ఉదయ్ భాన్
ఉదయ్ భాన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
ఉదయ్ భాన్ | |||
| |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | జగదీష్ నాయర్ | ||
---|---|---|---|
తరువాత | జగదీష్ నాయర్ | ||
నియోజకవర్గం | హోడాల్ | ||
పదవీ కాలం 2000 – 2009 | |||
ముందు | జగదీష్ నాయర్ | ||
తరువాత | నియోజకవర్గం రద్దయింది | ||
నియోజకవర్గం | హసన్‌పూర్ | ||
పదవీ కాలం 1987 – 1991 | |||
ముందు | రామ్ రత్తన్ | ||
తరువాత | జగదీష్ నాయర్ | ||
నియోజకవర్గం | హసన్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | లోక్‌దళ్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఉదయ్ భాన్ 2022 ఏప్రిల్ 27న హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (హెచ్‌పిసిసి) అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2][3]
రాజకీయ జీవితం
మార్చుఉదయ్ భాన్ లోక్‌దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1987 శాసనసభ ఎన్నికలలో హసన్‌పూర్ నుండి లోక్‌దళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఛోటే లాల్ పై 4,472 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన ఆ తరువాత జనతా పార్టీలో చేరి 1991 ఎన్నికలలో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్ భాన్ చేతిలో 4,855 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జగదీష్ నాయర్ 2000 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రామ్ రత్తన్ చేతిలో 835 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.
ఉదయ్ భాన్ 1996 శాసనసభ ఎన్నికలలో హసన్‌పూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి హెచ్‍విపి అభ్యర్థి జగదీష్ నాయర్ చేతిలో 5,570 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2000 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి జగదీష్ నాయర్‌పై 4,855 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఉదయ్ భాన్ ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2005 శాసనసభ ఎన్నికలలో హసన్‌పూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి జగదీష్ నాయర్‌పై 5,331 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఉదయ్ భాన్ 2009 శాసనసభ ఎన్నికలలో హోడాల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి జగదీష్ నాయర్ చేతిలో 2,621 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి జగదీష్ నాయర్‌పై 11,680 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]
ఉదయ్ భాన్ 2019 శాసనసభ ఎన్నికలలో హోడాల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జగదీష్ నాయర్ చేతిలో 3,387 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హరీందర్ సింగ్‌పై 2,595 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (4 October 2024). "Haryana's Hodal conundrum: Will end of 28-year-old rivalry favour Congress or BJP?" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
- ↑ The Hindu (27 April 2022). "Udai Bhan is new Haryana Pradesh Congress Committee president" (in Indian English). Retrieved 11 November 2024.
- ↑ Hindustantimes (27 April 2022). "Hooda loyalist Udai Bhan is new Haryana Congress chief". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
- ↑ The Tribune (15 September 2024). "Hodal to miss 28-yr-old poll rivalry between Bhan, Nayar" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
- ↑ TV9 Bharatvarsh (8 October 2024). "होडल विधानसभा सीट पर जीते BJP के हरिंदर सिंह रामरतन, कांग्रेस प्रदेश अध्यक्ष चौधरी उदयभान को दी शिकस्त". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Hodal". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.