ప్రధాన మెనూను తెరువు

రవీంద్ర భారతి (ఆంగ్లం: Ravindra Bharati) ఒక సాంసృతిక కళా భవనము. హైదరాబాదులో సైఫాబాద్ ప్రాంతంలో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది. శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిని పర్యవేక్షిస్తున్నారు.[1]

రవీంద్ర భారతి
Ravindra Bharathi on State Formation Day 2018.jpg
సాధారణ సమాచారం
రకంఆడిటోరియం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
భౌగోళికాంశాలు17°24′12″N 78°28′02″E / 17.4033°N 78.4672°E / 17.4033; 78.4672
ప్రారంభం11 మే, 1961
రూపకల్పన మరియు నిర్మాణం
వాస్తు శిల్పిమహ్మద్ ఫయజుద్ధీన్

నిర్మాణముసవరించు

రవీంద్రనాథ్ ఠాగూర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో 1960, మార్చి 23వ తేదీన రవీంద్రభారతికి శంకుస్థాపన చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా రవీంద్రభారతి 1961, మే 11న ప్రారంభించబడింది.[2] మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది. మొదట్లో ప్రభుత్వమే రవీంద్రభారతి నిర్వహణను చూసుకునేది. 1963లో స్వయంప్రతిపత్తి హోదా కల్పించడంతో 1989 వరకు మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దీని నిర్వహణ కొనసాగింది. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు అప్పగించడంతో, ఆ శాఖ సంచాలకులే దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు.[3][4]

 
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల (2018)కు ముస్తాబైన రవీంద్రభారతి

విశేషాలుసవరించు

 • ఇది మొత్తం ఏ సి (సెంట్రల్ ఏయిర్ కండిషన్ సిస్టం) చేయబడిన ఆడిటోరియం.
 • స్టేజి ప్రక్కన కల గ్రీన్ రూమ్స్ అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి. క్షణాలలో స్టేజి అలంకరణ మార్పు చేస్తుంటారు.
 • అందమైన ఉద్యానవనములు, ఫౌంటెన్స్, చుట్టూ ఉన్నాయి.
 • ఒకేసారిగా వెయ్యిమంది కూర్చుని చూసే వీలు కల అతి పెద్ద ఆడిటోరియం.
 • సమావేశాలకోసం సమావేశ మందిరం ఉంది. దీనిలో 150మంది కూర్చోవచ్చు.
 • సినిమా ప్రదర్శనలకోసం పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటుచేయబడింది. దీనిలో 122 సీట్లు ఉన్నాయి.
 • రవీంద్రభారతి ప్రాంగణంలో ఘంటసాల కళా వేదిక ఉంది.
 • దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.
 • ముందు వైపు హాలులో రవీంద్రనాధ్ ఠాగూర్ విగ్రహము ఉంది.
 • దీని తలుపులు, ప్రక్క గోడలు అన్నిటికి నాణ్యమైన కలపను వాడారు

కళాభవన్సవరించు

రవీంద్రభారతికి అనుసంధానిస్తూ వెనుకగా కళాభవన్ అనే భవనము నిర్మించారు. దీనిలో చిత్ర ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్, వస్త్ర ప్రదర్శనలు, ఇతర కళా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". మూలం నుండి 2 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 June 2019. Cite news requires |newspaper= (help)
 2. రవీంద్రభారతి కళా సారధి, సాక్షి, హైదరాబాద్ ఎడిషన్, 11.05.2018, పుట. 10
 3. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (29 July 2018). "సకల కళాభారతి!". మూలం నుండి 31 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 31 July 2018. Cite news requires |newspaper= (help)
 4. Telangana Today, Hyderabad (13 May 2019). "Ravindra Bharathi curating culture for 58 years". Madhulika Natcharaju. మూలం నుండి 13 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 13 May 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలుసవరించు