ఉజాన్ గంగూలీ

పశ్చిమ బెంగాల్ కు చెందిన నాటకరంగ, సినిమా నటుడు

ఉజాన్ గంగూలీ పశ్చిమ బెంగాల్ కు చెందిన నాటకరంగ, సినిమా నటుడు.[1] 2018లో పావెల్[2] దర్శకత్వం వహించిన రోసోగొల్లా సినిమాతో అరంగేట్రం చేసాడు. 2019 టాప్ 10 నటులలో ఒకరిగా పేరుపొందాడు.[3] టెలి సినీ అవార్డ్స్, బాల్టిమోర్, 2019లో జరిగిన నార్త్ అమెరికన్ బెంగాలీ కాన్ఫరెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నూతన నటుడిగా ఎంపికయ్యాడు.

ఉజాన్ గంగూలీ
జననం
విద్యజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం
వృత్తినటుడు
తల్లిదండ్రులు

వ్యక్తిగత జీవితం

మార్చు

సినీ దర్శకుడు కౌశిక్ గంగూలీ - నటి చుర్ని గంగూలీ దంపతులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో ఉజాన్ జన్మించాడు. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించాడు.[2]

సినిమారంగం

మార్చు

ఉజాన్ గంగూలీ 2013లో స్మైక్‌ లో 50 ఏళ్ళ ప్రధానోపధ్యాయుడి పాత్రను పోషించాడు.[4] 2018లో పావెల్ దర్శకత్వం వహించిన రోసోగొల్లా సినిమాతో పెద్ద తెరపైకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో రోసోగొల్ల సృష్టికర్త నోబిన్ చంద్ర దాస్ పాత్రను పోషించాడు.[5] తర్వాత జాతీయ అవార్డు పొందిన నాగర్కీర్తన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 2019లో యునెస్కో ఫెల్లిని అవార్డు గ్రహీత దర్శకుడు కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించిన లోఖి చెలే సినిమాలో నటించాడు.[6] [7]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2018 రోసోగొల్ల నోబిన్ చంద్ర దాస్
2022 లోఖీ చేలే అమీర్ హుస్సేన్
2023 దిల్ ఖుష్ రహూల్ ముఖర్జీ

మూలాలు

మార్చు
  1. "Ujaan Ganguly turns 21 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
  2. 2.0 2.1 "Here's how Ujaan Ganguly plans to maintain the balance between academic and acting career". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
  3. "Round Up 2018 – Best performances by Male actors in Bengali cinema in 2018". Bangla Cinema. 2019-01-04. Archived from the original on 2020-02-15. Retrieved 2023-07-31.
  4. "On A Sweet Note". Indulge Express. Retrieved 2023-07-31.
  5. "Ujaan Ganguly on how he became Nabin Chandra Das in 'Rosogolla'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
  6. "Kaushik Ganguly to direct his son Ujaan in Lokhhi Chele produced by Shiboprosad and Nandita Roy". Indulge Express.
  7. "'লক্ষ্মী ছেলে' উজানকে বড় পর্দায় আনছেন কৌশিক গাঙ্গুলি, নেপথ্যে শিবু-নন্দিতা". Mahanagar24x7. 1 July 2019. Retrieved 2023-07-31.[permanent dead link]

బయటి లింకులు

మార్చు