ఉమాసుందరి
ఉమాసుందరి చిత్రం 1956, జూలై 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీరంజని, నాగభూషణం, కన్నాంబ , రేలంగి, నాగయ్య , పేకేటి తదితరులు నటించగా, అశ్వద్దామ సంగీతం అందించారు.
ఉమాసుందరి (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.పుల్లయ్య |
---|---|
నిర్మాణం | ఎన్.అరుణలక్ష్మి |
తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీరంజని, నాగభూషణం, కన్నాంబ , రేలంగి, నాగయ్య , పేకేటి |
సంగీతం | అశ్వద్దామ |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జూపిటర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుమహారాజు భూపి (నాగయ్య) సోదరి ఉమాసుందరి (జూనియర్ శ్రీరంజని). ఆమె వదినె నీలవేణి (కన్నాంబ). పిల్లలులేని ఆ దంపతులు ఉమాసుందరిని గారాబంగా పెంచి పెద్ద చేస్తారు. ఉమాసుందరిని తన తమ్ముడు అలంకార భూపతి (రేలంగి)కి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటుంది నీలవేణి. ఉమాసుందరి అందుకు అంగీకరించక పోవటంతో ఆమెపై క్రోధం, అసూయ పెంచుకుంటుంది. రాయదుర్గం చక్రవర్తి విజయరాయలు (ఎన్టీఆర్) శివాలయంలో చూసి ఇష్టపడిన ఉమాసుందరితో వివాహానికి ఆమె అన్నగారికి కబురు చేస్తాడు. ఉమాసుందరి అంగీకారంతో వారిరువురికీ వివాహం జరుగుతుంది. ఉమాసుందరికి తొలుత మగబిడ్డ జన్మిస్తాడు. తరువాత వారికి వరుసగా ఆరుగురు సంతానం, దాంతోపాటు వారి రాజ్యంలో ‘సప్తవర్ష క్షామం’ ఏర్పడి.. రాజ్యం, ప్రజలు కడగండ్ల పాలవుతారు. పుట్టింటి సాయం కోసం ఉమాసుందరి పంపిన వర్తమానాలు, నీలవేణి కారణంగా అందకపోవటం జరుగుతుంది. భర్త సలహాతో పిల్లలతో పుట్టిల్లు చేరిన ఉమాసుందరిని వదిన నీలవేణి నానా హింసలు పెట్టి తరిమేస్తుంది. భూపతికి నిజం తెలిసి నీలవేణిని నిలదీయగా, ఆమె తన క్రోధం తెలిపి ఆత్మహత్య చేసుకుంటుంది. అడవిలో భార్యా పిల్లల కోసం వెదకుతున్న రాయలకు శివుడు (నాగభూషణం) జ్ఞానబోధ చేస్తాడు. పిల్లలను బావిలో తోసి తానూ మరణించాలనుకున్న ఉమాసుందరిని పార్వతీదేవి (రమాదేవి) అడ్డుపడి ఆపుతుంది. బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం, ఉల్లంఘన చేసి బొమ్మలను దాచుకుందని, దాని ఫలితంగానే ఈ కష్టాలని వివరిస్తుంది. ఇపుడు ఆమె పిల్లలను బావిలో వేయటంతో వ్రతం పూర్తైతే ఆమె కష్టాలు తొలిగాయని వివరిస్తుంది. భర్త రాయలు, అన్నగారు భూపతి రావటం, పిల్లలందరూ బ్రతికి రావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
పాటలు
మార్చు- అమ్మా శ్రీలజాత అఖిల లోకమాత - జిక్కి
- అంబా గుణనిధిరుంబా అమృత - నాగయ్య
- అమ్మాలార రారే ఓ కొమ్మలార రారె - జిక్కి బృందం
- అన్నా చెల్లెలు పుట్టినింటికి (పద్యం) - జిక్కి
- ఆపదలెన్ని వచ్చిన గృహంబు (పద్యం) - ఘంటసాల, రచన: సదాశివ బ్రహ్మం
- ఇల్లు వాకిలి వీడిపోదురు (పద్యం) - పి. లీల
- ఎందుకోయి రేరాజ మామీద దాడి - ఘంటసాల, జిక్కి, రచన: సదాశివ బ్రహ్మం
- తారసిల్లిన బాటసారులంతే (పద్యం) - ఘంటసాల, రచన: సదాశివ బ్రహ్మం
- తొమ్మిది తొర్రల బుర్ర దీని - పిఠాపురం నాగేశ్వరరావు
- దేవా ఉమా మహేశా మమ్ము (పద్యం) - ఘంటసాల, రచన; సదాశివ బ్రహ్మం
- దాటిపోగలడా నా చేయి దాటి పోగలడా - ఎ.పి. కోమల
- నమ్మకురా ఇల్లాలు పిల్లలు - పిఠాపురం నాగేశ్వరరావు, ఘంటసాల, రచన: సదాశివ బ్రహ్మం
- మాయా సంసారం తమ్ముడు - పిఠాపురం నాగేశ్వరరావు
- రాజు వెడలె పెళ్ళికి రవితేజము - పిఠాపురం నాగేశ్వరరావు
- రాకు రాకు నా జోలికి రాకు నీమాటంటె - మాధవపెద్ది సత్యం, ?
- రావమ్మ రాణి మహరాణి మా రాణి - ఎ.పి. కోమల బృందం
- రావొయి రావోయి రతనాల పాపాయి - నాగయ్య
- వెర్రి మదరి గంగ వెర్రులెత్తినపుడే (పద్యం)- పిఠాపురం నాగేశ్వరరావు
- ఎక్కడైతే నువ్వు నేను _పిఠాపురం నాగేశ్వరరావు
- పోనీ బండి పోనీ బావా ఇదేనోయే తోవ_పి.లీల, పిఠాపురం నాగేశ్వరరావు
- వల్లకాడులు వద్దన్నా_పిఠాపురం నాగేశ్వరరావు.
- రామే రాయే సిన్నదాన రంగైన పిల్లాదానా_పిఠాపురం నాగేశ్వరరావు.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రభూమి. "ఉమాసుందరి ఫ్లాష్‌బ్యాక్@ 50". Archived from the original on 15 మార్చి 2017. Retrieved 17 July 2017.