ఈశ్వరప్రభుఅసలు పేరు దాసరి వెంకటేశ్వర్లు. నాస్తికుడు,హేతువాది. జూన్ 10, 1908 గుంటూరు జిల్లా, చుండూరు మండలం పెదగాదెలవర్రులో జననం.11.10.1949న గజెట్ ద్వారా పేరు మార్చుకున్నాడు. 12వ ఏట మొక్కుతీర్చటం కోసం తల్లిదండ్రులు తిరుపతి తీసుకెళ్తే అక్కడి తంతులు చూసి తనకు ఆ వయసులోనే నాస్తిక భావాలకు బీజం పడిందంటారు. చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. గోరా నాస్తిక కేంద్రం స్థాపించకముందే ఈయన పెదపులివర్రు (భట్టిప్రోలు)లో తన తమ్ముడు దాసరి సుబ్రహ్మణ్యం పెళ్ళి దండల మార్పిడితో తెలుగు మాటలతో సహపంక్తిబోజనాలతో జరిపించారు.

రచనలు మార్చు

  • బుద్ధుడు చారిత్రక పురుషుడా?
  • పంచాంగం హోల్ మొత్తం అబద్ధం
  • హేతుమానవ విజ్ఞాన గేయాలు
  • మతగ్రంధాల మాయాబజార్
  • పుష్కరాల పురాణాల బండారం