జ్యోతి దక్షిణ భారతీయ చిత్రాలలో నటించిన సినీనటి. ఈమె సుమారు 50 సినిమాలలో నటించింది[1].[2] ఈమె నటించిన సినిమాలలో తూర్పు వెళ్ళే రైలు, వంశవృక్షం మొదలైనవి చెప్పుకోదగ్గవి. ఈమె పదుకవితై అనే తమిళసినిమాలో రజనీకాంత్‌ సరసన నటించింది.

జ్యోతి
వంశవృక్షం సినిమాలో జ్యోతి
జననం
జ్యోతి

1963
మరణం2007 మే 18(2007-05-18) (వయసు 44)[1]
వృత్తిసినిమా నటి

సినిమాల జాబితా

మార్చు

జ్యోతి నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు వివరణ
1979 తూర్పు వెళ్ళే రైలు అలిమేలు
1980 వంశవృక్షం ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు
1980 సినిమా పిచ్చోడు
1982 మల్లెపందిరి శ్యామల
1982 మరో మలుపు
1983 ఈ దేశంలో ఒకరోజు
1983 ఈ పిల్లకు పెళ్ళవుతుందా
1985 కలికాలం ఆడది
1985 భలే తమ్ముడు నీలవేణి
1985 శ్రీకట్నలీలలు
1987 అగ్నిపుత్రుడు గాయత్రి
1987 రాగలీల
1989 అశోక చక్రవర్తి రుక్మిణి
1990 చిన్న కోడలు
1991 స్టూవర్టుపురం పోలీసుస్టేషన్
1991 ఇంద్రభవనం
1991 సూర్య ఐ.పి.ఎస్ పార్వతి
1991 నిర్ణయం నళిని
1992 కిల్లర్ లలిత
1992 ధర్మక్షేత్రం బెనర్జీ చెల్లెలు
1992 జోకర్ మామ సూపర్ అల్లుడు
1992 పోలీస్ బ్రదర్స్

ఈమె రెండేళ్ళుగా రొమ్ము క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స పొందుతూ 2007, మే 18న చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తన 44వ యేట కన్నుమూసింది. ఈమె భర్తకు విడాకులిచ్చి కూతురుతో చెన్నై శివార్లలో నివసిస్తూవుండేది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Superstar Rajinikanth's heroine passed away". chennai365.com. Retrieved 2020-02-13.
  2. "Tamil Actress Jothi passes away". news.oneindia.in. Archived from the original on 2014-11-06. Retrieved 2020-02-13.

బయటి లింకులు

మార్చు