ఉప్పరిపల్లి కృష్ణదాసు

ఉప్పరిపల్లి కృష్ణదాసు (సోలీపురం కృష్ణదాసు) తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు. సోలీపురం గురుభజన కీర్తనలు పేరుతో దాదాపు 250 పద్యాలు, కీర్తనలు రచించాడు.[1]

ఉప్పరిపల్లి కృష్ణదాసు
ఉప్పరిపల్లి కృష్ణదాసు
జననంసోలీపుం కృష్ణదాసు
1866
ఉప్పరిపల్లి, ఘన్‌పూర్ మండలం,వనపర్తి జిల్లా
మరణం1952
ఇతర పేర్లుసోలీపుం కృష్ణదాసు
మతంహిందూ
తండ్రినరసయ్య
తల్లిలక్ష్మీ నరసమ్మ

జీవిత విశేషాలు

మార్చు

కృష్ణదాసు 1866లో నరసయ్య, లక్ష్మీనరసమ్మ దంపతులకు వనపర్తి జిల్లా, ఘన్‌పూర్ మండలం, ఉప్పరిపల్లి గ్రామంలో జన్మించాడు. కృష్ణదాసు బాల్యం, విద్యాభ్యాసం అంతా ఆయన మేనమామలైన తిరునగరి పాపకవి, సింహకవి సమక్షంలో జరిగింది.[2]

రచనాప్రస్థానం

మార్చు

మేనమామలు పండితులు అవడం వలన సంస్కృతంపై పట్టు సాధించిన కృష్ణదాసు, కవిత్వ రచన ప్రారంభించాడు. సోలీపురం గురుభజన కీర్తనలు అనే పేరుతో 240 పద్యాలు, కీర్తనలు రాశాడు. భజనల ద్వారానే దేవుణ్ణి స్తుంతించాలని చాటి చెప్పాడు.

ఈయన 1952లో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. ఉప్పరిపల్లి కృష్ణదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 25
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 11 November 2019.