సున్నహ్ అరబ్బీ : (سنة) సాహిత్యపరంగా చూస్తే దిశీకరించిన మార్గము, ప్రవక్తగారి సున్నహ్ (ఉర్దూ : సున్నత్) అనగా ప్రవక్తగారి మార్గము. సున్నీ ముస్లింల దృష్టికోణంలో ఇస్లామీయ ధార్మిక సంప్రదాయాల ప్రకారం మహమ్మదు ప్రవక్త గారు ప్రవచించిన సూత్రాలు, జీవనవిధానాలు, ధార్మికచింతనలూ, తన ప్రవక్తధర్మకాలమైన (ఇస్లాం మత ప్రకటన సుమయంనుండి ప్రవక్త మరణించినప్పటివరకూగల) 23 సంవత్సరాలలో ప్రవక్తగారి జీవనవిధానము, సహాబాల ద్వారా పాటింపబడిన ప్రవక్తగారిజీవనవిధానమూ, నేటివరకూ అవి ఇస్లామీయ సూత్రాలై మార్గదర్శకత్వాన్నిస్తున్నాయి. కొందరైతే ఈ విధానలన్నీ ఇబ్రాహీం ప్రవక్తచే సూచించబడినవనీ, మహమ్మదు ప్రవక్త వీటిని మరలా ప్రారంభించారని కూడా అంటారు.

వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

హదీసులు (అరబ్బీ : حديث, బహువచనం. أحاديث) కూడా "ప్రవక్తగారి సూక్తులూ , ఆచరణాలే", ఇవన్నీ సున్నహ్ కు అనుసరించేవుంటాయి.

'సున్నహ్', 'హదీసులు' ఒకేలా అనిపిస్తాయి,, నానార్థాలు కూడా.

సున్నహ్ , హదీస్

మార్చు

సున్నహ్ మహమ్మదు ప్రవక్త గారి కార్యాచరణాలైతే, వాటి క్రోడీకరణలే హదీసులు.

ఇస్లాం ప్రారంభకాలపు సున్నీ పండితులు

మార్చు

ఈ పండితులు సున్నహ్ ను సీరా (ఉర్దూ : సీరత్ ) కు సమానమేనని భావిస్తారు. ఈ 'సున్నహ్', 'సీరత్' ల గ్రంథీకరణమే 'హదీస్ '

నవీన సున్నీ పండితులు

మార్చు

నవీన సున్నీ పండితులు 'సీరత్', 'హదీస్' లను వేరు వేరు దృక్కోణంలో చూస్తున్నారు. ఇస్లామీయ న్యాయశాస్త్రవిభాగమయిన ఫిఖహ్ను న్యాయంచేయాలంటే సీరత్, హదీసుల విషయంలో పకడ్బందీగావుండాలనుకొంటారు, కారణం 'ఫిఖహ్' కు మూలాధారాలు ఈ 'సీరత్', 'హదీసు'లే.

ప్రవక్తగారి సున్నహ్ యొక్క సాంప్రదాయక దృష్టి

మార్చు

సాంప్రదాయక ముస్లింలు, ఖురాన్ సూక్తులను విశ్వసిస్తారు. ఈ సూక్తి, "అలాంటిదే ( మీ హితముకోరి మీకు ఇంతకు ముందే ఇవ్వబడినది)మేము (అల్లాహ్) మీమధ్యలోనే మీనుండే ఒకప్రవక్తను అవతరింపజేశాము, (ఇతను) నాసూక్తులను వివరిస్తారు, మీ జీవితాలను ఉద్దరిస్తారు, మీకు గ్రంథం (ఖురాన్) , విజ్ఞానాన్ని చేరవేస్తారు, మిమ్మల్ని తెలీని విషయాలను బోధిస్తారు, కావున మీరు నన్ను గుర్తుపెట్టుకోండి, నేనూ మిమ్మల్ని గుర్తుంచుకొంటాను. ధన్యవాదులుగా జీవించండి, మిమ్మల్ని ప్రసాదించినవాటిపట్ల తిరస్కారధోరణి ప్రదర్శించకండి." (2:151). సున్నహ్ లోని ఎన్నోవిషయాలు, ఇబ్రాహీం ప్రవక్తగారి సాంప్రదాయాలనుండి ఉద్భవించినవే, ఖురాన్ లో ఈవిధంగా నిర్వచింపబడినది ", "ఇబ్రాహీం జాతిని అనుసరించినవాడు, ఆ ఇబ్రాహీం ఎవరైతే ఏకేశ్వరోపాసకుడుగాజీవించాడో, అల్లాహ్ కు భాగస్వామి గా ఎవరినీ వుంచలేదో (అలాంటివాడు స్వర్గార్హుడు), ఆ ఇబ్రాహీంని అల్లాహ్ స్నేహితుణ్ణిచేసుకొన్నాడు.'" (4:125).

ఖురాన్ లో ప్రవచించినట్లు మిమ్మల్ని శుధ్ధిచేయుటకు , గ్రంధాన్ని , విజ్ఞానాన్ని బోధించుటకు... మాత్రమే మహమ్మద్ ప్రవక్త భూమిపై పంపబడ్డారా?, దీనికేగాదు, మహమ్మద్ గారి మిషన్ ఇలా బోధించడంతో పాటు, తనజీవితంలో ఆచరించి మానవులందరికీ అర్థమయ్యేట్లా అమలు చేసి ఒక మార్గదర్శకునిగా, దార్శనికునిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఖురాన్ బోధనలను సూక్తులను చెప్పి వదలివేయలేదు. దీంతోపాటు, ఖురాన్ సూక్తి " మీరు సత్యముగా అల్లాహ్ వార్తాహరులు, ( మహమ్మదు ప్రవక్త) సర్వోత్తమ ఉదాహరణ, ఎవరైతే అల్లాహ్ యందు ప్రళయదినాన విశ్వాసముంచి , అల్లాహ్ స్తోత్రములు , కీర్తనలు చేస్తూ జీవనం సాగిస్తారో (వారికి)." (33:21) , ఇంకనూ మహమ్మదు ప్రవక్తగారి మార్గదర్శకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరవిస్తూ ప్రేరణ పొందుతారు.

ఇంకో అతిముఖ్యమైన సాంప్రదాయక విషయం, ముస్లింలందరూ మహమ్మద్ ప్రవక్త పూజింపబడుటకు రాలేదు ఎవడైతే పూజింపబ (డుతాడో) డాలో (అల్లాహ్) అతడిని ప్రజలు గుర్తించేలా చేయడానికి వచ్చారు, అని ప్రగాఢంగా నమ్ముతారు. సున్నహ్ లో ఖురాన్ మార్గదర్శకాలను వ్యవస్థీకరించే అన్ని వనరులూ కలవు.

ఇవీ చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సున్నహ్&oldid=3715515" నుండి వెలికితీశారు