ఉదయ్ ప్రకాష్
ఉదయ్ ప్రకాష్ తమిళ తెలుగు సినిమాలలో నటుడు. ఉదయ్ ప్రకాష్ ఫుట్బాల్ ఆటగాడు కూడా. ఉదయ ప్రకాష్ తెలుగులో విజయశాంతి నటించిన కర్తవ్యంసినిమాలో అట్లూరి పుండరీకాక్షయ్య కుమారుడిగా చక్రవర్తి పాత్రలో నటించాడు.
ఉదయ్ ప్రకాష్ | |
---|---|
జననం | 1964 జూన్ 19 ఊటీ తమిళనాడు భారతదేశం |
మరణం | 2004 ఆగస్టు 18 చెన్నై తమిళనాడు భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
సినీ జీవితం
మార్చుఉదయ ప్రకాష్ తెలుగులో విజయశాంతినటించిన కర్తవ్యం సినిమాలో అట్లూరి పుండరీకాక్షయ్య కొడుకుగా నటించాడు. ఈ సినిమాలో ఉదయ్ ప్రకాష్ ప్రతినాయకుడిగా కూడా నటించాడు. ఉదయ్ ప్రకాష్ చిన్న తంబి. అనే తమిళ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. ఉదయ్ ప్రకాష్ కు ఈ సినిమా ద్వారా గుర్తింపు వచ్చింది.
మరణం
మార్చుఉదయ్ ప్రకాష్ మద్యం ఎక్కువగా సేవిస్తుండేవాడు దీంతో అతనికి సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలలో అవకాశాలు రాక ఉదయ్ ప్రకాష్ అప్పులు ఎక్కువగా చేస్తుండేవాడు. తర్వాత చెన్నైకి వెళ్ళిపోయాడు. తర్వాత ఉదయ్ ప్రకాష్ ఒక గుడిసెలో ఒక వృద్ధురాలితో నివసించేవాడు. ఉదయ్ ప్రకాష్ పరిస్థితిని చూసిన నటుడు శరత్ కుమార్ తన దివాన్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఉదయ్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. తానిక తాగుడు మానుకుంటానని చెప్పాడు. ఉదయ్ ప్రకాష్ కాలేయ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. దర్శకుడు పి.వాసు ఉదయ్ ప్రకాష్ చికిత్స కొరకు డబ్బులు సమకూర్చారు. ఉదయ్ ప్రకాష్ కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి మద్యం మత్తులో నడిగర్ సంఘం వద్దకు చేరుకుని కుప్పకూలిపోయి మృతి చెందాడు.
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
1989 | వరుషం పదినారు | తమిళం | ||
1990 | కర్తవ్యం | చక్రవర్తి | తెలుగు | |
1990 | పుదు పుదు రాగంగళ్ | తమిళం | ||
1991 | అంబు సంగిలి | విశ్వనాథ్ | తమిళం | |
1991 | చిన్న తంబి | తమిళం | ||
1991 | ఇధయ వాసల్ | పోలీస్ అధికారి | తమిళం | |
1991 | కిజక్కు కరై | తమిళం | ||
1991 | మన్నన్ | తమిళం | ||
1992 | ఇదు నమ్మ భూమి | తమిళం | ||
1992 | సముండి | తమిళం | ||
1992 | పెద్దరికం | తెలుగు | ||
1993 | ఉజైప్పాలి | తమిళం | ||
1993 | బ్యాండ్ మాస్టర్ | తమిళం | ||
1993 | కట్టబొమ్మన్ | రాజప్ప | తమిళం | |
2003 | దివాన్ | చంద్రన్ | తమిళం | |
2003 | కాదల్ కిరుక్కన్ | కవిధాంగెల్ | తమిళం | |
2004 | జైసూర్య | తమిళం | ||
2004 | సూపర్ డా | తమిళం |