కౌశిక్ గంగూలీ

పశ్చిమ బెంగాల్ కు చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు

కౌశిక్ గంగూలీ[1] పశ్చిమ బెంగాల్ కు చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, బెంగాలీ సినిమా నటుడు.[2] జాతీయ చలనచిత్ర అవార్డులు పొందిన[3] ఉష్నతర్ జాన్యే (2003), అరెక్తి ప్రీమర్ గోల్పో (2010), నాగర్కీర్తన్ (2017) వంటి వివిధ కోణాలను అన్వేషించే సినిమాలను రూపొందించడంలో ప్రసిద్ది చెందాడు.[4] 2019లో ఫిల్మ్ కంపానియన్ గంగూలీ దర్శకత్వం వహించిన నాగర్‌కీర్తన్‌లో రిధి సేన్ నటనను దశాబ్దంలో 100 గొప్ప నటనలో ఒకటిగా పేర్కొంది.[5]

కౌశిక్ గంగూలీ
జననం (1968-08-04) 1968 ఆగస్టు 4 (వయసు 56)
విద్యాసంస్థజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు
జీవిత భాగస్వామిచుర్నీ గంగూలీ
పిల్లలుఉజాన్ గంగూలీ (కుమారుడు)
తల్లిదండ్రులుసునీల్ గంగూలీ (తండ్రి)

గంగూలీ 1968, ఆగస్టు 4న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జన్మించాడు. తండ్రి గిటారిస్ట్ సునీల్ గంగూలీ.[6] నరేంద్రపూర్ లోని రామకృష్ణ మిషన్ విద్యాలయంలో, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో బెంగాలీ సాహిత్యంలో డిగ్రీ చేశాడు.

విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు నటి చుర్నీ గంగూలీ (గంగూలీ భార్య), సుమన్ ముఖోపాధ్యాయలతో కలిసి నాటక సంస్థను ప్రారంభించాడు. 1987లో గంగూలీ తెలుగు సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. 1995లో ఉష్ణాతర్ జాన్యే, ఉల్కా, అతిథి వంటి టెలిఫిల్మ్‌లకు దర్శకత్వం వహించడానికి ఈటివి బంగ్లాలో చేరాడు. ఈ టెలిఫిల్మ్‌లలోని లెస్బియానిజం, లింగ నిర్ధారణ వంటి అంశాలను ఇంతకుముందు ఏ బెంగాలీ టెలివిజన్ ప్రొడక్షన్‌లలో చిత్రీకరించలేదు.[7]

సినిమారంగం

మార్చు

2004లో వచ్చిన సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 15 సినిమాలకు పైగా దర్శకత్వం వహించాడు, అనేక అవార్డులను గెలుచుకున్నాడు. 2011లో ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్న ల్యాప్‌టాప్, ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న శబ్దో (2012), ఛోటోడర్ చోబీ (2015) వంటి సినిమాలు తీశాడు. 2017 అబిర్ ఛటర్జీ, కోయెల్ మల్లిక్, రిత్విక్ చక్రవర్తి నటించిన ఛాయా ఓ చోబి అనే బెంగాలీ సినిమాకు, రిద్ధి సేన్, రిత్విక్ చక్రవర్తి నటించిన నాగర్‌కీర్తన్ సినిమాకు దర్శకత్వం వహించాడు.[8]

