ఉగాది కవి సమ్మేళనం

ఉగాది కవిసమ్మేళనం ప్రతి సంవత్సరాదికి పలు తెలుగు గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహించే కార్యక్రమం. కళాపోషకులు, సాహిత్యాభిమానులు, సాహిత్యసంస్థలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా వాటిలో కవులు పాల్గొని తమ కవితలను వినిపిస్తూంటారు. ఉగాది కవిసమ్మేళనం ఆకాశవాణిలోనూ, దూరదర్శన్‌లోనూ నిర్వహిస్తూంటారు. కవిసమ్మేళనంలో సాధారణంగా సందర్భం కనుక ఉగాది గురించో, వసంతం గురించో వ్రాసినా వాటి గురించే వ్రాయాలన్న నియమం ఏమీ లేదు.