సున్నహ్ కు వ్యతిరేకమౌతుంది.[6]
- ఈద్ ప్రార్థనలు ఊరి పొలిమేరల్లోని సామూహిక ప్రార్థనలు. ఒక వేళ పట్టణాల్లో నగరాల్లో ఇలాంటి సౌకర్యం లేకపోతే అవసరానుగుణంగా ఒక ప్రత్యేకమైన మైదానం ఏర్పాటు చేసుకోవాలి. మస్జిద్ లోకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు. కాని మైదానాల్లో సామూహిక ప్రార్థనలు ఉత్తమం.[7]
- ఈద్ గాహ్ లో ఈద్ ప్రార్థనలు చేయడం 'సున్నత్-ఎ-ముఅక్కదా'. ముసలివాళ్ళకు మస్జిద్ లోనే ప్రార్థనలు చేసుకోవచ్చు.[8]
మూలాలు
మార్చు- ↑ Performance of Eid Salah in Eidgah (Open Field)
- ↑ "Eidgah". Archived from the original on 2007-12-21. Retrieved 2008-06-23.
- ↑ (Mariful Hadîth, Vol. 3, P.399)
- ↑ Performance of Eid Salah in Eidgah (Open Field)
- ↑ (Fatwa Darul Uloom, Vol 5, P. 208)
- ↑ (Fatwa Darul Uloom, Vol. 5, P.2261)
- ↑ (Ahsanul Fatwa, Vol. 4, P. 119)
- ↑ (Fatwa Rahimiyah, Vol. 1, P.276)