సినిమాలు

మార్చు

దర్శకుడిగా

మార్చు
సంవత్సరం సినిమా మూలాలు
2004 వారిష్
2005 శూన్యో ఇ బుకే
ఏక్ ముతో చాబీ
2009 బ్రేక్ ఫెయిల్
జాక్‌పాట్
2010 అరెక్తి ప్రేమర్ గోల్పో
2011 రంగ్ మిలాంటి
2012 ల్యాప్‌టాప్
శబ్దో
2013 కేరాఫ్ సర్
అపూర్ పాంచాలి
2014 ఖాద్
2015 చోటోడర్ చోబీ
2016 బస్తు షాప్
సినిమావాలా
2017 బిషోర్జన్
ఛాయా ఓ చోబీ
నాగర్కీర్తన్
2018 దృష్టికోన్
కిషోర్ కుమార్ జూనియర్
2019 బిజోయా
జ్యేష్ఠోపుత్రో
2022 లోఖీ చేలే [9]
2023 కబేరి అంతర్ధాన్
అర్ధాంగిని [10]
పాలన్
మనోహర్ పాండే [11]
కబడ్డీ కబడ్డీ
అసుఖ్ బిసుఖ్
ధూమ్కేతు

నటుడిగా

మార్చు
సంవత్సరం సినిమా/వెబ్ సిరీస్ దర్శకుడు
2010 నోటోబోర్ నాటౌట్ కమలేశ్వర్ ముఖర్జీ
2012 ల్యాప్‌టాప్ కౌశిక్ గంగూలీ
2013 కనగల్ మల్సత్ సుమన్ ముఖోపాధ్యాయ
2014 ఖాద్ కౌశిక్ గంగూలీ
నిర్బాషితో చుర్ని గంగూలీ
చోటుష్కోన్ శ్రీజిత్ ముఖర్జీ
2016 బస్తు షాప్ కౌశిక్ గంగూలీ
2017 బిషోర్జన్ కౌశిక్ గంగూలీ
2018 దృష్టికోన్ కౌశిక్ గంగూలీ
క ఖ గ ఘ కృష్ణేందు ఛటర్జీ
2019 బిజోయా కౌశిక్ గంగూలీ
శంకర్ ముడి అనికేత్ చటోపాధ్యాయ
తారిఖ్ చుర్ని గంగూలీ
సాత్ నం. శనాతన్ సన్యాల్ అన్నపూర్ణ బసు
కేదార ఇంద్రదీప్ దాస్‌గుప్తా
2021 ఈ అమీ రేణు సౌమెన్ సుర్
2022 టిక్టికి (వెబ్ సిరీస్) ధృబో బెనర్జీ
ప్రాంకెన్‌స్టెయిన్ (వెబ్ సిరీస్) సాగ్నిక్ ఛటర్జీ
బిస్మిల్లా ఇంద్రదీప్ దాస్‌గుప్తా
కోథామృతో జిత్ చక్రవర్తి
శుభో బిజోయ రోహన్ సేన్
ఉత్తరన్ ఇంద్రదీప్ దాస్‌గుప్తా
2023 షికార్‌పూర్ (వెబ్ సిరీస్) నిర్జర్ మిత్ర
కబేరి అంతర్ధాన్ కౌశిక్ గంగూలీ
ఆరో ఏక్ పృథిబి అటాను ఘోష్
రాజనీతి (వెబ్ సిరీస్) సౌరవ్ చక్రవర్తి
బినోదిని: ఏక్తి నటిర్ ఉపాఖ్యాన్ రామ్ కమల్ ముఖర్జీ

టెలివిజన్

మార్చు
  • హరిహరన్
  • ఉల్కా
  • అతిథి
  • శేష్ కృత్య
  • కోల్లెజ్
  • ఛాయాచోబి
  • ఛద్మబేషి
  • డయాగ్నోసిస్
  • డి-రే
  • 2003: ఘరే ఓ బైరీ
  • 2003: ఉష్నాతర్ జాన్యే
  • 2010: బంధోబి
  • 2010: బాగ్ నోఖ్[12]

స్క్రీన్ ప్లే రచయిత

మార్చు
  • 2005: శూన్యో ఇ బుకే
  • 2009: జాక్‌పాట్
  • 2010: అరెక్తి ప్రీమర్ గోల్పో
  • 2011: రంగ్ మిలాంటి
  • 2012: ల్యాప్‌టాప్

