ఈ చరిత్ర ఏ సిరాతో
ఈ చరిత్ర ఏ సిరాతో 1982లో విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై గోగినేని ప్రసాద్, యు.రాజేంద్ర ప్రసాద్లు నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శివాజీ రాజా సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాను చెరబండరాజుకు అంకితం ఇచ్చారు.
ఈ చరిత్ర ఏ సిరాతో (1982 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వేజెళ్ళ సత్యనారాయణ |
తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, జ్యోతి |
సంగీతం | శివాజీరాజా |
నిర్మాణ సంస్థ | నవతరం పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ చిత్రంలో నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ఎన్నుకున్నారు. వరకట్న సమస్య రిజర్వేషన్ల సమస్య, అవినీతి లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం సమస్యలు కూడా ఇందులో ఉన్నాయి. దేశ కాలమాన పరిస్థితులకు అద్దం పట్టి సమజాన్ని చైతన్యవంతం చేసి యువతరాన్ని సక్రమ పంథాలో నడిపించ వలసిన కవులు, రచయితలు, స్వార్థపరులకు తొత్తులుగా మారితే జరిగే అనర్థాలనుకూడా ఇందులో ప్రస్తావించారు.
సుభాష్ చంద్రబోస్, ఫృధ్వి, పవన్, మరో యిద్దరు యువకులు కళాశాలలో సహాథ్యాయులు, మిత్రులు. పవన్ మేనమామ కూతురు మాల తన బావ పరీక్ష ఫీజు తాను కట్టి తాను పరీక్షలకు గైర్హాజరవుతుంది. బోస్ బృందం యావత్తూ పరీక్షలలో కృతార్థులవుతారు. ఉద్యోగాల వేట ప్రారంభిస్తారు. బోస్ తాను చర్మకారుడు కొడుకు అయినప్పటికీ రిజర్వేషన్ల జాబితాలో కాకుండా సాధారణ జాబితాలో పేరు నమోదు చేసుకుంటారు. ఫృథ్వి తమ కుటుంబానికి ఆధారమైన అరటి తోటను, ఆశ్రయమిస్తున్న ఇంటిని తాకట్టుగా పెట్టిపదివేల రూపాయలను ఉద్యోగుల బ్రోకర్ కు యిచ్చి మోసపోయి తన మూఅంగా బికారులుగా మారిన తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. బోస్ పట్నం పోయి చెప్పులు కుట్టుకొనే వృత్తి ప్రారంభిస్తాడు. పవన్ జట్టు మాల సాయంతో రోడ్డుప్రక్కన హోటలు పెట్టి పెద్ద హోటల్ వారి మూలంగా దెబ్బ తింటారు. వ్యవస్థారావు అనే పెద్ద మనిషి మూలంగా బిచ్చ గాండ్ర జట్తులో చేరుతారు. లెక్చరర్ సూర్యం,మాల వారిని జాగృతం చేయడానికి ప్రయత్నిస్తారు.[2]
తారాగణం
మార్చు- రాజేంద్రప్రసాద్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రంగనాథ్
- నూతన్ ప్రసాద్
- శివకృష్ణ
- సాయిచంద్
- పి.ఎల్.నారాయణ
- గోకిన రామారావు
- డా. ఎన్.శివప్రసాద్
- వల్లం నరసింహారావు
- జ్యోతి
- అనుపమ
- రాళ్లబండి కామేశ్వరరావు
- రాజావర్మ
- బేబీ నవలత
- ధనశ్రీ
- బిందుమాధవి (పాత నటి)
- డబ్బింగ్ జానకి
- తాతినేని రాజేశ్వరి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
- స్టుడియో: సాయిలక్ష్మి పిక్చర్స్
- నిర్మాతలు: గోగినేని ప్రసాద్, యు. రాజేంద్ర ప్రసాద్
- సంగీతం: శివాజీరాజా
- విడుదల తేదీ: 1982 ఆగస్టు 14
- సమర్పణ: అట్లూరి మోహన్ గాంధీ
పాటల జాబితా
మార్చు1.కన్నుల ముందే కదులుతున్నది సస్య శ్యామల దేశమన్నది, రచన: కోపల్లె శివరాం , గానం.గేదెల ఆనంద్ బృందం
2.ఎక్కడున్నది ఎక్కడున్నది సస్య శ్యామల దేశమన్నది, రచన: కోపల్లె శివరాం, గానం.గేదెల ఆనంద్,మాధవపెద్ది రమేష్ బృందం
3.కాలేజీ చిన్నది కౌగిట్లో ఉన్నది, రచన: కోపల్లే శివరాం, గానం.నందమూరి రాజా, ఎం.రమేష్, వాణి జయరాం
4.చదివినోళ్ళని మాకు పేరండి జనులారా, రచన: డా.నేలుట్ల, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎం.రమేష్, పుష్పలత బృందం
5.జీవితం కలవంటిది వెన్నెల వల వంటిది, రచన: కొపల్లె శివరాం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం బృందం
6.నేడే దేశానికి స్వాతంత్ర్యదినం నేడే దేశ ప్రజకు స్వేచ్చా, రచన: కోపల్లె శివరాం, మాధవపెద్ది రమేష్.
మూలాలు
మార్చు- ↑ "Ee Charitra A Siratho (1982)". Indiancine.ma. Retrieved 2020-08-18.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-18.
. 3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.