అవార్డులు

మార్చు
 
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 2015లో సినిమావాలా చిత్రానికి 'ఐసిఎఫ్టీ -యునెస్కో అవార్డు' అందుకున్న గంగూలీ

కౌశిక్ గంగూలీ పలు సినిమాలకు అవార్డులను అందుకున్నాడు.[13]

  • 2012: బెంగాలీలో ఉత్తమ చలనచిత్రంగా 60వ జాతీయ చలనచిత్ర అవార్డులు: శబ్దో
  • 2013: 44వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో అపూర్ పాంచాలి సినిమాకు ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ దర్శకుడు అవార్డు
  • 2014: ఫిలింఫేర్ అవార్డ్స్ ఈస్ట్‌లో శబ్దో చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నామినేట్
  • 2014: ఫిలింఫేర్ అవార్డ్స్ ఈస్ట్‌లో శబ్దో చిత్రానికి ఉత్తమ చలనచిత్ర విమర్శకుల ఎంపిక విజేత
  • 2014: ఫిలింఫేర్ అవార్డ్స్ ఈస్ట్‌లో కనగల్ మల్సత్ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నామినేట్
  • 2015: ఛోటోడర్ చోబి సినిమాకు ఇతర సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు
  • 2015: 46వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డులలో సినిమావాలా సినిమాకు గాంధీ మెడల్
  • 2017: బెంగాలీలో ఉత్తమ చలన చిత్రంగా 64వ జాతీయ చలనచిత్ర అవార్డులు: బిషోర్జన్
  • 2018: జాతీయ చలనచిత్ర అవార్డు - నాగర్‌కీర్తన్‌ సినిమాకు ప్రత్యేక జ్యూరీ అవార్డు (ఫీచర్ ఫిల్మ్).
  • 2021: జ్యేష్ఠోపుత్రో సినిమాకు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో 67వ జాతీయ చలనచిత్ర అవార్డులు
  • 2021: జ్యేష్ఠోపుత్రో సినిమాకు ఉత్తమ దర్శకుడిగా 4వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు బంగ్లా

మూలాలు

మార్చు
  1. "Kaushik Ganguly: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India. Retrieved 2023-07-31.
  2. "Bengali filmmaker Kaushik Ganguly begins filming Bollywood debut 'Manohar Pandey'". DNA India (in ఇంగ్లీష్). 2021-01-28. Retrieved 2023-07-31.
  3. "Kaushik Ganguly - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2023-07-31.
  4. "The Big Interview! Kaushik Ganguly: Will never promote my family through my films - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 18 October 2020.
  5. "100 Greatest Performances of the Decade". 100 Greatest Performances of the Decade (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
  6. Ghosal, Sharmistha (2022-08-25). "Kaushik Ganguly and Ujaan Ganguly talk about their film Lokkhi Chhele which releases today". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
  7. "Did you know director Kaushik Ganguly started his career as a teacher? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 10 November 2020.
  8. "Kaushik Ganguly - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2023-07-31.
  9. ""ঈশ্বর যখন মানুষের শরণে", কৌশিকের 'লক্ষ্মী ছেলে'-র বাস্তব গল্প". Indian Express Bangla. 15 October 2019. Retrieved 2021-02-15.
  10. "The shoot of Ardhangini has started! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 12 November 2019. Retrieved 2021-02-15.
  11. "Exclusive Interview! Kaushik Ganguly: The Lockdown evolved our relationships and 'Manohar Pandey' is all about that - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 15 February 2021. Retrieved 2023-07-31.
  12. Ganguly, Ruman (7 April 2010). "Gaurav makes his dad proud". The Times of India. Archived from the original on 9 May 2012. Retrieved 2023-07-31.
  13. "I don't take myself seriously as a filmmaker, says Kaushik Ganguly". Hindustan Times (in ఇంగ్లీష్). 5 December 2015.

బయటి లింకులు

మార్చు